మంచి మాట

పరమపదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై 22వ పాశురం ‘అంగణ్ మా’

అంగణ్ మా ఞలత్తు అరశర్ అభిమాన
బంగమాయ్ వందు నిన్ పళ్ళిక్కట్టిఱ్కీళే
శంగం ఇరుప్పార్ పోల్ వందు తలైప్పెయ్ దోమ్
కింగిణి వాయ్‌చ్చైయ్‌ద తామరై ప్పూప్పోలే
శెన్‌గణ్ శిఱిచ్చిఱిదే ఎమ్మేల్ విళియావో
తింగళుం అదిత్తియనుమ్ ఎళుందార్ ప్పోల్
అన్‌గణ్ ఇరండుం గొండు ఎంగళ్ మేళ్ నోక్కుదియేల్
ఎంగళ్ మేల్ శాపం ఇళందు ఎలోరెమ్బావాయ్

భావం:ఈనాటి పాశురంలో పరమాత్మ నేత్రాల కారుణ్యతను స్తుతిస్తున్నారు గోపికలు. విశాలమైన భూమండలాన్ని పాలించిన రాజులు తమ అభిమానాన్ని, గర్వమును విడిచి నీవు శయమించిన సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా వచ్చి చేరినట్లుగా మేము కూడా అహంకారాన్ని పూర్తిగా విడిచి గుంపులుగా వచ్చి నీ పాదాల చెంత చేరాము. తామరలు విచ్చుకొన్నట్లుగా నీ సుందర నయనాలు విచ్చి మెల్లగా సూర్యచంద్రులు ఒకేసారి వెలిగినట్లు మాకు జ్ఞాన ప్రకాశాన్ని, అమృతమయమైన ఆనందపు వెనె్నలను మా మీద ప్రసరింపజేయి.. అప్పుడు మా పాప కర్మలన్నీ నశించిపోతాయి. మా కోరిక ఇది మాత్రమే కృష్ణా! అని గోపికలు శ్రీకృష్ణపరమాత్మను వేడుకుంటున్నారు.
సుందరమైన మిక్కిలి గొప్పదైన, విశాలమైన భూమండలాన్ని పాలించిన రాజులు, ఇపుడు తమ అహంకార మమకారాలనే గుణాలను విడిచి వచ్చి నీ యొక్క పర్యంకమునకు, శయనించిన పరమ పదమనే మంచం క్రింద గుంపులు గుంపులుగా ముక్తి కోరి వచ్చి ఉన్న విధముగా, మేము కూడా నిన్ను కోరి నీ పాదాల చెంత చేరాము. చిరుగంట ముఖమువలె సగము విచ్చిన తామర పూలవలె వాత్సల్యము చేత రాగభావాలను నింపుకున్న నీ సుందరమైన రెండు కళ్ళను ఒకేసారి తెరిచి నీ కరుణా కటాక్షాలు మా మీద ప్రసరింపజేయాలి. చంద్రుడు (ముందుగా ఆచార్య కటాక్షము) సూర్యుడును ఒకేసారి ఉదయించినట్లుగా, ఆచార్యానుగ్రహంవల్ల పరమాత్మ చైతన్యం కలిగి జ్ఞానప్రకాశం కల్గినట్లుగా మావైపు నీవు చూస్తే చాలు మా మీది శాపము విడిపోవును, కర్మబంధాలన్నీ తొలగిపోతాయని వేడుకుంటున్నారు గోపికలు ఈ పాశురంలో.
ఆండాళ్ తిరువడిగళే శరణమ్

- డాక్టర్. పరవస్తు. కమల