మంచి మాట

జ్ఞాన భక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి అనునది ఒక పవిత్ర కార్యం. భక్తి కార్యాలన్నీ పరమ పవిత్రమైనవే. కాని భక్తిలో అహంకారం చేరితే భక్తి మలినమవుతుంది. అలాకాక భక్తి అహంకారిలో ఉంటే అది భక్తినే కాని ముక్తికారకం మాత్రం కాలేదు. ఆ భక్తి ఎంత గొప్పది ఐనను నిరర్థకమే. ఎలా అంటే పాలు ఎంతో ఉత్కృష్టమైన ఆహారము. కాని ఆ పాలలోవిషము కలిస్తే అవి పానయోగ్యం ఎలా కాకుండా పోతాయో అట్లానే భక్తి అనే క్షీరములో అహంకారమనే విషము కలిస్తే అదినిరుపయోగం అవుతుంది. నిష్ప్రయోజనం.
మనం ఏదైనా ఒక ప్రదేశానికి అన్యప్రయోజనం లేకుండా కేవలం భక్తి కొరకు మాత్రమే వెళితే అది ఎలాంటి ప్రదేశమైనా సరే అది ఒక ఆలయంగానే పరిగణించవచ్చు. ఆ ప్రదేశంలో జరిగేదంతా అర్చనే అవుతుంది. ఏదైనా అందమైన వస్తువుగాని, ప్రకృతిని కాని అందంగా వీక్షించడమే జ్ఞానం. ఈ అందాలను అందంగావీక్షించక పోవడమే అజ్ఞానం. ఈ సృష్టిలో జ్ఞానాజ్ఞానము లేకుండా విశేషమైన జ్ఞానం కూడా ఒకటి చోటు చేసుకొని ఉంది. అందమైన వస్తువును అందంగానే దర్శించకుండా ఆ వస్తువులో దాగి ఉన్న దేవదేవుని సుందర రూపుని దర్శించుకొని ఆనందానుభూతులు పొందుటయే విశేష జ్ఞానం.
ఈ సర్వప్రపంచాన్ని జగత్తుగా కాకుండా జగదీశ్వరునిగా దర్శించడమే విశేష జ్ఞానం. ఈ సృష్టిలోని విజ్ఞాన విశేషాలన్నీ ఆయనవిభూతియే అనునది సుజ్ఞానం. ఈసుజ్ఞాన మనే జ్యోతి మనబుద్ధిలో , మనస్సులో వెలుగుతుంటే మనిషిలో సంతోషము, ప్రేమ వ్యక్తమై బహిర్గతమవుతాయి.
దీపం ఉండగానే ప్రయోజనం లేదు. అది కాంతితో వెలుగుతూ ప్రకాశిస్తుండాలి. వెలిగే దీపంలాగా మనిషి నవ్వుతూ ఉండాలి. ఆనందంగా ఉండాలి. దీపంలో చమురు అనే పదార్థం ఉంటేనే వెలుగుతుంది. అదేవిధంగా మనిషిలో జ్ఞానం, సుజ్ఞానం, విశేషజ్ఞానం అనేవి ఉంటేనే ఈ మనిషి ఆత్మీయులతో ఆనందంగా ఆహ్లాదంగా జీవన గమనము సాగించగలదు. సాగిస్తాడు కూడా.
ఈ సృష్టిలో ఆవరించిన నీరంతా ఒక్కటే అది సముద్రపునీరుగా, వర్షపు నీరుగా భూగర్భజలాలుగా, తటాలుకాలుగా, కాలువలుగా,మడుగులుగా, చెరువులుగా ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా అవి నీరే. అట్లే జ్ఞానమంతా ఒక్కటే ఎవరు పొందితే వారికే స్వంతమగుతుంది.
తినేందుకు ఎన్ని రకాల రుచికరమైన పదార్థాలున్నా తినేవాడికి ఆకలి లేకుంటే వృథాన. ఆకలి ఉంటేనే తినాలనే ఆసక్తి కలుగుతుంది తెలుసుకోవాలనుకొన్నవారే జ్ఞానానే్వషణ చేస్తారు. భక్తి అనే బీజం మొలకెత్తితే చాలు అది మూఢభక్తిగా మారినా, జ్ఞాన భక్తిగా మారినా కూడా చివరకు పరమాత్మనే మంచి దోవ చూపించి తన దారిలోకి తీసుకొని వస్తాడు.
కల్మషాలు చేరకుండా నిర్మలమైన మనస్సుతో తదేక దీక్షతో ఏకాగ్రచిత్తంతో భగవంతుడే అన్నీ అని నిశ్చయ భావంతో మెదిలినవారికి భగవంతుడే తోడునీడగా ఉంటాడు. మన దగ్గర నుండి పోయినవి మనవి కావని, మన దగ్గరకు వచ్చినవి మనవి అని అనుకొన్నా కూడా వేటిమీద కూడా ధ్యాస లేకుండా అంటే ఆపేక్ష లేకుండా అంతా ఈశ్వరమయం అని భావిస్తుండాలి.
నాది అనే భావనే లేనప్పుడు దుఃఖమనేది అసలు తెలీదు.. అందుకే భగవాన్ రమణ మహర్షి నేను అంటే ఎవరో తెలుసుకోమన్నారు. సత్యసాయిబాబా ప్రేమించడం నేర్చుకోమన్నారు. శిరిడీ బాబా నీకున్నది నలుగురికీ పంచు. ఎవరినీ ద్వేషించకు అందరిలోను భగవంతుడే కూర్చుని ఉంటాడన్నాడు.
రాగద్వేషాలు లేకుండా, అహంకారం సోకకుండా కర్మలు ఆచరిస్తే ఆ భగవంతుడు సంతోషిస్తాడు. ఇది తెలియక మానవ లోకం భగవంతునితో కూడా మొక్కులు చెల్లిస్తామంటూ బేరసారాలు చేస్తున్నారు. ఇది కూడా ఒక అజ్ఞానమే.
భగవంతుడే సర్వమూ అయినప్పుడు ఆయనకిచ్చేది ఏమిటి? అందుకే నీకున్నది పత్రమైనా, ఫలమైనా చివరకు నీళ్లు అయినా ప్రేమతో ఇస్తేచాలు ఆనందిస్తానని స్వయంగా శ్రీకృష్ణపరమాత్ముడు చెప్పాడు. సామాన్యులైనా అసామాన్యులైనా భగవంతుని దరి చేర్చేది జ్ఞానమే కనుక ఆ జ్ఞానాన్ని ఆహ్వానించాలి. శోధించి సాధించి సముపార్జించుకోవాలి. దానితర్వాత అనేక విజయాలు వాటంతట అవే దరిచేరుతాయి.

- పెండెం శ్రీధర్