మంచి మాట

జ్ఞానపధమార్గమిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై ఆరవ పాశురమ్ ‘పుళ్ళుమ్’
పుళ్ళుమ్ శిలమ్బినకాణ్ పుళ్ అరైయ కోయిలిల్!
వెళ్ళై విళిశంగిన్ పేర్ అరవమ్ కేట్టిలైయో
పిళ్ళాయ్ ఎళున్దిరాయ్ పేయ్‌ములై నంజు ఉణ్డు
కళ్ళ పచ్చగడం కళక్కళియ క్కాల్ ఓచ్చి
వెళ్ళత్తు అరవిల్ తుయిలమరంద విత్తినై
ఉళ్ళత్తుక్కొండు మునివర్ గళుమ్ యోగిగళుమ్
మెళ్ళ ఎళున్దు అరియన్ఱ పేర్ అరవమ్
ఉళ్ళమ్ పుకుందు కుళిర్‌ందు ఏల్ ఓర్ ఎంపావాయ్

భావం: ఈనాటి పాశురంలో, పక్షులు కూస్తున్నాయి. తెల్లవారే సంకేతాన్నిస్తున్నాయి. గరుడ వాహనుని (విష్ణువు) యొక్క ఆలయంలో పెద్దగా మ్రోగే శంఖం శబ్దాన్ని విను. లేవాలి! జీవులను (జీవాత్మలను) చైతన్యం చేసే శక్తి ప్రణవం. అదే శంఖధ్వని. ప్రణవ నాదం పరమాత్మ సృష్టి రచనా సంకేతం.
పక్షులకుండే రెండు రెక్కలు ఒకటి జ్ఞానం, రెండవది ఆచరణం. ఈ రెండు రెక్కలు జీవన గమనంలో వారికి ఉన్నత లోకాలు చేరుకోగలిగే శక్తినిస్తున్నాయి. రామాయణంలో చెప్పబడే పక్షులన్నీ ఎంతో జ్ఞానాన్ని పొందినవే. పరమాత్మను ఎల్లప్పుడూ ధరించే గరుడుడు జ్ఞాన స్వరూపుడు. వేద స్వరూపుడే కనుక పక్షులు కూయడం ఉత్తిష్ట! లేవండి మానవులారా! జీవన మార్గాన్ని నిర్ణయించుకోండి. జ్ఞానపథం వైపునకు నడవండి. మీ కోసం ఆలయంలో నుండి ప్రణవనాదం వినిపిస్తున్నది వినండి! అంటూ మేల్కొలుపునకు సంకేతం, ఆచార్యులు జీవులనుద్ధరించడానికి చేసే ఆధ్యాత్మిక ప్రవచనాలకు సంకేతాలే పక్షుల కూతలు. పక్షులు ఆచార్యుల ప్రతీకలు.
ఈనాటినుంచి తిరుప్పావైలో (6నుండి 15వ పాశురం వరకు) రెండవ దశ ఆరంభమవుతుంది. మొదటి దశలో అందరినీ వ్రతం వైపు నడిపించారు. ఇక నడిచే క్రియ ఎలా సాగాలి? అని తెలియజెప్పేదో రెండో దశ. ఈ దశలో పది రోజులు ఆచార్యుల నాశ్రయించి ఎట్లా జ్ఞానం పొందాలి? ఈ శరీరాన్ని ఆత్మవైపు, ఆత్మను పరమాత్మవైపు నడిపించేందుకు ఏం చేయాలి? ఇదే కర్మయోగం. ఇంద్రియాలు (పది) తమ ప్రవృత్తుల్ని ఎట్లా పరమాత్మవైపు మళ్లించాలో తెలియజెప్పే పాటలివి. ఇంద్రియాల్ని లోబరచుకొని జ్ఞానం పొందితేగానీ పరమ పురుషుని చేర సాధ్యం కాదు. అందుకు ఆచార్యుని ఆశ్రయించాలి. ఆచార్యులే ఇక్కడ ఆళ్వారులు. బాహ్యేంద్రియ ప్రవృత్తులను సక్రమంగా మల్చుకోవడమే పదిమంది ఆళ్వారులను మేల్కొలపడం. ప్రకృతి, పంచభూతాలు ఐదు, అహంకారం, బుద్ధి, అవ్యక్తం, జీవి, పరమాత్మ ఇవి ఐదు. ఈ తాత్త్విక జ్ఞానాన్ని పొందడమే పదిమంది ఆళ్వారులను దర్శింపజేసుకోవడం. కర్మ ఆచరిస్తే జ్ఞానయోగం పొందుతాడు మానవుడు.
పాల సముద్రంలో శేషసాయిపై నిద్రించే జగత్కారణుడైన శ్రీమమన్నారాయణుని యోగులు మునులు లేచి చేసే హరినామ స్మరణ వినండి. హృదయాన్ని చల్లబరచుకొని జాగృతం కమ్మని అందరినీ ప్రబోధించింది ఆండాళ్ తల్లి ఈనాటి 6వ పాశురంలో.
ఆండాళ్ తిరువడిగళే శరణమ్

- డాక్టర్. పరవస్తు కమల