మంచి మాట

మాటల మహత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై 15వ పాశురం ఎల్లేమిళం కిళియే
ఎల్లేయికళం కిళియే ఇన్నం ఉరంగుదియో
శిల్‌ఎన్ఱు అళైయేల్‌మిన్ నంగైమీర్ పోదరుకినే్ఱన్
వల్లె ఉన్‌కట్టురైకళ్ పణ్డే ఉన్ వాయ్ అణిదుమ్
వల్లీర్‌కళ్ నీంగళే నానేదాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోన్దార్ పోన్దు ఎణ్ణిక్కొళ్
వల్లానై కొన్ఱానై మాత్తాయై మాత్తు అళిక్క
వల్లానై మాయనై ప్పాడు ఏలోరెమ్బావాయ్

భావం:ఈ పాశురం ‘ఎల్లేమిళం కిళియే’ అనే దానిలో చిలుక వంటి గొప్ప మాధుర్యమైన మాట నేర్పరితనంగల ఉత్తమమైన గోపికను నిద్రలేపి తమ వ్రతంలోకి చేర్చుకొని నందగోపుని భవనం వద్దకు చేరుకుంటారు గోపికలు.
ఈ పాశురం భవనంలోని గోపికకు, బయట ఉన్న గోపికలకు సంభాషణ రూపంలో వుంది. లేత చిలుక వంటి మృదు ముర భాషణముగల దానా ఏమి ఆశ్చర్యం! (ఇంకా మాట్లాడక) నిద్రబోవుచున్నావా? (సున్నిత హృదయం గల నీవు ఇందరు వచ్చినా లేవకపోవడం నీ స్వభావం కాదు అని భావం)
అబ్బా! జిల్లుమనునట్లు పిలిచి నా ధ్యానానికి (తన్మయత్వానికి) అంతరాయం కల్గించకండి. పూర్ణులారా! ఇదిగో వస్తున్నాను, అన్నది లోపలి గోపిక. ‘నీ నేర్పరితనపు మధుర వాక్కులు మాకు ముందే తెలుసులే అన్నారు గోపికలు. సమర్థులు మీరేలే! పోనీ మీరన్నట్లు నేనే నేర్పరిని అనుకోండి. ఏమిటో చెప్పండి! అన్నది.
ఏమీ లేదు నీవు తొందరగా లేచి రావాలి. మేమందరం నీ కోసం వచ్చి నిల్చి ఉంటే, నీవు మాత్రం మాతో చేరక వేరే ప్రయోజనాన్ని ఆశించి ఉంటావా? అన్నారు గోపికలు. సరే రావలసిన వారందరూ వచ్చారా? (ఆత్మ గుణము అన్నీ శమ, దమ, క్షమాదులన్నీ పొంది వచ్చారా?) అవును వచ్చినారు. కావాలంటే వచ్చి లెక్క పెట్టుకొని చూడు అన్నారుగోపికలు. నీవు మాతో వచ్చి బలముగల ఏనుగును (కువలయాపీడనము మనసును పీడించే ఇంద్రియ శక్తులను చంపినవాడును) శత్రువుల యొక్క బలమును నశింపజేసే సమర్థత గలిగిన మాయావియైన శ్రీకృష్ణుని గానం చేయడానికి రావాలి. (ఇంద్రియ శక్తుల్ని ఆధీనం చేసుకొని స్థితిప్రజ్ఞతను, ఉత్తమ క్షమాగుణాన్ని పొందిన నీవు వచ్చి భజిస్తే మాయను మామీది నుండి గొలగిస్తాడు శ్రీకృష్ణుడు. కావున వెంటనే నీవు వచ్చి మా గోష్ఠిలో చేరాలి అంటున్నారు గోపికలు.
ఆండాళ్ తిరువడిగళే శరణమ్

- డాక్టర్‌ పరవస్తు కమల