మంచి మాట

కృష్ణుడు ఒక అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణుడెవరు? అంటే.. ఒక పురాణ పురుషుడు. ఒక చారిత్రక పురుషుడు. ఒక మానసిక శాస్తవ్రేత్త (సైకియాట్రిస్ట్), ఒక వేదాంత దర్శనకారుడు, ఒక దివ్య సుందరుడు, ఒక ప్రేమమూర్తి, ఒక రాజకీయ చాతుర్యం మూర్త్భీవించిన వేత్త.. ఒక జగద్గురువు.. ఒక దైవం... ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతం.. ఇది భారతం అంటూ మన దేశ నిర్మాణాన్ని కళ్ళముందు ఆవిష్కరించునే యత్నం చేస్తే అది కృష్ణరూపం, కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణం వందే జగద్గురుమ్. కృ అంటే అపరిమితమైన ష అంటే ఆనందం కలిగించువాడు కనుక ఆతడు కృష్ణుడు. పుట్టుక అద్భుతం, పెరగడం అద్భుతం, యావత్తు జీవితం అద్భుతం, దేహాన్ని విడిచిపెట్టడం అద్భుతం. ఇరవై రెండు ‘గీత’ పేరుగల గ్రంథాలలో అన్నీ వేదాంతాన్ని బోధించేవే అయినా వాటిలో కృష్ణుడు అర్జునునకు బోధించిన గీత, భగవద్గీతగా, వేదాంత దార్శనిక మార్గం బ్రహ్మ సూత్రాలు ఉపనిషత్తులను దాటి సకల ప్రపంచ మానవాళికి కృష్ణుడి నిలువెత్తు రూపంగా కనిపించడం మరో అద్భుతం.
యయాతికి తండ్రి యదువు. కృష్ణుడు యదువంశ సంజాతుడు. యయాతి కొడుకు పేరు కూడా యదువే. ఈ యదువుకు నలుగురు కొడుకులు. సహస్రజిత్తు, క్రోష్టువు, నలుడు, రిపుడు. వీరిలో సహస్రజిత్తు వర్గంలోకి వచ్చినవారు హేహయు, మాహిష్మంతుడు, కృతవీర్యుడు, కార్తవీర్యార్జునుడు మొదలగువారు. కార్తవీర్యార్జునుని కొడుకులలో శూరసేనుడు ప్రధానం. క్రోష్టువు యదువుకు రెండో కొడుకు. ఇతడి కొడుకు శశిబిందుడు. క్రమంగా పృథుశ్రవుడు, జ్యాముఖుడు, విదర్భుడు- ఈ విదర్భుడికి ముగ్గురు కొడుకులు. రెండవవాడు కృధుడు. తరువాత సాత్పతుడు రాజ్యానికి వచ్చాడు. ఈ సాత్పతుడికి ఏడుగురు సంతానం. అందులో రెండవ వాడైన అంధకుడికి మళ్లీ నలుగురు కొడుకులు. వీరిలో పెద్దవాడు భజమానుడు. ఈ భజమానుడి వర్గంలో ఆ తరువాత క్రమంగా భోజుడు, హృదికుడు వచ్చారు. హృతికుడికి ముగ్గురు కొడుకులు. కృతవర్మ, శతధనువు, దేవమీఢుడు. దేవమీఢుడికి కుమారుడు శూరుడు. శూరుడి కొడుకు వసుదేవుడు. వసుదేవుడి కొడుకు మన కథానాయకుడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి కుమారుడు ప్రత్యుమ్నుడు. అతని కొడుకు అనిరుద్ధుడు.
పుట్టిన వెంటనే మృత్యువు పక్కన కూర్చున్నది. ఆ మాటకొస్తే పుట్టకముందే మన వెంట ఉంటుంది అని లోకానికి చాటి చెప్పిన కథనం శ్రీకృష్ణజననం. కృష్ణాయ తస్మై నమః- ద్వాపరయుగాంతంలో కృష్ణుడు, ఆ కాలానికి మంగళాశాసనం పలకడంతో పాటు ఈ కలికాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ధర్మచింతన, ఆధ్యాత్మిక పథంలో నడిపించే యత్నం చేయడమే భగవద్గీత బోధ. ‘యదా యదాహి ధర్మస్య’ అంటూ ఎప్పుడూ ధర్మానికి విరుద్ధ కాలం వస్తుందో అప్పుడు తానే తనకు తానుగా ప్రభవిస్తానని తొలి పలుకు. అలాగే మలి పలుకుగా పవిత్రాణాయ సాధూనాం అంటూ, ధర్మాన్ని సంస్థాపన చేయడం కోసం ప్రతి యుగంలోనూ సంభవిస్తానంటాడు స్వామి. ‘సర్వ ధర్మానే పరిత్సజ్య మామేకం శరణం వ్రజ. ............’- అనన్య భక్తితో ఆశ్రయిస్తే, నేను నీ పాపాలన్నింటినీ తొలగించి ముక్తిని ప్రసాద్తినన్నమాట. ఆ కృష్ణుడు చెప్పిన గీత- కార్తిక బ. అమావాస్యనాడు భారతసంగ్రామం ప్రారంభమైంది. కార్తికమాసంలో రేవతీనక్షత్రం నాడు శ్రీకృష్ణుడుకౌరవుల వద్దకు రాయబారిగా వెళ్లినట్టు భారతం చెబుతుంది. కార్తిక పున్నమినాడు కృత్తికానక్షత్రం ఉంటుంది. ఈ నక్షత్రానికి మూడవ నక్షత్రం (పూర్వం) రేవతి అంటే కార్తిక శుద్ధ త్రయోదశి.నాడు రాయబారం. వస్తూవస్తూ కృష్ణుడు, కర్ణుడితో అతడి జన్మ రహస్యం చెప్తూ జ్యేషాఠనక్షత్రంలో కూడిన అమావాస్యనాడు యుద్ధం ఆఠంభం అంటారు. మాఘ శుద్ధాష్టమి భీష్మ నిర్యాణం. భీష్ముడు అంపశయ్య పై యాభై ఎనిమిది రోజులున్నాడు.్భష్ముడు యుద్ధం చేసింది పదిరోజులు ఇలా చూస్తే లెక్కసరిపోతుంది. భీష్ముడు పడిపోయాడన్న వార్త ధృతరాష్ట్రుడికి చేరి, అదిధర్మక్షేత్రమైన కురుక్షేత్రం కదా. అక్కడ ఇదెలా సంభవం. అంతలో ప్రశ్నించుకుని వ్యాసుడిచ్చిన దివ్యదృష్టితో యుద్ధాన్ని చూడమని సంజయుడిని కోరి అప్పుడు ప్రశ్నిస్తే ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్పిన పదిరోజుల కిందటి కథలో మొదటి ఘట్టం భగవద్గీతాబోధ. అంటేగీతాజయంతి కార్తిక బహుళ అమావాస్య అన్నమాట. భగవద్గీతను ఏ కొంచెం చదివినా, గంగాజలం చుక్క సేవించినా, యమభటులు ఆలోచించరు అనే విశ్వాసం మన సనాతన భారతీయ బోధ.

-కాకునూరి