మంచి మాట

కరుణామూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై 21వ పాశురమ్
ఏత్తకలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప
మాత్తాదే పాల్ శొఱియుమ్ వళ్ళల్ పెరుం పశుక్కళ్
ఆత్త ప్పడైత్తాన్ మకనే అఱివుఱాయ్
ఊత్తముడైయామ్ పెరియాయ్ ఉలకిని
తోత్తమాయ్‌నిన్ఱ శుడరే తుయిల్ ఎళాయ్
మాత్తార్ ఉనక్కు పలితులైందు ఉన్ వాశల్ కణ్
ఆత్తాదు వన్దు ఉన్నడి పణియుమాపోలే
పోత్తి యా వన్దోమ్ పుకళుందు ఏలోరెమ్బావాయ్

భావం:ఈనాటి పాశురంలో ఆచార్యుడి వాత్సల్యాన్ని, సమస్త జ్ఞానాధికుడైన ఆచార్యుని ఔదార్యాన్ని ఆ ఆచార్యుడి ఆధీనంలో వుండే పరమాత్మను కొనియాడుతూ, కరుణించుటకు లేచి రమ్మని కోరుతున్నారు గోపికలు. ఆచార్యుడైన నందగోపుని ఆతని ఆధీనంలో ఉన్న పరమాత్మ శ్రీకృష్ణుడి ఉన్నత గుణాలను ప్రశంసిస్తున్నారు. ఆశ్రీత రక్షణుడైన పరమాత్మ శ్రీకృష్ణుడి ఉన్నత గుణాలను ప్రశంసిస్తున్నారు. ఆశ్రీత రక్షణుడైన పరమాత్మ బలపరాక్రమాలకు శతృవులు ఓడిపోయి వచ్చి ఆతని పాదాలకు శరణు వేడినట్లుగా, గోపికలు తమలోని ఇంద్రియ శక్తులకు ఓడింపజేసుకొని నీ బల పరాక్రమాలకు మంగళా శాసనాలు పాడటానికి వచ్చాము. ఇప్పుడైనా లేచి వచ్చి మమ్ము కరుణించు అని వేడుకొంటున్నారు గోపికలు.
పాలు పితుకుటకై పొదుగు క్రింద పెట్టిన భాండములు పాలతో నిండి పైపైకి పొంగి పొరలునట్లు ఆగక పాలు స్రవించే ఔదార్యంగల, నిండైన క్షీర సంపదనిచ్చే పెద్ద గోవులు సమృద్ధిగా గలవాడు నందగోపుడు. ఆతని కుమారుడైన ఓ శ్రీకృష్ణా మేల్కొనాలి. ఆశ్రీత రక్షణా స్వభావం కలవాడా! పరమాత్మ స్వరూపుడా! నీ నిద్ర (యోగనిద్ర) నుండి మేల్కొనాలి. శత్రువులు (రాక్షస గుణాలు) బలాన్ని పోగొట్టుకొని నీకు లోబడి వేరే గతి లేక, వచ్చి నీ పాదాలను శరణు వేడి నిలిచినట్లే, మేము కూడా (మాలోని రాక్షస గుణాలైన ఇంద్రియ శక్తులతో జీవితంలో పోరాడి పోరాడి అలసిపోయి, ఓడిపోయి నీ పాదాలను శరణువేడి, నీ కళ్యాణ గుణాలను కీర్తించి మంగళం పాడటానికై వచ్చి నిల్చిన వారము. మా అల్పత్వాన్ని గ్రహించాము. మమ్ము కరుణించి, రక్షించి, నీ దర్శనాన్ని కల్గించు తండ్రీ! అని ఆర్తిగా వేడుకుంటున్నారు గోపికలు ఈనాటి పాశురంలో. ఆండాళ్ తిరువడిగళే శరణమ్

- డాక్టర్. పరవస్తు కమల