మంచి మాట

కోపము- నివారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏమహానుభావుడైనా మనిషికి- తన కోపమె తనకు శత్రువు అని చెప్తారు. కోపం గురించి మానవులే మహానుభావులే కాదు భగవంతుడు కూడా తన గీతాబోధలో కూడా చెప్పాడు. సామాన్యులైనా అసామాన్యు లైనా ఏదో ఒక కోరిక కోరుకుంటారు. ఆ కోరిక తీరకపోతే కోపం తెచ్చుకుంటారు. కోపం వస్తే బుద్ధి పనిచేయదు. వివేకం నశిస్తుంది.. ఎందుకు అనుకొన్న పని కాలేదు అని ఆలోచన ఉండదు. నేను ఇంత చేస్తే పని సఫలం కాలేదా అనే అహంకారం తొంగిచూస్తుంది. అహంకారం కలిగితే ఎదుటివాళ్లంతా పనికిమాలిన వారుగాను, తాను మాత్రమే గొప్పవారుగానో ఉండిపోతారు. దాంతో ఇంకాస్త బిగువు ఏర్పడుతుంది. అపుడు మరింత దిగజారిపోతాడు. మనిషిగా దిగజారితే పశులక్షణాలు ఆవహిస్తాయ. దాంతో దురాచారాలకు పాల్పడుతారు. దీనికంతటికీ కారణం మాత్రం కోపమే. కోపం రావడం సహజం. కాని ఆ కోపాన్ని నియంత్రించుకోగలిగితే మనిషిగా గుర్తించబడుతాడు. కోపం ఎలా అదుపులోకి వస్తుంది అంటే కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలవలనే మనిషికి, తన జీవితంలో వేర్వేరు దశలు సంప్రాప్తిస్తాయి. వాటిని అదుపులో పెట్టుకుంటే కోపాన్ని అదుపులోకి తెచ్చుకోవచ్చు. ఈ కోరిక కోరడంలో ఔచిత్యం ఉందా? ఇది అవసరమా? కోరిక తీరకుంటే ఏమి జరుగుతుంది అని ఒక్కసారి పునరాలో చించుకుంటే చాలు కోరిక దానికదే అదుపులోకి వస్తుంది. కోపం రావడానికి అవకాశమే ఏర్పడదు. ఇక అవతల వారు చేసినదానికి కూడా ఒక్కోసారి కోపం వస్తుంది. ఈ కోపాన్ని ఎలా అదుపు లోకి తేవాలంటే వారి స్థానంలో మనం ఉంటే ఎలా ఆలోచించేవాళ్లమో ఆలోచించాలి. క్షమాగుణాన్ని పెంచుకోవాలి. జరిగిన దానిని మార్చుకొనే అవకాశం లేదు కనుక హేతువాదంతో ఆలోచించిస్తే కోపాన్ని నియంత్రణ లోకి తేవచ్చు. కాసేపు వౌనంగా ఉంటే మన మనస్సు మనలను శాంతింపచేస్తుంది. అపుడు ఆ పనిని గురించి లేక ఆ మనిషి గురించి ఆలోచిస్తే కోపాతీవ్రత తగ్గుతుంది. ఇలా కూడా కోపాన్ని నియంత్రణలోకి తెచ్చుకునే మార్గం ఏర్పడుతుంది.
మహాభారతంలో పరీక్షిత్తు మహారాజు వేటకై అరణ్యానికి వెళ్లాడు. అక్కడ బాగా అలసిపోయాడు. వేట అనుకొన్న రీతిలో జరగలేదు. పైగా దాహానికిలోనైయ్యాడు. చాలా దాహం వేసింది. అపుడు ఒక మునీశ్వరుడి ఆశ్రమానికి వెళ్తాడు. ఆ ముని అక్కడ తపోనిష్ఠవలన కళ్లు మూసుకొని ధ్యానం చేసికొంటున్నాడు. మహారాజు రాకను గమనించలేదు. ఆ ముని ఈ సమాధిసిథతిలో ఉన్నాడు. కాని మహారాజు తాపసి తన రాకను లక్ష్యపెట్టలేథని కోపం తెచ్చుకున్నాడు. పిలిచినా పలకడం లేదు అన్న కోపం ఎక్కువైంది. దాంతో పక్కన ఉన్న చనిపోయిన పాము కనిపించింది. దాన్ని తీసుకొని ఆ ముని మెడలో వేసి వెళ్లిపోయాడు. ఆ రాజు దాని తర్వాతి పరిణామాలు ఆలోచించలేదు. దాహం తీరిందా లేక ఆ ముని మహారాజు ఉనికిని గుర్తించాడా లేదు . ఇవేవీ జరగలేదు. అపుడు కూడా ఆలోచనఅనేది లేక బాగా చేశా అనుకొని అహం తృప్తి పరుచుకుని అక్కడనుంచి మహారాజు వెళ్లిపోయాడు. కాని, కొంతసేపు తర్వాత మునీశ్వరుడి కుమారుడు వచ్చాడు. తన తండ్రి మెడలో పామును చూశాడు. జరిగింది తెలుసుకునాడు. ఇంత అహంభావం ఒక మహారాజుకు ఉండవచ్చా అని ఆలోచించాడు. వెంటనే అహం ముని కుమారుడిలోను ప్రవేశించింది. బుద్ధిమందగించింది. తన తండ్రి పట్ల చేసిన అపచారానికి తగిన శాస్తి చేయాలనుకొన్నాడు. వెంటనే తనకు తెలిసిన మంత్రాన్ని పఠించి శాపాన్నిచ్చాడు. బాగా చేశాను అనుకొన్నాడు. కాని మరికొద్ది సేపటికి ముని ఇహలోకంలోకి వచ్చాడు. జరిగిన దాన్ని తన దివ్యదృష్టితో చూశాడు. తన కొడుకు ఇచ్చిన శాపం వల్ల దేశం ఒక రాజును కోల్పోతుం దని భయపడ్డాడు. వెంటనే మహారాజు విషయాన్ని తెలియపర్చాడు. శాపాన్ని తిరిగి తీసుకోలేని కొడుకుకు జరిగిన అనర్థాన్ని చెప్పాడు. కాని మునికుమారుడు జరిగిన దానికి వగచాడు. కాని ఏమీ చేయలేని పరిస్థితి. మహారాజు తాను చేసిన దానికి బాధపడ్డాడు. కాని తిరిగి బాగు చేయ డానికి శక్తిలేనివాడు అయ్యాడు. చూశారాఅందుకే ఏ పని చేసినా కాస్త ఆలోచించాలి. అహంకారాన్ని దూరం పెడితే కోపం దగ్గరకు రాదు. కనుక కోరిక లేకపోతే అహమే రాదు. వీటిని ఆలోచించి యథార్థాన్ని గ్రహించి కోపాన్ని దూరం చేసుకోవాలి.

- చోడిశెట్టి శ్రీనివాసరావు