మంచి మాట

స్వస్వరూపజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై 14వ పాశురం ఉంగళ్ పుళక్కడై

ఉంగళ్ పుళైక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెంగళునీర్ వాయ్‌నెగిళిందు అంబల్‌వాయ్ కూంబినకాణ్
శెంగల్ పొడిక్కూఱై వెణ్‌పల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోతందార్
ఎంగళై మున్నమ్ ఎళుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్ ఎళుందిరాయ్ నాణాదాయ్ నావుడయాయ్
శంగొడు శక్కరం ఏన్దుమ్ తడక్కైయన్
పంగయ క్కణ్ణానై ప్పాడు ఏలోరెమ్బావాయ్

భావం:ఈనాటి పాశురంలో నజ్గాయ్, నాణాదాయ్, నావుడయామ్.. అంటూ ఓ పూర్ణులారా! మధురమైన మాటలు పలికేదానా! అంటూ భగవదానందంతో తన్మయురాలై ఆచార్యత్వాన్ని పొందిన ఒక ఉత్తమమైన గోపికను నిద్రలేపి తమ వ్రతంలోకి చేర్చుకుంటున్నది ఆండాళ్ తల్లి.
స్వస్వరూప జ్ఞానం పొంది, నిర్మలమైన అంతఃకరణతో, నిరంతరం పరమాత్మ కైంకర్యంలోనే జీవితాన్ని సఫలం చేసుకోవాలని, విషయ రాగాలకు లొంగని వైరాగ్య భావనతో భగవద్ధ్యానం చేసుకొనే, భక్తిలో పరిపూర్ణత్వాన్ని పొందని ఒక గోపికను లేచి రమ్మని వేడుకుంటున్నారు గోపికలు ఈ పాశురంలో.
నీ యొక్క పెరటి తోటలోనున్న దిగుడు బావిలో ఉన్న ఎఱ్ఱ తామరలు వికసించాయి. నల్లకలువలు ముడుచుకొని పోతున్నాయి. (యోగసాధనలో నాడీ మండలం వరకు చేర్చే షట్చక్రాలకు (తామరలు) జ్ఞాన ప్రకాశం కలిగి వికసిస్తున్నవి. అజ్ఞానం నశిస్తున్నది.
చీకటితోబాటే కలువలు ముడుచుకొనిపోతున్నవి అని సంకేతం) సన్యాసులు తమ విషయ రాగ వర్జనకు సంకేతంగా కాషాయ వస్త్రాలు ధరించి తెల్లని పలువరుస కలిగి భగవదాలయానికి తిరువారాధనము చేయడానికి వెళ్తున్నారు. సాత్త్విక శుద్ధి, హృదయ నైర్మల్యం, దైవీ వాక్కు, నిరంతర భగవన్నామ స్మరణ వీటికి తెల్లని పలు వరుస కల్గి ఉండడమే సంకేతం. ఈ స్వభావాలు కల్గినందుకే వారు ఆచార్య పదవి నధిష్ఠించి జీవులను పరమ్మా చెంతకు, ఆలయంలోకి చేర్చే అర్హతకలిగియున్నారు.
మమ్ములను ముందే వచ్చి మేల్కొలిపి వ్రత స్థలానికి వెళ్దామని చెప్పి మాట ఇచ్చి మరిచావా? అయ్యో! వీరికి మాట ఇచ్చి తప్పానే! అని సిగ్గుపడే భావం ఏమాత్రం లేనిదానా నీవు. ఓ పరిపూర్ణులారా ఇప్పుడైనా లేవాలి. శంఖు చక్రాలు ధరించిన వాడు, ఆజానుబాహువులు గలవాడైన ఆ శ్రీమన్నారాయణుని మహిమను గానం చేయడానికి మా గోష్ఠిలో చేరడానికి మేల్కొని రావాలి అని కోరుతున్నారు గోపికలు ఈ పాశురంలో.
ఆండాళ్ తిరువడిగళే శరణమ్

- డాక్టర్‌ పరవస్తు కమల