మంచి మాట

పరమకృప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై 23వ పాశురం ‘మారిమలై’

మారి మలైముళంజిల్ మన్నిక్కడందు ఉఱంగుం
శీరియ శిం అఱివుత్తు త్తీవిళిత్తు
వేరి మయిర్ పొంగ విప్పాడుం పేర్‌ందు ఉదరి
మూరి నిమిర్‌ందు ముళంగి- ప్పుఱప్పట్టు
పోదురుమాపోలే నీ పూవై ప్పూవణ్ణావున్
కోయిల్ నిన్ఱు ఇంగనే పోందరుళి కోప్పుడైయ
శీరియ సింగాసనత్తు ఇరున్తు యామ్ వన్ద
కారియమ్ ఆరాయ్‌ందు అరుళ్ ఏలోరెమ్బావాయ్

భావం:ఈనాటి పాశురంలో, శుభసంకేతుడైన పరమాత్మ నృసింహావతార లక్ష్యాన్ని తత్త్వాన్ని ప్రశంసిస్తున్నారు గోపికలు. తత్త్వజ్ఞానంగల గోపికలు పరమాత్మ సృష్టి కారణ, కార్యతత్త్వాలను స్పష్టంగా సాంకేతికంగా వర్ణిస్తున్నారు. పరమాత్మ, ప్రకృతి, జీవాత్మ ఇది మూడు ఏకరూపం విడిపడని స్థితిలో ఓంకార పరమాత్మగా ఉపనిషద్గుహలో నివాసం చేస్తుంటాయి. పరమాత్మ వ్యూహ స్వరూప జ్ఞానం పొందిన భక్తులకేగానీ ఆ స్వరూపం గోచరించదు. ఆ స్వరూపాన్ని సృష్టి కారణ తత్త్వకారకుడైన సంకర్షణ, వ్యూహ పరమాత్మ రాజస స్వరూపమే గుహలో కళ్ళు తెరచిన శౌర్య సంపదగల సింహము. ఆ నృసింహావతార పరమాత్మను దర్శించిన గోపికలు, శ్రీ మహాలక్ష్మితో గూడిన సౌందర్య ప్రసన్న స్వరూపంతో అర్చావతార స్వరూపుడిగా దర్శింపజేసి మమ్ములనుగ్రహించు అంటున్నారు గోపికలు.
వర్షాకాలంలో పర్వతగృహలోపల చలనం లేక, సృష్టి కార్యాన్ని మరచిన స్థితికార రక్షణా కార్యక్రమాన్ని మరచి పడుకొని నిద్రించే శౌర్యముగల సింహము మేల్కొని, చైతన్యం పొంది తీక్షణమగు చూపులతో, పరిమళముగల వెంట్రుకలను నిక్కపొడుచుకొనేట్లు చేసి, అన్ని వైపులకు చూచి, కదలి అవయవాలన్నీ దులుపుకొని, కదలి ముందుకు సాగి, గర్జించి, బయటకు వచ్చి ముందుకు సాగునట్లుగా, పరమాత్మ సృష్టి సంకేత శబ్దమే ఓంకార శబ్దం, రూప దర్శనం తర్వాత, చలన తత్త్వం కనిపిస్తుంది. తర్వాత కాలగమనం. నీవు నల్లని అవిశ పుష్ప వంటి శరీర వర్ణంతో, గర్జన తర్వాత వర్షించే మేఘంవలె, నీ భవనంలోపలి నుండి (నిర్గుణ పరబ్రహ్మ తత్త్వమైన ఉపనిషత్తుల భవనం నుండి) ఇట్లే (వర్షించే కరుణారూపంతోనే) సౌందర్యంతో, తేజస్సుతో ప్రకాశించే సిహాసనంపై (శ్రీమహాలక్ష్మితో కూడిన శ్రీ లక్ష్మీ నృసింహుడి సౌందర్య రూపంగా, కరుణా హృదయంతో, కూర్చొని అప్పుడు మా పనేమిటో విచారించి మీ కృపాభాషణాన్ని అనుగ్రహించాలని వేడుకుంటున్నారు గోపికలు ఈ పాశురంలో.
ఆండాళ్ తిరువడిగళే శరణమ్

-డాక్టర్. పరవస్తు కమల