మంచి మాట

మున్ముందుకు సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య ఒకసారి ఓ విచిత్రం జరిగింది. ప్రఖ్యాత నటనాసౌర్వభౌముడు ఎన్‌టిఆర్‌ను స్వర్గంలో ఎ ఎన్‌ఆర్ కలుసుకొన్నారట. వారిద్దరూ అలా పిచ్చాపాటి మాట్లాడుకుంటుండగా అక్కడికి చాట్ల శ్రీరాములు గారు వచ్చారు. దాంతో వీరి సినీ ప్రయాణం హటాత్తుగా నాటకాల మీద సాగింది. శ్రీరాములుగారు
‘ఆ ఏముంది! మా నాటకాలు అవీ మీ సినిమా కొట్టిపారేసింది కదా. ’అని కాస్త బాధగా మొహం పెట్టారట. అంతలో అక్కడికి కందుకూరి, చిలకమర్తి ఇద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ
‘‘మీరు ఎనె్నన్నైనా చెప్పండి.. మీ సినిమా , మీ నాటకాలు ఒక ఎత్తు కాని మా ప్రహసనాలు మాత్రం వాటి విలువను అవి ఇంకా పెంచుకుంటున్నాయి ’’ అందరూ ఒక్కసారిగా వౌనం వహించారట. అంతలో నారద పాత్రలు కూడా పోషించిన గతం తాలూకూ ఛాయ కమ్మగా ఎఎన్‌ఆర్ ‘ఏమిటేమిటి మా సినిమా నిత్యవసంతోత్సవాలు ఆడుతోంది కదా. బాక్స్‌ఆఫీసులు బద్ధలుకొట్టే కలెక్షన్స్ వస్తున్నాయి. వారంరోజుల్లోనే కోట్లు కోట్లు గడిస్తోందని మన తెలుగు సిని ఇండ్రస్టీ అంతా చెప్పుకోవడం మీరు విన్నట్టుగా లేరు’’అన్నారట.వెంటనే నేనేమన్నా తక్కువగా అని ఎన్‌టిఆర్ వెంటనే ‘‘ ఆ విషయం వీళ్లకు తెలిసినట్టు లేదు. అయినా వీళ్లు ఎప్పుడో ఇక్కడికి వచ్చి తిష్ట వేశారు కదా. మీరంటే ఈ మధ్యనే వచ్చారు కదా అందువల్ల మీకు తెలిసినన్ని విషయాలు వీళ్లకు తెలిసినట్లు లేదు’అన్నారు. ఇద్దరు చెప్పడం విని కందుకూరి వారు చిరునవ్వు చిందించారట. చిలకమర్తి వెంటనే ఓహో ‘చింత చచ్చినా పులుపు చావదు’అంటే ఇదేనేమో మీ సినిమాలు మీరున్నకాలంలో సిల్వర్‌జూబ్లీ, గోల్డన్ జూబ్లీలు జరుపుకున్నాయి కదా. వందరోజులు ఆడింది ఇన్ని సినిమాల్లో మేమే హీరోలమి, నాతో కూడా నాలుగు తరాల సినీ హీరోయిన్స్ నటించడానికి పోటీలు పడ్డారు అని గర్వంగా చెప్పుకునేవారు కదా.’అన్నారు చిలకమర్తి వెంటనే ముక్కు ఎర్రగా చేసుకొన్న ఎన్‌టిఆర్ ‘‘అవునౌను.. నిజమే ఇప్పుడూ మా మనవళ్లు హీరోలుగా మా వారసత్వాన్ని నిలబడెతున్నారు’’అనగానే
వెంటనే చిలకమర్తి ఫకాలున నవ్వి ‘నటనా గ్రేసరా అటు కిందకు తొంగి చూడు.. ఎవరు పట్టినా సెల్ ఫోన్స్ పట్టుకొని సినిమాలు కాదు చూసేది కాలమ్స్ , బ్లాగ్స్ చూస్తున్నారు. బ్లాగ్స్ లో మా లాంటి వారే కదా రచనలు చేసేది చూడండి మా వారసత్వాన్ని’’అన్నారట.
కందుకూరి మరలా చిరునవ్వు నవ్వి ‘ఆర్స్.. దానిదేముంది కానీ కర్మభూమి అని మీ మా ఆంధ్రభూమిలో ఓ పేజిని కేటాయించి రచనలకు, నటనాశేఖరులకు, నృత్యభామినులకు,చిత్రకారులకు మంచి ప్రోత్సాహమివ్వడానికి ముందుకు వచ్చారు.. మన శర్మగారు.. ’అంటుండగానే
‘అదే నిన్న పొద్దుగాల నాకు తెలిశా.. నేను అంతా అరుసొకొచ్చి మీకు చెప్దామని గీ పోరగాళ్లని తోలుకొస్తున్నా గంతలో మీరే చెపిన్రు...’అంటూ కాళోజీ వచ్చాడు. ‘గిపుడు మా భాషావైభవం మీకందరికీ తెలస్తుంది.’అన్నారు కాళోజి.
‘నిజమే! నేనూ చూశాను. మన తెలుగు వెలుగులు పులుగులై ఎగరాలి సుమా ’ నేను కాస్త ధ్యానం చేసే సమయం ఐపోతోంది. మీరు కాస్త వారానికొక సారి రాకూడదూ మనం కాస్త మాట్లాడుకొందాం’అన్నారు ఎన్ టిఆర్. చిలకమర్తి ‘ నేను ఈ కందుకూరి వచ్చేస్తాం.’అన్నారు. ‘మనం ఆనాడు సంస్కరణలు చేశాం. కానీ నేడు స్వాతంత్రవాయువులు పీల్చుకుంటూనే ఒకరిని ఒకరుదోపిడి చేసుకోవడమో లేక హత్యలో, ఆత్మహత్యలో చేసుకొంటూ మన వాళ్లే మనకు శత్రువుల్లా వ్యవహరించడం చూస్తుంటే నాకు చాలా బాధవేస్తోంది’అన్నారు కందుకూరి ‘నాకు అలానే ఉంది ఈరోజు స్ర్తి సాధికారత సాధించింది. కాని ఎక్కడ చూసినా స్ర్తి హింసనే కనబడుతోంది. కాస్త దాని గురించి మాటాడుకుందాం.’మీరు రండి అన్నాడు కాళోజీ.
‘ఏదైనా మీరుమంచి కవిత్వమో, నాటకమో, ప్రవహసనమో, చిత్రమో రచించండి.దానికి మేము వేషభూషలు కల్పించి మీ మాట వారి చెవికెక్కేట్టు చేస్తాం ’అని ఒక్కసారిగా ఆర్స్ అన్నారు.
ఇలా మళ్లీ కలుసుకొందాం అనుకొంటూ ధ్యానతరగతులకు వెళ్లారు వారు...