మంచి మాట

జ్ఞానదీపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై 19వ పాశురమ్ కుత్తువిళక్కు ఎఱియ

కుత్తు విళక్కు ఎఱియ కోట్టుక్కాల్ కట్టిల్ మేల్
మెతైన్ఱ పంచ శయనత్తిన్ మేల్ ఏఱి
కొత్తు అలర్ పూంగుళల్ నప్పిన్నై కొంగైమేల్
వైతుక్కిడందమలర్ మార్‌పా వాయ్ తిఱవాయ్
మైత్తడం కణ్ణినాయ్‌నీ ఉన్‌మణాళనై
ఎత్తనై పోదుమ్ తుయిలెళ వొట్టాయిగాణ్
ఎత్తనై యేలుమ్ పిరివు ఆత్తకిల్లాయాల్
తత్తువమన్ను తకవు ఏలో రెమ్బావాయ్

భావం: ఈనాటి పాశురంలో గుత్తి దీపం ప్రకాశిస్తుండగా, శయమించియున్న నీళా-కృష్ణులను ఇద్దర్నీ నిద్రలేపి తమను కరుణించవలసిందగా ప్రార్థిస్తున్నది ఆండాళ్ తల్లి.
నీళాదేవితో కూడియున్న శ్రీకృష్ణుని శయనాన్ని వర్ణిస్తూ, నీళాదేవి తత్త్వాన్ని హృదయ ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూ కరుణించమని వేడుకంటున్నారు గోపికలు. శ్రీమన్నారాయణుని శయనం ఎక్కడో, ఎట్లా ఉంటుందో, ఆ శయ్యా లక్షణాలేమిటో, మీ దయ వల్ల మాకు తెలిసిపోయింది తల్లీ! పిల్లలను కరుణించే తత్త్వంగల నీవు తండ్రి హృదయాన్ని, చూపులను మావైపు త్రిప్పగల సౌందర్య స్వరూపానివి. మంగళ దీపానివి. మాకు వెలుగు నీవు తల్లీ! అని నీళాదేవిని ఆండాళ్ తల్లి గోపికలతో కూడి వేడుకుంటున్నది.
గుత్తి దీపము (స్తంభముగలది, ఐదు ముఖములు గల దీపము- కుత్తు విళక్కు) ప్రకాశిస్తుండగా (పరమాత్మ జ్ఞానం అయిదురకాలుగా తెలియజేస్తూ ప్రకాశిస్తుండగా) దంతపు కోళ్ళుగల మంచంపైన హాయిగా పంచగుణాలు కల్గిన మెత్తని పాన్పుపై, గుత్తులుగా వికసించిన పుష్పాలను ధరించిన కేశాలుగల నీళాదేవి ఎదపైతన హృదయాన్నుంచుకొని శయనించిన ఓ కృష్ణా నోరు తెరచి మాట్లాడాలి.
జీవుల హృదయ కుసుమాలను వికసింపజేసి పరిమళింపజేసే తల్లి కరుణా హృదయ స్పర్శ నీ ఎదకు తగిలింది కదా! ఇప్పుడైనా నీ వాక్కును ప్రసాదించు. జ్ఞానాన్ని అనుగ్రహించు. కాటుక అలదిన విశాలమైన కనులుగల నీళాదేవీ! ఎంతకాలము శ్రీకృష్ణుని లేవనీయవు? మమ్ము అనుగ్రహించనీయవు! ఎంత మాత్రము ఎడబాటును ఓర్వలేకపోవడం నీ స్వభావంకాదుగదా! తండ్రితో, నీతో కలిసి మేము ఆనందించక ఎడంగా ఉండడం నీవు భరించలేవు గదా తల్లీ! అని విన్నవించుకుంటున్నారు గోపికలు. మీరిద్దరినీ మేము చూసుకొనే భాగ్యాన్ని కలిగించమని గోపికలు కోరుకుంటున్నారు. జ్ఞాన దీపం వెలిగిన తరువాత ఇక అజ్ఞానం మచ్చుకు కూడా ఉండదు. అజ్ఞానం దూరమైన తరువాత భగవంతుడు తప్ప అన్యమేమీ కనపడదు కనుక ఐదు దీపాలను వెలిగించి ఆ వెలుగు లో పరమాత్మను సేవించడం అనుభవైకవేద్యమే కాని వర్ణించి చెప్పడానికి వీలు లేదు.
ఆండాళ్ తిరువడిగళే శరణమ్.

- డాక్టర్. పరవస్తు కమల