మంచి మాట

గురువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ జీవితంలో గురువు పాత్ర చాలా ముఖ్యమైనది. ఆదిగురువు తండ్రి. తదనంతరం మన పూర్వ జన్మలో సంపాదించుకున్న పాప పుణ్యాల ఫలితంగా, మన అనే్వషణను అనుసరించి మనకు గురువు లభించడం జరుగుతుంది. గురోపదేశమ్ లేని విద్య నిష్ఫలం అంటారు పెద్దలు. అయితే గురువు అంటే ఎవరు? ఎలా వుండాలి? అనే సందేహం మానవ సహజం. సామాన్యులమైన మనం ఎంచుకునే గురువుకి ఇలాంటి భౌతిక, మానసిక లక్షణాలు ఉండాలనుకోవడం అంతే సహజం అని చెప్పుకోవచ్చు.
మహాత్ముల దృష్టి వేరే విధంగా గోచరిస్తుంది. అది మన మేధస్సుకి అందడం కష్టం. ఉదాహరణకి దత్తాత్రేయులవారు ఇరువది నలుగురు జీవులని తన గురువుగా భావించారు. ఆయన కొన్నాళ్ళు ఒక వారకాంతని పరిశీలించడం జరిగింది. ఆమె రోజూ విటులను ఆకర్షించడానికి అర్థరాత్రివరకు వేచి ఉండేది. ఆ సమయమంతా తన అందచందాలను చూసుకుంటూ గర్వపడేది. అయ్యో ఆమె సమయం వృధా చేసుకుంటూ వుంది. తన వృత్తికి తగ్గట్లుగా ప్రవర్తించినా, ఆ సమయంలో భగవంతుని ధ్యానం చేసుకుంటే ఇహం, పరం కలిగేవి కదా అనుకున్నాడు ఆయన.
ఆమె దగ్గరనుంచి ‘సమయం వృధా చేసుకోకుండా ఉండాలనే’ విషయాన్ని నేర్చుకున్న ఆయన, ఆమెను గురువుగా తలంచాడు. ఒకసారి ఆయన ఒక పక్షి మాంసపు ఖండాన్ని ముక్కున కరచుకు ఎగరడం, ప్రక్కగా ఎన్నో పక్షులు ఆ మాంసం ఖండంపై ఆశతో దాని వెంటపడుతూ ఉండడం గమనించాడు. వాటి ధాటికి తట్టుకోలేక కొంతసేపటికి ఆ పక్షి మాంసపు ఖండాన్ని జారవిడిచేయడం చూశాడు. వెంటనే ఆ పక్షిని వెంటాడుతున్న ఇతర పక్షులు దూరంగా తొలగిపోయాయి. ఆయన కోరికలని అంటిపెట్టుకున్నంతకాలం అశాంతి మనలను వేధిస్తూ వుంటుంది. ఎపుడు అయితే కోరికలను వదలివేస్తామో అప్పుడే శాంతి పొందగలం అని తెలుసుకున్నాడు. పక్షి రూపంలో ఒక గురువు దొరికిందని సంతోషించాడు.
ఒకరోజు ఒక కనె్న కవ్వంతో మజ్జిగ చిలుకుతూ ఉండడం ఆయన కంటపడింది. ఆమె చేతులనిండా గాజులున్నాయి. అందువలన పెద్ద శబ్దం రాసాగింది. అది ఆమె గ్రహించి గాజులు అన్నీ తీసివేసి ఒక్కొక్క చేతికి ఒక్కొక్క గాజు వేసుకుంది. శబ్దం రావడం ఆగిపోయింది. దత్తాత్రేయులవారు అక్కడ గ్రహించిన విషయం ఏమిటంటే ఒకరికంటే ఎక్కువ మంది ఒక చోట గుమిగూడితే మాటలు, అధిక ప్రసంగాలు ఎక్కువ అవుతాయి. అదే విడిగా ఉంటే వౌనంగా ఉండవచ్చని, భగవంతుణ్ణి ధ్యానించుకోవచ్చని, ఆ క్షణం నుంచే ఆ కనె్నని గురువుగా భావించాడు ఆయన.
ఒక రోజు ఆయన వెడుతుండగా ఒకచోట ఇంటిలోని వారెవ్వరూ లేకపోయినా ఇంటిలోంచి పెద్దగా శబ్దం రావడంతో, అది విన్న చుట్టుప్రక్కలవారు అప్రమత్తమయ్యారు. ఆ ఇంట్లోకి దొంగలు ప్రవేశించారు అనుకుని కర్రలు, కత్తులు పట్టుకుని అందరూ ప్రోగయ్యారు. పోగైన జనం ఎంతగా అరిచినా, కేకలువేసినా లోపలనుంచి ఎటువంటి సమాధానం రాకపోగా శబ్దాలు మరికాస్త ఎక్కువ కాసాగాయి. జనంకి ఏమీ అర్థంకాక తలుపులు బ్రద్దలుకొట్టి లోపలకి ప్రవేశించారు.
అక్కడ ఒక పిల్లి ఒక సన్నని మూతి గల పాత్రలో ఇరుక్కుపోవడం చూశారు. అందరూ కష్టపడి పిల్లికి ఏమీ గాయం కాకుండా దాని తల బయటకి తీశారు. ఆ పాత్రలో బెల్లంతో చేయబడిన ఒక తీపి పదార్థం ఉంది. పిల్లి అది తిందామని ఆశతో, తన మెడ దూరని పాత్రలో తల దూర్చి ప్రాణంమీదకు తెచ్చుకుంది. అది గమనించిన దత్తాత్రేయులవారు ఆశ వినాశహేతువు అని తెలుకున్నారు. తత్‌క్షణం ఆపిల్లి ఆయనకి గురువు అయిపోయింది.
ఈ విధంగా ఆరువది నలుగురు జీవులని తన గురువులుగా స్వీకరించారు దత్తాత్రేయులవారు. కేవలం మానవరూపంలోగాక గురువు ఏ రూపంలో, ఎక్కడున్నా తారసపడవచ్చు అనే విషయం మనం గ్రహించాలి. ఆ విషయంలో ఎంతో జాగరూకతతో వుండి, గురువుని అనే్వషించడంలో, మన మనోనేత్రం సర్వసన్నద్ధంగా ఉంచుకోవాలి.
ఎంతో మంది కలోకంలో ఎన్నో చెబుతుంటారు. అవి మహత్తర మైన విషయాలు కావచ్చు. లేదా పనికి మాలిన విషయాలు కావచ్చు. లేదా వారి వారి అనుభవపూర్వకమైన విషయాలే చెప్తుండవచ్చు. అయతే అన్ని విని ఏది మంచి విషయమో తెలుసుకొని దాన్ని మాత్రమే గ్రహించాలి.

- ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్