మంచి మాట

భక్తసులభుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతునిపై భక్తిని ప్రకటించడానికి మానవుడు, దానవుడు, పక్షి, జంతువు అన్న భేదాలు అక్కర్లేదని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. భక్తితత్వము చేత దైవత్వాన్ని పొందుటకు అవకాశము అధికారం అందరికీ ఉంది. దారులు కొట్టి తన జీవనయానాన్ని గడిపే రత్నాకరుడనే బోయివాడు నిత్యం రామనామం జపం చేసి చివరకు ఆదికవిగా మలచబడ్డాడు. ఆదికావ్యం అయిన రామాయణం వ్రాశాడు. ఆ రామాయణంలోనే భక్తికి ప్రతి ప్రాణి ప్రకటించవచ్చు అన్న అంశం తెలుస్తుంది.
రామాయణంలో జటాయువు ఓ పక్షిరాజు. దశరథమహారాజుకు స్నేహితుడుగా ఉండేవాడు. అందుకని దశరథుని కొడుకు రామునితో కూడా ఆయన ఎంతో స్నేహంగా ఉండేవాడు. సీతను రావణుడు అపహరించువేళ జటాయువునే రావణునికి అడ్డుపడి పోరాటం చేస్తాడు. తన శక్తినంతా కూడగట్టుకొని ఆ రాక్షసునితో యుద్ధంచేస్తాడు.
చివరకు జటాయువు పోరులో వెనకబడుటం వల్ల రెక్కలు తెగి కింద పడుతుంది. రావణుడు సీతమ్మవారినితీసుకొని వెళ్లిపోతాడు. జటాయువు ప్రాణాలుఉగ్గబట్టుకొని రాముడు వచ్చిన తరువాత జరిగిన విషయం చెప్పి ప్రాణాలు విడుస్తుంది. అట్లానే వానరజాతికి చెందిన హనుమంతుడు రామునికి బంటుగా ఉంటాడు. అనునిత్యమూ అనుక్షణమూ శ్రీరామ నామాన్ని పఠిస్తూ ఉండి రామునికి సీతమ్మ జాడ తెలిపి రామునికి ఆనందం కలిగించాడు.
హనుమంతుణ్ణి కూడా భగవంతుడుగా కొలిచేస్థాయికి వెళ్లాడు.
భక్తుని హృదయంలో భగవంతుడు ఎల్లవేళలా నిలిచిఉంటాడు.
ఒకానొక సమయంలో నారదమహర్షి నారాయణుని దర్శించడానికి వెళ్లాడు. అపుడు నారాయణుడు ‘‘నారదా! పంచభూతాల్లో ఏది గొప్పది అని అడిగాడు. నారదుడు భూమి, జలం, ఆకాశం ఇలా అన్ని చెప్పుతూ చెబుతూ చివరకు భక్తుడు గొప్పవాడా? భగవంతుడు గొప్పవాడా? అని నారాయణుడు నారదుని ప్రశ్నిస్తాడు. తిరిగి నారాయణుడే భగవంతుని బంధించే ప్రేమ పాశం ఒక్క భక్తునియందు మాత్రమే ఉంటుందంటాడు. కాని నారదుడు భగవంతుని కన్నా ఆయన కలిగించిన ప్రేమతత్వం అన్నింటికన్నాగొప్పది అని భక్తి మార్గం బోధిస్తుందని చెప్తాడు.
అనంతమైన సముద్రంలోని చిన్న నీటిచుక్కను మన చేతిలో ఉంచుకున్నప్పుడు ఆ నీటి చుక్కఅల్పంగా తోస్తుంది. కానీ ఈ అల్పమైన నీటిచుక్కను సముద్రంలో ఏకం చేస్తే అనంత స్వరూపంగా గోచరిస్తుంది. అలానే మానవత్వం యొక్క అల్పత్వాన్ని అధికత్వమైన దైవత్వంతో చేర్చినప్పుడు అది ‘‘బ్రహ్మ విత్ బ్రహ్మైవభవతిః ఏకత్వం గా రూపొందుతుంది. ఆ ఏకత్వాన్ని చేర్చే మహత్తరమైన మార్గమే భక్తిమార్గం. భక్తి కలిగిఉన్న హృదయంలోనే భగవంతునికి సుస్థిరస్థానం అనడానికి ఆనాటి రుక్మిణీదేవి భక్తే మనకు ఆదర్శప్రాయమైన ఆధారం.
శ్రీకృష్ణతులాభార సమయంలో భగవంతుని ప్రార్థిస్తూ ఇలా అంది రుక్మిణి ‘‘్భక్తి కలిగి ఉన్న వానికి నీవు వశమగుట సత్యమయితే ఈ తులసీదళానికి నీవు తూగుదుగాక’’ ఈ భక్తి అనేది మానవత్వంలో ఒక విశిష్టమైన స్థానం ఆక్రమించి ఉంది’’ నన్ను భక్తితో కొలిచేవారి యందు నాకు అధికమైన ప్రేమ ఉంటుంది అని గీతాచార్యుడు అన్నాడు.
భక్తుడయినవాడు ముఖ్యంగా శాంతితత్వమును అభ్యసించి ఉంటాడు. ధృడనిశ్చయం కలిగి ఉంటాడు. సంతృప్తిని చెంది ఉంటాడు. ఎలాంటి భాధలకు ఎలాంటి విచారమునకు మనసులో చోటు ఇవ్వకూడదు. అహంకారం వీఢాలి. మమకారం కూడా విడిచిపెట్టాలి.
భూమిని పరిశుభ్రం చేయకుండా విత్తనాలు నాటితే పంట అనుకొన్నంత ఎలా పండలేదో అట్లానే మనసులోని దుర్గుణాలను దూరం చేసుకొంటేనే గాని భక్తి కుదురుకోదు. భక్తి కుదరకపోతే భగవంతుడు హృదయపీఠం లోకి రాడు. వచ్చినా కాసేపట్లోనే అరిషడ్వర్గాలకు బానిసలు అయన వారు భగవంతుణ్ణి నిలుపుకోలేరు. భాగవతం ప్రహ్లాదుని భక్తిప్రపత్తులను ఆదర్శంగా చెప్పింది. భాగవతం చెప్పిన ప్రహ్లాదుని దినచర్యను గమనిస్తే అపుడు భక్తి ఏవిధంగా భక్తునిలో ఉండాలో తెలుస్తుంది. నిజమైన భక్తి శ్రద్ధలు కలిగిన మానవుని హృదయంలో ఎల్లప్పుడూ భగవంతుడు నివసిస్తాడు.దానివల్లలే భక్తసులభుడు, భక్తవత్సలుడు అని భగవంతుని కీర్తిస్తారు.

- శివాని