మంచి మాట

వాల్మీకి, వ్యాసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయణ, మహాభారతం మానవజాతికి రెండు కళ్లు. రెండు వేర్వేరు కాలాలలోని మానవ జాతి చరిత్రలు. ‘రామాయణం’ 24వ మహాయుగం (43 లక్షల 20 వేల సంవత్సరాల కాల పరిమాణం)లోని త్రేతాయుగానికి చెందినది కావడంవల్ల ప్రస్తుతం మనం 28వ మహాయుగంలో చివరిదైన కలియుగంలోనివారం కాబట్టి దాదాపు ఒక కోటి 70 లక్షల సంవత్సరాల నాటి గాథ. ‘్భరతం’ దాదాపు ఐదు వేల నాడు ప్రారంభమైన కలియుగానికి (క్రీ.పూ.3102లో ప్రారంభం) 38 ఏళ్ల ముందు జరిగిన మహాభారత యుద్ధానికి కారకులైన కురు వంశానికి చెందిన కౌరవ, పాండవులకు చెందిన గాథ.
ఈ రెండూ వాస్తవ చరిత్రలే. కల్పితగాథలు కానే కాదు. ఈ చారిత్రక గాథలు ప్రజల చేత చదివించి మానవ జీవిత లక్ష్యాన్ని ఆచరణ మార్గాన్ని చూపడానికై మన మనస్సులను రంజింపచేసేవిధంగా రచనలు చేసిన ఘనత మాత్రం మహర్షులైన వాల్మీకి, వ్యాసులది.
వీరు ఇద్దరూ తమ కావ్యాలైన రామాయణ, భారతాల ద్వారా వేద ధర్మాన్ని మానవజాతికి అందజేశారు అని మహా పండితులు అందరూ ప్రశంసించడం మనం ప్రత్యేకంగా గమనించదగిన విషయం.
‘రామాయణం’ సాక్షాత్తు వేదానికి మారు రూపుగానే ఉండేట్లు వాల్మీకి మహర్షి దాన్ని రచించాడనీ, వ్యాస మహర్షి వేదసారాన్ని అంతటినీ నింపి భారతాన్ని రచించడానీ పండితులు ప్రశంసిస్తున్నారు.
ఇవి రెండూ కేవలం చారిత్రక ఆధారం కలిగిన కావ్యాలు మాత్రమే కాదనీ, మానవ జాతి పురోగతికి ఇవి నిరంతర మార్గదర్శకాలనీ అందరూ గ్రహించడం జరిగింది.
‘రామాయణం’ ముఖ్యంగా మూడు విషయాలను వివరిస్తుంది అని వాల్మీకి మహర్షియే ప్రకటించాడు.
‘వేదార్థ బృంహణార్థాయ- కామ, అర్థ గుణ సంయుక్తం, ధర్మ, అర్థగుణ విస్తృతం’ అని రామాయణంలోనూ, వ్యాస మహర్షి మాత్రం మానవుని ‘పురుషార్థాలు’ లేక జీవిత లక్ష్యాలు నాలుగు అనీ, అవి ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనీ స్పష్టం చేశారు.
వాల్మీకి మహర్షి మానవ జీవిత లక్ష్యానికి సంబంధించిన సందేశాన్ని వేరుగా చెప్పనవసరం లేకుండానే సర్వమానవులకూ ఆదర్శంగా శ్రీరాముని ఎదుట నిలబెట్టి అతడు ఏ విధంగా సర్వోన్నతుడో తెలియజేశాడు. ఈ రామాయణ కథ వింటున్నపుడే మనం కూడా శ్రీరాముని వంటి సత్ప్రవర్తనతో మెలగాలని మన మనస్సులో ప్రబలమైన కోరిక కలుగుతుంది. ధర్మం ఆచరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ‘రామాయణం’లో వాల్మీకి మహర్షికి కలుగలేదు. కాని వ్యాస మహర్షి మాత్రం ‘్ధర్మం’ గురించి వివరిస్తూ, అది ఏ విధంగా మనల్ని రక్షిస్తుందో విశదపరుస్తూ ధర్మం ఆచరించండి అని ప్రబోధం చేయాల్సి వచ్చింది.
ఈ దృష్ట్యా ధర్మాన్ని అన్నం ముద్దలు కలిపిపెట్టిన అమ్మలాంటివాడుగా వాల్మీకి మహర్షి ధర్మాన్ని ఆచరించండిరా అంటూ పిల్లల్ని ఆదేశించే తండ్రిలాగా వ్యాస మహర్షి వ్యవహరించారు అని మనకు అనిపిస్తుంది.
ఇలా తల్లి, తండ్రిలా ధర్మమార్గాన్ని తమ కావ్యాలైన రామాయణం, భారతాల ద్వారా మనకు అందజేసిన వాల్మీకి, వ్యాసులకు మనం సర్వదా కృతజ్ఞులై ఉండాలి.
ఈ రెండు గ్రంథాలు ‘మతగ్రంథాలు’గా పరిగణింపబడుతున్నాయి. ఎందువల్లనంటే ధర్మం అనేది మనిషిని తన సృష్టికర్తయైన భగవంతుడితో కలిపే జీవిత విధానం లేక మతం కాబట్టి.
మనిషికి ధర్మబద్ధమైన జీవితం ఏర్పడాలి. ధర్మాన్ని మరవకుండా ప్రతి వ్యక్తీ తన జీవితాన్ని గడపగలగాలి. అలా ప్రతి వ్యక్తీ ధర్మబద్ధ జీవితం గడిపేట్లు పర్యవేక్షణ చేస్తూ దారితప్పి వారు తిరిగి దారిలో పెట్టడానికి పాలకుడు లేక రాజు అవసరం అవుతారు.
ప్రజా జీవితంలో అక్కడక్కడ తలఎత్తే అశాంతి దానిని సకాలంలో చక్కదిద్దడానికై రాజ ధర్మ నిర్వహణ ఈ రామాయణ భారతాలలోని అంతర భాగమేనని చెప్పక తప్పదు.

-సన్నిధానం యజ్ఞనారాయణ మూర్తి