మంచి మాట

విద్యావినయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్య విహీనః పశుః’ అని భర్తృహరి ఉవాచ. అంటే విద్యలేనివాడు వింత పశువు అని తెలుగు తాత్పర్యం. దీన్నిబట్టి విద్య ఎంత విలువైనదోనన్న విషయం వివరణ, విశే్లషణ లేకుండానే అందరికీ అర్థమైపోతుంది. అవిద్యయే అన్ని అనర్థాలకు మూలహేతువు. అట్టి అమూల్యమైన విద్య యొక్క విలువను విశదపరుస్తూ భర్తృహరి ఏనాడో చెప్పాడు.
విద్య దాచుకున్న ధనమని- దోచుకో వీలు కాదని కీర్తి, భోగాలను లభ్యమయ్యేలా చేసేదని విద్యావంతులు విదేశాలలోనైనా ఆదరణ పొంది గౌరవింపబడతారని, విద్య దైవ సమానమని-దానికి సరియగు ధనము వేరొకటి లేదని, అటువంటి విద్య లేని మనిషి కాడని, విద్యా జ్ఞానం లభించకపోతే మానవ జన్మ పశువుతో సరిసామనమై వుండేదని- అర్థహీనమై అనర్థాలకు మూలమయ్యేదని అక్షరసత్యంగా చెప్పారు. తరచి చూస్తే అనుభవసారానికి అక్షరరూపమిచ్చారేమో మన పూర్వీకులు అనిపించక తప్పదు. అంత గొప్పదైన, గౌరవప్రదమైన విద్య నేటి ఆధునిక యుగంలో అంగడి సరుకుగా మారిపోయింది. విద్యా వ్యాపారం అన్నింటికంటే లాభసాటిగా, వాణిజ్యాలలో మేటిగా రాణిస్తూందన్న మాట వాస్తవ దూరం కాదు. అవసరాన్ని బట్టి విద్యను విపణి వీధిలో విలువకట్టి వ్యాపారం చేస్తున్నవారి ధోరణి కూడా కలియుగ మాయలో భాగమే! కానీ విద్య ఆ విధంగా కొనుక్కోవలసిన పరిస్థితి కల్పించడంవలన విద్యయొక్క ప్రయోజనం ధనార్జన కోసమే అవుతోంది.
తత్కారణంగా- ముందు చెప్పినట్లుగా ‘విద్య యొక్క విలువ’ విచక్షణాయుత వివేక విజ్ఞానాన్ని పెంచేదిగా కాక, వేరే విధంగా వక్రీకరించబడుతోంది! ఇదిలా వుండగా, విద్యాబోధన గరిపే ప్రధానోపాధ్యాయులు మరియు అధ్యాపకులు తమ గురుతర బాధ్యతను విస్మరించి ప్రవర్తించడం విద్యా విలువల్ని మరింత దిగజారుస్తున్నాయి. హేతువేదైనా అటువంటి దుశ్చర్యలు విద్య యొక్క పవిత్రతను నాశనం చేస్తాయి. నాగరీకులైన వారిని అనాగరికంగా మారుస్తాయి. సభ్య సమాజంలో లేనిపోని సమాధానం లేని సమస్యల్ని సృష్టిస్తాయి.
ప్రశాంతంగా సాగిపోతూన్న మానవ జీవితాన్ని అశాంతియుతంగా మార్చి - మొత్తంగా మానవాళిని ప్రభావితం చేస్తాయి. కనుక విద్య యొక్క నిజమైన విలువల్ని- మానవాళి ప్రయోజనాలుగా సిద్ధింపచేసుకోవాలంటే ప్రస్తుతమున్న విద్యా వ్యవస్థలో వౌలికమైన మార్పులు చేపట్టవలసిన ఆవశ్యకత అనివార్యంగా అనిపిస్తుంది. నీతి శతకాలు, నీతి చంద్రికలు పాఠ్యంశాలలో భాగంగా చేసి తరగని సంపదలనదగిన విద్యా విలువను మన తరువాతి తరాలకు అనుచానంగా అందించడం మనందరి కనీస కర్తవ్యం! ఆ దిశలో ప్రజలూ- ప్రభుత్వాలు ఏకోన్ముఖులై కార్యాచరణకు నాంది పలికితే గాలిలో దీపమై గతితప్పుతున్న మన విద్యారంగం అంతరంగం సాక్షిగా తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందగల్గుతుంది. అటువంటి కర్తవ్య నిర్వహణకు ఇదే సరైన సమయం!
ప్రభుత్వం కల్పించే నిర్బంధ విద్యను సరిగా అమలు చేసేవిధానానికి అందరూ తోడ్పడాలి. కేవలం చదువుకుంటే చాలదు. ఆ చదువు వల్ల వినయం, వివేకం ఏర్పడే చర్యలు విద్యను బోధించే గురువులు చేపట్టాలి. విద్యనేర్చుకొన్న వారు కేవలం పాఠ్యాంశాలు కంఠస్తంచేయడమే కాక సంస్కరాన్ని నేర్చుకోవాలి. స్ర్తీల పట్ల గౌరవభావాన్ని వారికి చిన్ననాడే ఏర్పర్చాలి. పెద్దల పట్ల గౌరవభావాన్ని చూపించడం నేర్పించాలి. తోటివారిపట్ల తమ కనీస కర్తవ్యాన్ని అయనా చేసేట్టు చేయగలగాలి. నడిరోడ్డు మీద అన్యాయం జరిగిపోతున్నా తమ కెందుకలే అన్నట్టు నిలబడి చోద్యం చూసినట్టు చూసి వెళ్లిపోతున్నారు. ఇట్లాకాక అట్టాంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నప్పుడో లేక బలవంతులు బలహీనులను హింసకు గురిచేసేటప్పుడో తన వంతు బాధ్యతను నిర్వర్తించేలా చేయగలగాలి. కేవలం ఇది చదువుకుంటే ఈ ఉద్యోగం వస్తుంది అనే చదువక ఒకవేళ అనుకొన్న ఉద్యోగం రాకపోతే ఏవిధంగా జీవనోపాధి ని పొందవచ్చో అనే మెళుకువను కలిగే ట్టుగా చదువును చదువుకొనేట్టుగా గురువులు చూడాలి. చదువుకునే వయస్సులోనే ఆత్మహత్యల్లాంటి అనాగరికమైన వాటికి పాల్పడేటట్టు తయారవుతున్న నేటి విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని కలిగించే విద్యను అందించాలి. ఇధి కేవలం గురువులే కాక తల్లితండ్రులు ప్రసార మాధ్యమాలు కూడా కల్పించాలి.

-మరువాడ భానుమూర్తి 8008567895