మంచి మాట

మేలుకొలుపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై 17వ పాశురం ‘అంబరమే తుణ్ణీరే’
అమ్బరమే తుణ్ణీరే శోఱే అఱమ్ శెయ్యుం
ఎంబెరుమాన్ నందగోపాలా ఎళుందిరాయ్
కొమ్బనార్కెల్లాం కొళునే్ద కులవిళక్కే
ఎంబెరుమాట్టి యశోదాయ్ అఱివురాయ్
అమ్బరం ఊడరుత్తు ఓంగి ఉలకు అళంద
ఉమ్బర్ కోమానే ఉరంగాదు ఎళున్దిరాయ్
శెంపొన్ కోమానే ఉరంగాడు ఎళున్దిరాయ్
శెంపొన్ కళల్ అడిచ్చెల్వా బలదేవా
ఉంబియుం నీయుం ఉరంగు ఏల్ వార్ ఎంపావాయ్
భావం: ఈనాటి పాశురంలో శ్రీకృష్ణుని తండ్రియైన నందగోపుని, తల్లియైన యశోదాదేవిని, శ్రీకృష్ణుని అన్నగారైన బలరాముని నిద్ర లేపుతున్నది ఆండాళ్ తల్లి. ఈ పాశురంలో నందగోపుని దాతృత్వాన్ని, అజ్ఞానాన్ని దూరం చేసి దారిచూపే మంగళదీపం వంటి యశోదాదేవి స్వరూపాన్ని కరుణాహృదయాన్ని ప్రశంసిస్తున్నారు గోపికలు. శ్రీమన్నారాయణుడి సర్వవ్యాపకత్వాన్ని, దాతృత్వాన్ని, భాగవతులపైన వాత్సల్యం కలిగిన బలరామ దేవుడిని ప్రశంసిస్తూ మమ్ము కరుణించమని కోరుతున్నారు గోపికలు.
కరుణతో సున్నితమైన శరీరంగల స్ర్తిలలో కరుణార్ద్ర హృదయంలో శ్రేష్ఠమైన చిగురువంటిదాని, మంగళదీపము వంటి దానివీ అయిన యశోదమ్మ తల్లీ! నీవు మేల్కోవాలి. మమ్ము రక్షించాలి. సమస్త లోకాలను కొలిచిన త్రివిక్రమ రూపా! నిరంతరం నిత్య సూరులను ప్రకాశింపజేసేవాడివి! నీవు మేల్కొని మమ్ము కూడా నీ దాతృత్వంతో కరుణించాలి. ఎఱ్ఱని బంగారు కడియాన్ని కాలికి ధరించిన ప్రేమ స్వరూపుడివి ఓ బలరామా!
తిరుప్పావై 18వ పాశురం ‘ఉందుమదకళిత్తాన్’

ఉందు మద కళిత్తాన్ ఓడాద తోళ్‌వలియన్
నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్
కందం కమళుం కుళలీ కడైత్తిఱవాయ్
వన్దు ఎంగుం కోళి అళైత్తనకాణ్ మాదవి
ప్పన్దల్ మేల్ పల్ కాల్ కుయిలి నంగళ్ కూవినకాణ్
పన్దు ఆర్ విరలి ఉన్ మైత్తునన్ పేర్ పాడ
శెందామరై క్కైయాల్ శీర్ ఆర్ వళై ఒళిప్ప
వన్దు తిఱవాయ్ మగి ళిందు ఏలో రెమ్బావాయ్
భావం: ఈపాశురంలో పరాక్రమము గల నందగోపుని కోడలైన నీళాదేవిని నిద్రలేపి తలుపు తీసి శ్రీకృష్ణుని దర్శింపజేయవలసినదని ప్రార్థిస్తున్నది ఆండాళ్. స్థిర చిత్తాన్ని సాధించి, భగవంతుని దర్శించుకుందామనే ఆర్తితో వచ్చాము తల్లీ!
నీ హృదయ గుహల్లో దాగి ఉండే పరమాత్మను మాకు దర్శనం చేయించే శక్తి నీకే వుంది. కనుక ఆ ద్వారపు గడియను తీసి మమ్ము ఆయన చెంతకు చేర్చవమ్మా! ఉదారత, శక్తి కలిగిన నందగోపుడి కోడలివి నీవు అంటూ భక్తితో వేడుకుంటున్నారు గోపికలు.
ఏనుగులతో పోరాడగలిగిన వాడును, మధించిన ఏనుగు వంటి భుజబలము కలవాడును, మద జలము స్రవించే ఏనుగువంటి బలము కలవాడును అయిన నందగోపుని యొక్క కోడలైన ఓ నీళాదేవీ! పరిమళాలు వెదజల్లే కేశములు గల తల్లీ తలుపు గడియ తెరవాలి. కోళ్ళు అంతట లేచి కూస్తున్నవి. మాధవీలత ప్రాకిన పందిరిమీద కూర్చున్న కోయిలల సమూహాలు పలు మార్లు మధురంగా కూస్తున్నవి. లోకనాయకుడైన శ్రీకృష్ణ పరమాత్మ గుణములను కీర్తించుటకు మేము వచ్చి నిలిచాము. బంతిని చేతి వ్రేళ్ళతో పట్టుకొన్న తల్లీ!
సమస్త లోకాలను బంతిగా అలవోకగా పట్టి శ్రీమన్నారాయణునితో క్రీడా కాలక్షేపం చేసే తల్లి శక్తిరూపం. నీళాదేవి ఎఱ్ఱ తామరను బోలిన నీ చేతితో (అనురాగ బంధాన్ని జీవులపై ప్రసరింప జేసే తల్లి ప్రేమ రంగు ఎరుపు) కంకణాలు ధ్వనించేట్లుగా (తల్లి ప్రేమను తెలుపుతూ) లేచి వచ్చి (బిడ్డల కోసం ప్రేమతో లేచి) అజ్ఞానమనే హృదయ కవాటపు తలుపు తెరవాలి అని ప్రార్థిస్తున్నారు గోపికలు.
ఆండాళ్ తిరువడిగళే శరణమ్

- డాక్టర్. పరవస్తు కమల