మంచి మాట

భక్తిమార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏ కార్యము సిద్ధించాలన్నా, నెరవేరాలన్నా ‘‘సాధన’’ అవసరమంటారు. ఏ కళ రాణించాలన్నా ‘సాధన’ అవసరం. సంగీతం, నాట్యం, ఏ కళనైనా రాణించాలంటే ‘సాధన’ తోనే ముడిపడి ఉంటుంది.
కళలే కాకుండా జ్ఞానానికి భగవంతుని మీద భక్తి అన్నిటికి ‘సాధన’ అవసరం. సాధనతోనే ప్రతి పనీ సాధ్యం. భగవంతుని సాన్నిధ్యానికి, భగవంతునికి దగ్గర అవడానికి జ్ఞానార్జనకు నవవిధ భక్తులు నవవిధసాధనాలు సోపానాలు. వీటిని అధిరోహించాలంటే సాధన అవసరం.
కలి ప్రభావం కారణంగా ఈ కలియుగంలో సాధనకు కుదురు ఉండదు. మనిషికి అన్నింటిలోను సందేహాలే. గురువు మీద, సదాచారాలమీద, సంప్రదాయాల మీద అన్నిటిలోను సందేహమే. అన్నిటి మీద అందరిమీద అనుమానం కల మనిషికి సాధన సాధ్యపడటం కష్టం.
సాధన కు మరోపేరు కృషి. కృషితో నాస్తి దుర్భిక్షం కదా. సాధనమున పనులు సమకూరు ధరలోన అనీ అన్నారు కదా. పెద్దలను, అర్హులను జ్ఞానవంతులను, గురువులను, మాతాపితరులను గౌరవించడంతో సాధన మొదలు పెట్టాలి. వారి శుభాశీస్సులు సాధనకు తోడవుతాయి.
ధ్యానం ద్వారా జ్ఞానం లభిస్తుందంటారు. ధ్యానానికి సాధన కావాలి. భగవంతునిపై ధ్యానానికి సద్గురువు ద్వారా భగవంతుని స్మరణం మన నంతో సాధన ప్రారంభించాలంటారు.
పూర్వం ముచికుందుడు అనే మహాఋషి ఉండేవాడు. ఆయన బదిరికాశ్రమం వెళ్లిధ్యానం చేసుకోవాలనుకొన్నాడు. నరనారాయణులు ధ్యానం చేసుకొనేవారికి బదిరీకాశ్రమం ఉత్తమమైనది. బదిరి పేరు విన్నా తలుచుకున్నా కూడా పుణ్యమే. పవిత్రమైనది, విశిష్టమైనది, అందరికీ బదిరి వెళ్లడం వీలు కాకపోయినా ఎక్కడున్నా బదరిని తలుచుకుంటే చాలు అక్కడకు వెళ్లినంత పుణ్యమొస్తుంది.
సాధనకు మనసు ప్రధానం. మనసును అదుపులో ఉంచుకోవాలి అంటే దాని గురించి ముందుగా ప్రయత్నం చేయాలి. ఎల్లపుడు అనవసర విషయాల వైపు మనసు పరుగులు పెడుతుంది. ఎక్కువగా గతాన్ని తవ్వడం చేస్తుంటుంది. భవిష్యత్తు కై ఊహలు చేస్తుంటుంది.
మనస్సును చంచలం చేసేది కామ, క్రోధాలే. మనసు ప్రతి క్షణంఅది వెళ్లే వైపు నుండి మరలుతూ తన త్రోవ కు తెస్తూ ఉండాలి.
ఏవిషయానికి ఆశపడకూడదు. దేనితోను సరిపోలిక చేయకూడదు. జరిగిపోయిన వాటిని పదేపదే స్మరించకూడదు. ఒకసారి నిర్ణయం తీసుకొన్న తరువాత దానిని పాటించాలి. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి.
ధ్యానానికి మనసును సమాయత్తం చేయబడే సాధనకు వీలుకలుగుతుంది. సాధన తో ధ్యానం కుదురుతుంది. ధ్యానంతో భగవంతుని వైపు ప్రయాణ సాధనకు మార్గం సుగమం అవుతుంది.
కలియుగంలో ప్రతీచోట ప్రతి మనిషిమీద కలిప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరిగింది. మనుష్యుల మధ్య విద్వేషాలు విద్రోహాలు ఎక్కువగా చెలరేగడం జరుగుతాయని కూడా చెప్పారు.
నేడు మనుష్యుల మధ్య బంధుత్వాలయినా స్నేహాలయినా అన్నీ సహజతత్వాలను కోల్పోయి పేరుకు మిగులుతున్నాయి. ఆ అసహజాలను ద్వేషాలు, ద్రోహాలు లేకుండా దాటించగలది భక్తి మార్గం.
కలియుగంలో భాగవత కథ, కృష్ణకథ అడ్డంకులను దాటించగలందులకు శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించిన భగవత్ గీతాసారం చాలు జీవితానికి మరేమీ పొందనవసరం లేదు. కేవలం శ్రీకృష్ణ చరణాలను పట్టుకోగలగితే చాలు. మనం సాధనలో ముందుకు వెళ్తున్నట్టే. సాధన సాధ్యమైనట్లే. ఇతిహాసాలు, రామాయణం, భారతం, భాగవతం గురించి ఏమాత్రం భక్తి భావనతో వినినా చదివినా దృశ్యకావ్యం గా చూచినా జ్ఞానం అవగతవౌతుంది. ఎన్ని సార్లు విన్నా ఇంక చాలు అనే భావం రాదు. వినాలనే తపన కలుగుతుంది.
ఒక్కోసారి భక్తి కూడా అహంకారాన్ని కలిగిస్తుందని మనకు చరిత్ర చెబుతుంది.నేనే భగవంతుని మీద అపార భక్తిని కలిగిఉన్నవాడిని అనే తలంపు చేటు తెస్తుంది. తామసగుణంతో భక్తిని పెంచుకోగూడదు.సత్వగుణాన్ని పెంచుకుంటూ భక్తిమార్గంలో వెళ్లేవారికి అన్నీ శుభాలే కలుగుతాయి. భగవంతుని తత్వాన్నిగురించి తెలుసుకొంటూ ఉండాలి. ప్రకృతి నేర్పించే త్యాగ గుణాన్ని అలవర్చుకోవాలి. త్యాగమే మహోన్నత గుణమని తెలుసుకొంటే పరమాత్మ తత్వం సులభంగా బోధపడుతుంది.

- ఎ.నాగభూషణరావు