మంచి మాట

మంచిచెడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనాదినుండీ పుణ్య గ్రంథాలుగా భారతం, భాగవతం, రామాయణం వ్యాసుడు, పోతన, వాల్మీకిల రచనలుగా పవిత్రతను సంతరించుకున్న పుణ్య చరిత్రలను మానవాళికి అందించాయి. వీటిలో శ్రీకృష్ణుడి లీలలు, భాగవతంలో మానవుడిగా పుట్టి, మనిషి ఎలా చరించాలో చెప్పిన శ్రీరాముడి నడతను రామాయణంలో ఆయా కవులు వ్రాయగా, భారతంలో ముఖ్యులు కౌరవులు, పాండవులు, శ్రీకృష్ణుడు. కాగా రాజకీయ జీవితంలో అన్నాదమ్ముల ఈర్ష్యలు, రాజ్యం కోసం ఎంతటి అధమ స్థితికైనా దిగజారడం, ద్రౌపది వంటి మహాపతివ్రతలకు జరిగిన పరాభవాలను, అన్యాయంగా అభిమన్య వధలను, భగవద్గీత ఆవిర్భాలను అంశాలుగా మహాభారత కావ్యం ప్రపంచంలో పూజలందుకుంటూ ఉంది.
ఎంతో ఆసక్తిదాయక విషయాలు భారత గ్రంథంలో నిక్షిప్తమై ఉండి, శాపాలు, ప్రతికారాలు, రణరంగాలతో నిండి, లోకంలో ధర్మ ప్రతిష్ఠాపనకు శ్రీకృష్ణుడి కృషి, పాండవులకు అనునిత్యం అండదండలందిస్తూ, శక్తియుక్తులను అవసర సమయంలో వారికి బోధిస్తూ హిత వచనాలను వినని కౌరవుల నాశనానికి, పరిష్కారానికి యుద్ధమే తప్పదని చెప్పిన గ్రంథం. మహాదాత కర్ణుడి విశ్వాసగుణం, నిస్సందేహంగా కవచ కుండలాలను ఒలిచి ఇచ్చిన వైనం, ద్రోణుడి శాపంతో అస్త్రాలను యుద్ధ సమయంలో మరచి వీరమరణం పొందడం, తాను లేకపోయినా పంచపాండవులు ఉంటారని తల్లికి ఇచ్చిన వాగ్దానం, ఎన్నిసార్లు విన్నా చదివినా తనివితీరదు. అందుకే వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి అన్న తెలుగు సామెత ప్రాచుర్యం పొందింది. భారతంలో మహాయోధుడు భీష్ముడు, తండ్రికోసం అన్నీ త్యాగం చేసి కౌరవ పక్షాన పెద్దగా ఉంటూ, మహాభారత యుద్ధంలో అంబ శాప కారణంగా అసువులు బాసిన గంగాపుత్రుడు. భీష్ముడు లేని భారతం భూరికావ్యం కాలజాదు. పాండవ పత్ని ద్రౌపది తనను అవమానించిన కౌరవ నాశనానికి కారకురాలై దుర్యోధనుడి అంతం చూసి కానీ జుట్టు ముడి వేయని వీరపత్ని. రాయబారంలో హితబోధకై వచ్చిన శ్రీకృష్ణుడిని తూలనాడి, ఆయన మాటలను పెడచెవిన పెట్టిన దురహంకారులైన కౌరవులు వందమందైనా, మహామహుల అండదండలున్నా, శ్రీకృష్ణుడి ఒక్కడి అండతో ధర్మాచరణ గావించిన పాండవ విజయం, కౌరవ నాశనం భారతంలో మానవ లోకంలోని జయాపజయాలను, మంచీ చెడుల విషయంగా ఎలా వుంటాయో వివరిస్తాయి.
వాలిని రామావతారంలో చెట్టు చాటునుంచి బాణంతో కొట్టి చంపిన కారణంగా, కృష్ణావతారంలో బోయవాడి బాణంతో హతుడై అవతార సమాప్తిగావించిన శ్రీకృష్ణుడి కధ వింటే భగవంతుడైనా పుట్టిన తరువాత కర్మ ఫలితం అనుభవించక తప్పదనే సూక్తి మానవ మాత్రులకు అర్థం అవుతుంది.
మాటలతో వర్ణించలేని మహాభారత కథను ఎందరో కవులు రూపకల్పన చేయగా, ఆకల్పాంతం ఆ కథ ఆదర్శ, అపురూప కావ్యమే.

--

మంచిమాట శీర్షికకు
ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను
సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు.
రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి.
ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

-ఎం.వి.రమణకుమారి