మంచి మాట

సేవాభావము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవునికి భగవంతుని చేరుకొనుటకు అనేక మార్గాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది సేవ. సేవ అంటే ఏలాంటి ఫలాపేక్ష లేకుండా పరులకు సహాయాన్ని అందించడం. ‘మానవ సేవయే మాధవ సేవ’ అందుకే సేవ అత్యంత విశిష్ఠస్థానం ఆక్రమించుకొన్నది. భగవత్ప్రసాదితంగా లభించిన ధనాన్ని, శక్తిని, సంపదను సాధ్యమైనంత వరకు మానవ సేవకు వినియోగించాలి. విద్యావంతులు విద్యాధనాన్ని, వైద్యులు వైద్య సేవలను, శారీరక దారుఢ్యము కలిగిన వారు శ్రమదానం, రాజకీయ నాయకులు స్వార్థం వీడి ప్రజోపయోగకరమైన పనులు చేయుటయే సేవ. మనం ఎంత కూడబెట్టినా మనతో వచ్చేది కేవలం పాపం, పుణ్యం అంటే మంచీ చెడు మాత్రమే.
శాస్త్రాలలో పురాణాలలో సేవ యొక్క ప్రాముఖ్యత ఎంతో చక్కగా పొందుపరచబడినది. అదేవిధంగా లౌకిక జీవతంలో కూడా అనేకులు అనేక విధములైన సేవ చేసి భగవంతుని చేరుకున్నారు. ముఖ్యంగా తలిదండ్రుల సేవ, గురుదేవుల సేవ, మానవోద్ధరణకు ఉపకరించే ఆధ్యాత్మికసేవ, రోగగ్రస్థులకు అందించే వైద్యసేవ, అనాధ బాలలకు ఉచితంగా విద్యాదానం, దేశ ప్రజల సుఖ శాంతులకోసం తమ యధాశక్తి పనిచేయుటయే ఉత్తమ సేవ. ఏ సేవలోనైనా స్వార్థం, ధనదాహం మిళితమైతే అది సేవ అనిపించుకోదు. అది కేవలం వ్యాపారం అగుతుంది.
ప్రకృతిలో సేవాభావం మనుష్యులలో కంటే నోరులేని పశుపక్ష్యాదులతో విస్తృతంగా కనిపిస్తుంది. వాటికి పదవులుగాని హోదాగాని, సంపాదనపైగాని మరియు కీర్తిప్రతిష్ఠలపైగాని ఇసుమంతైనా ఆశ ఉండదు. భగవంతుడు ప్రసాదించిన వాటిని ఆరగిస్తాయి. లేని రోజులో పస్తులుంటాయి. కాని భగవంతుడు తమకు ఏర్పాటుచేసిన సేవను మాత్రం ఎట్టి పరిస్థితులలోను విడువవు. పక్షులు మర్రి, వేప, రావి, పళ్ళు తిని అనేక మైళ్ళ దూరంలో మలవిసర్జన ద్వారా వృక్ష సంతతి వ్యాప్తికి తోడ్పడుతాయి. ఒక్కొక్కసారి మనం ఎన్ని రకాల ప్రయత్నం చేసినా మనం నాటిన చెట్లు నశించిపోతాయి. కాని పక్షులవల్ల ప్రకృతిలో అనేక రకాల వృక్ష సంతతి వర్షాధారంతో పెరుగుట ఎంతో విచిత్రం.
తేనెటీగలు అనేక రకాల పూల తోటలలో మంచి పూవులను వెదకి వాటి మకరదందాన్ని స్వీకరించి తేనెను తయారుచేసి రాణి ఈగ రాజా ఈగలతోపాటు సైన్యపు ఈగలకు పంచి తాము కొంత సేవించి మిగిలిన తేనెను తేనె తెట్టులలో భద్రపరచి మనుషులకు జంతువులకు అందిస్తాయి. మానవలోకం దైవపూజలో పంచామృతాలుగా, అభిషేకాలలో మరియు అనేక రకాల ఔషధాలలో తేనెను ఉపయోగిస్తున్నాడు. తేనెటీగలది నిస్వార్థ సేవయే కదా! పూర్వకాలం నుండి పేదవాని గడియారంగా పరిగింపబడుతున్న కోడిపుంజు నిస్వార్థంగా మానవ లోకాన్ని మేలుకొలుపుతుంది. ‘కోడి కూయంగనే మేల్కొంటి’ అని జంధ్యాలగారు పుష్పవిలాపంలో సెలవిచ్చారు. పాతిక సంవత్సరాల క్రితం సమయము కొరకు గ్రామీణ ప్రజలు కోడి పుంజుపైనే ఆధారపడి ఉండెడివారు. ఇప్పుడు కూడా కొన్ని పల్లెలో ‘సమయము’ కోడికూతనే ప్రామాణికంగా ఉపయోగిస్తున్నారు. ఇక జంతువులలో కుక్క, పిల్లి, గుఱ్ఱము, ఆవు, గేదె, ఏనుగు మొదలైన పెంపుడు జంతువులు మనుష్యులతో అత్యంత సన్నిహితంగా మెదలి ఎలాంటి ద్రోహబుద్ధి తలపెట్టకుండా మానవ లోకానికి ఎన్నో రకాల సేవలందిస్తున్నాయి.
భగవంతుడు అనేక జీవుల ద్వారా మానవునికి కర్తవ్యాన్ని తెలియజేయుచున్నప్పటికిని మనం లేశమైనా గుర్తించడంలేదు. కాని నోరు లేని విచక్షణాజ్ఞానం లేని జంతుజాలము ఎన్నో రకాల నిస్వార్థ సేవను సమాజానికి అందిస్తుంటే నోరు, విచక్షణా జ్ఞానం ఉన్న మానవుడు సమాజానికి అడుగడుగునా కీడు తలపెట్టే ప్రయత్నము చేయుచున్నాడు.జీవించడం గొప్ప కాదు, అందరూ జీవిస్తారు. జీవించడం ఒక కళ. త్యాగనిరతితో తమ జీవితాన్ని పరులకోసం ఉపయోగించేవారు మహనీయులు, మహాత్ములు, మహర్షులు. మనకున్నదానిలోనే ఇతరులకు పంచి ఇతరుల కష్టంలో పాలు పంచుకొని మన సుఖాన్ని వారికి పంచాలి. అదే మానవ ధర్మం. జీవిత సాఫల్యం. జన్మసార్థకం. ‘పరోపకారార్థం ఇదం శరీరం’ను సార్థకం చేయాలి.

-పెండెం శ్రీ్ధర్