మంచి మాట

చాతుర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమ వాక్చాతుర్యాన్ని మెచ్చుకున్న రామచంద్రుడు పూర్వభాషి అన్న పేరు తెచ్చుకున్నవాడు. తనకు కనిపించిన వారినెవరైనా ముందుగా తానే పలకరించేవాడట. నేను రాజకుమారుడిని అనో, లేక రాజుగారినో అనో ఏ గర్వమును చూపేవాడు కాడట. అట్లాఅని ఆయన అతిగా మాట్లాడేవాడు కాడు. మితభాషి. ఎంత మాట్లాడాలో అంత మాట్లాడేవాడట. సంభాషణలలో చతురత్వం చూపేవాడట. ఆయనతో కూడా ఉన్న వారందరూ ఎఫుడూ నవ్వుతూ సంతోషంగా ఉండేవారట.
అటువంటి రాముడు హనుమంతుడిని సంభాషణాచతురుడని మెచ్చుకున్నాడు. మొట్టమొదట సుగ్రీవుడు దూరంనుంచి రామలక్ష్మణులు రావడం చూస్తాడు. ఆ వచ్చేవారు బహుశా వాలి తనను చంపించడానికి పంపించాడేమో చూసి రమ్మని, వారిని గురించి తెలుసుకొని రమ్మని హనుమంతుడిని వారి దగ్గరకు పంపిస్తాడు. అలా వచ్చిన హనుమం తుడు మునివేషంలో ఉన్న రామలక్ష్మణులను చూచి వీరు మంచివారని వారికి తను వచ్చిన విషయం ఏమిటో నిజం చెప్తాడు. వారు కూడా హనుమంతుని చూసి ఆయన మాటలను చూసి ఆనందించి వారి కష్టాన్ని వారు చెప్పుకుంటారు.
హనుమంతుడు అపుడు సుగ్రీవునికి రాముని మధ్య అగ్ని సాక్షిగా స్నేహబంధానికి వారధిగా మారుతాడు. ఆ తరువాత సుగ్రీవుని ఆజ్ఞననుసురించి రామాజ్ఞగా రాముని అంగుళీయాకాన్ని తీసుకొని సీతమ్మ అనే్వషణను ప్రారంభిస్తాడు. ఎన్నో కష్టాలకోర్చి చివరకు సీతమ్మను కనుగొంటాడు. అపుడు సీతమ్మ తాను ఆత్మహత్య చేసుకొంటే బావుండు అనుకొంటూ ఉంటుంది. ఆ సమయంలో హనుమంతుడు ఆమెకు మంచి మాటలు చెప్పి రాముడు వచ్చి తనను అయోధ్యకు తీసుకువెళ్తాడన్న నిజాన్ని చెప్పి నమ్మకాన్ని కలిగించి సీతమ్మను రక్షిస్తాడు. మళ్లీ సీతమ్మ విషయాన్ని రామయ్యకు చెప్పి రాముని దుఃఖాన్ని దూరం చేస్తాడు.
రావణునిపైకి యుద్ధ్భేరి మోగించబోయే రాముని గూర్చి ముందుగా రావణునికి చెప్తాడు. రామునితో పోరు మంచిది కాదని రావణునికి హితోపదేశం చేస్తాడు.
రావణుడు హనుమంతుని మాటలు, ఆయన మంత్రి పురోహితుల మాటలు వినలేదు. స్వయంగా వారి బంధువులు చెప్పినా వినలేదు. కనుకనే చివరకు రావణుని అంతం జరిగిపోయంది.
రాముని పెంచిన తల్లి కైకమ్మ .ఈమెకు రాముఢంటే ఎంతో ప్రేమ కనబర్చేది. రాముడిని ప్రేమగా చూసేది. కాని ఆమె దాసి మంథర చెప్పుడు మాటలు విని రామునిపై కోపం తెచ్చుకుంటుంది. రాముడు లేకపోతే తన కొడుకు రాజు అవుతాడు కదా అనుకొంటుంది. అందుకే దశరథుని దగ్గర తన రెండువరాలు కావాలని మంకు పట్టు పడుతుంది. దశరథుని తూలనాడుతుంది. చివరకు దశరథుడు చనిపోతానేమో అన్నా ఫర్వాలేదు తన ఆశయమే నెగ్గాలంటుంది. ఆ చెప్పుడు మాటలు కైక పై అంతగా పనిచేసాయన్నమాట.
చాలామంది అప్యాయంగా పలకరిస్తే అవతల వారు చెడ్డవారైనా కూడా ఈ మాటలకు తలవొగ్గి వారి దుష్టత్వాన్ని కాస్తయనా పొగొట్టుకుం టారు.అందుకే పెద్దవారు అనుభవజ్ఞులు ప్రేమతో విశ్వాన్ని గెలవచ్చు అన్నారు.
సీతాదేవి తన పరుష వాక్కులతో తననే తల్లిగా భావించి సేవిస్తున్న లక్ష్మణుని దూరం చేసుకొని ఆపదలపాలైంది.
విభీషణుడు శత్రుపక్షంలోనివాడే అయినప్పటికీ దుష్టుడైన రావణుని విడనాడి రాముడి శరణు వేడుకున్నప్పుడు వానర సైన్యం అందరూ వ్యతిరేకించినప్పటికీ హనుమంతుడు విభీషణుని మాటల విశిష్టతను గుర్తించి రామునికి విభీషణుడిని రాముని సైన్యంలోకి తీసుకోమని చెప్పాడు. రాముడైతే రావణుడు వచ్చి నా సీతను నాకిచ్చివేసి నన్ను శరణుకోరితే నేను రావణుని తో పోరు సల్పను అని కూడా అన్నాడు. ఈ రాముని మాటల వల్ల రాముడు ఎంత గొప్పవాడో తెలుస్తుంది కదా. అందుకే నోరు మాట్లాడితే నొసలు వెక్కిరిస్తోంది అన్నట్లు గాక మంచి మాటలు మాట్లాడి ఎదటివారిని మెప్పును పొందాలి. పరులను నొప్పించకూడదు. ఎదుటివారిని దూషించకూడదు. ఎదుటివారు ఏం చెబుతున్నారో కూడా వినడమూ ఒక కళే. అది వస్తే మాట్లాడడంలో నేర్పరి అవుతారు.

- సాయప్రసాద్