మంచి మాట

అఖిలాండేశ్వరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై 24వ పాశురం ‘‘అన్ఱు ఇవ్వులగమ్’’

అన్ఱు ఇవ్వులగమ్ అళందాయ్ అడిపోట్రి
శెన్ఱు అంగు తెన్నిలంగై శెట్రాయ్ తిఱల్ పోట్రి
పొన్ఱ చ్చగడం ఉదైత్తాయ్ పుగళ్ పోట్రి
కన్ఱు కుణిలా ఎఱిందాయ్ కళల్ పోట్రి
కన్ఱు కుడైయా ఎదుత్తాయ్‌కుణమ్ పోట్రి
వెన్ఱు పగై కెడుక్కమ్ నిన్ కైయిల్ వేల్ పోట్రి
ఎనె్ఱన్ను ఉన్ శేవగమే ఏత్తి పఱై కొళ్వాన్
ఇన్ఱు యామ్ వన్దోమ్ ఇరంగు ఏలో రెమ్బావాయ్

భావం:ఈ నాటి పాశురంలో పరమాత్మ విభవావతారాల్ని, ఐశర్య తేజోగుణాల్ని ఆశ్రీత రక్షణకై ద్రవించిన కరుణాహృదయాన్ని స్తుతిస్తున్నారు గోపికలు. ఎన్ని యుగాల పరమాత్మ వీర చరిత్రలు స్తుతించినా ఆయన పరాక్రమానికి అవి దివిటీలు పట్టినట్లే. నీ ఆశ్రీతుల కోసం ఎంత శ్రమ కోర్చి రక్షిస్తున్నావు తండ్రీ. నీ సమస్తమైన స్వరూపానికి మంగళం పాడుతున్నాము. మాలోని శత్రవుల్ని నశింపజేసి, మాకు కూడా ఆ పర అనే సాధనాన్ని అందించు కృష్ణా అని ఆర్తిగా మొఱపెట్టుకుంటున్నారు గోపికలు.
1.ఆనాడు వామనావతారంలో బలి చక్రవర్తి దగ్గర మూడడగులు దానం కోరి, సమస్త లోకాలనూ రెండడుగుల్లో కొలిచిన నీ శక్తివంతమైన పాదాలకు మంగళం!
2.శ్రీరామావతారంలో రావణుడున్ను లంకకు వెళ్లి అతడిని నశింపజేసిన నీ పాదాలకూ, బాహుపరాక్రమానికి మంగళం.
3.చిన్నపిల్లవాడివైన నిన్నుచంపాలని, శకటాన్ని ఆవహించిన అసురుని, ఎవ్వరూ ఊహించని విధంగా లేత పాదములతో తాకి కీళ్ళను విరిచి నశింపజేసిన నీ కీర్తికి మంగళం.
4.దూడలు మేపుటకు వెళ్లిన నిన్ను చంపాలని దూడ రూపాన్ని ఆవహించి ఒకడు వత్సాసుడు, వెలగచెట్టు రూపంలో నిలిచిన కపిద్థాసురులను ఒకేసారి చంపిన మీ శక్తికీ, పాదముల పొందికకు మంగళం.
5.కొండను గొడుగై ఎతిత గోవులను గోపాలురను రక్షించిన గోవర్థనగిరిధారివైన నీ వాత్సల్య గుణానికీ పరాక్రమానికీ మంగళం.
6.శత్రువులను జయించి, ఇంద్రియ ప్రకోపాలనే అంతశ్శత్రువులను, జన్మకర్మలను నరికివేసే చేతిలని నందక ఖడ్గానికి (వేలాయుధమునకు) మంగళం. ఇంత సున్నిత హృదయుడివి కనుకనే, పా పాప కర్మలను కూడా నరికివలేసి మాకీ నాడు దయతో ఆ ‘పర’ అనే వాద్యాన్ని అనుగ్రహించు కృష్ణా! ఇన్నిన్ని పరాక్రమాలు మాకోసం ప్రదర్శించి శ్రమించిన మీకు ఇది పెద్ద శ్రబ కాదు కదా! అంటూ స్వామికి మంగళాశాసనం పాడుతున్నారు. ఇరుపాపవైలో ఈనాటి ఈ పాశురం ‘మంగళాశాసన’ పాశురంగా ప్రత్యేక గుర్తింపు కల్గి ఉన్నది.

- డాక్టర్. పరవస్తు కమల