మంచి మాట

దుర్ముఖుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దు ష్టం ముఖం యస్యసః దుర్ముఖ’ అని అమరకోశ వాఖ్య. సనాతన ధర్మాన్ని కాపాడుటకు ఆదిత్యుడు దుర్ముఖుడవుతాడట. రావణాసురుడికి పది తలకాయల మొఖమే కాదు పది నోర్లతో దురహంకార మాటలు కూడా ఉండేవి. అహంకారంతో, తలబిరుసుగలవాన్ని దుర్ముఖ అని రామాయణం చెబుతున్నది. ఈ అహంకారం వల్ల పది తలకాయల రావణాసురుడు రాముడి చేత ఒక తల కూడా లేకుండా చేసుకున్నాడు. ఐదు తలకాయల బ్రహ్మదేవుడు సహితం శివుని చేత చతుర్ముఖుడైనాడు.
రావణుడికి, పది నోటి అరుపులతోనే అతడికి ఆ పేరు వచ్చింది. ఓ రోజు రావణుడు ఆత్మలింగం కోసం, శివదర్శనానికోసం కైలాసం వెళ్లాడు. కాని దర్శనానికి నంది అడ్డుపడ్డాడు. దానికి రావణుడు కోపించి నందిని కోతి మొఖంవాడా అని నిందించాడు. దానితో నంది కోపంతో నీవు కోతులతోనే పతనమవుతావని శాపమిచ్చాడు.
రావణుడు తన బలమెంతో నందికి ప్రదర్శించాలని కైలాస పర్వతాన్ని తన ఇరవై చేతులతో ఎత్తబోయినాడు. పార్వతితో కలిసి వున్న కైలాసనాధుడికి కోపం వచ్చి తన బొటనవేలుతో కొద్దిగా అదిమినాడు. రావణుడి ఇరవై చేతులు కైలాస పర్వతం కింద పచ్చడై బాధ కలిగించింది. పంచముఖాలతో వున్న బ్రహ్మదేవుడు ఒకనాడు శివుడి వద్దకు వచ్చినపుడు బ్రహ్మ తన ఐదు ముఖములతో పార్వతీదేవిని ఓరగంటగా చూడటం మొదలుపెట్టాడు. ఆమె అందానికి మోహితుడైనాడు. పరమేశ్వరుడు ఇది కనిపెట్టి ఓ తల తన త్రిశూలంతో తీసేశాడు. అతడి దృష్టి వేరే మార్గం పోకుండా అందమైన సరస్వతిని సృష్టించి, ఆమెకొక వాణి ఇచ్చి, బ్రహ్మదేవునికి వీణానాదము వినిపించమని ఆమెతో చెప్పి పంపించాడు. అప్పటినుంచి చతుర్ముఖుడు సృష్టిలో పడ్డాడు. సుమధురమైన సంగీతం వింటూ పరమేశ్వరుడికి విధేయుడైనాడు.
కాని రావణాసురుడు శివానుగ్రహంతో రెచ్చిపోయాడు. దశముఖుడు రామున్ని నిందించాడు. ఫలితం లంకాదహనం. విభీషణుడు విడిపోవడం లంకకు చేటయింది.
భారతంలో దుర్యోధనుడు ఒక నోటితోనే దుర్ముఖయై పంచపాండవులను, ద్రౌపదిని అవమానపరిచాడు. రాయబారానికొచ్చిన శ్రీకృష్ణుడిని కట్టివేసి అవమానపరిచాడు. సుముఖుడు విదురుడు ఆదరించాడు. భక్తితో ఫలాలు అందించి పరమాత్ముని ఆనందపరచాడు. దుష్టులు తమకు అవాజ్య ప్రేమతో, హితము చేకూర్చువారిని సైతం హింసింతురు. ఇతరులకు హాని చేయుటలోనే తమకు లాభం కలదని భావింతురు. ఇతరుల పతనము చూసి ఆనందింతురు. ఉన్నతిని చూసి దుఃఖపడుదురు. ఇతరుల దోషములను వేయి కన్నులతో వెదకుచుందురు. నేతిని చెడగొట్టు ఈగలవలె వారి మనసులు ఇతర హితమును భంగపరుచుటలో నిమగ్నమగుచుందురు. వారు ఇతరులకు తాపమును గూర్చుటలో అగ్నివంటి వారు. క్రోధములో యమునివంటివారు.
దుష్టులు, దుర్ముఖులు, తమ మిత్రుల యొక్క శత్రువులయొక్క, తటస్తులయొక్క ఉన్నతిని చూచి ఈర్ష్యతో మలమల మాడిపోతారు. ఇతరుల పాపకృత్యముల గూర్చి పదివేల చెవులతో (చెవులప్పగించి) విందులు. మద్యపాన ప్రియులైనవారిని, పరస్ర్తి వ్యామోహితులను రావణాసురుడిగా చెప్పుకుందురు. భగవంతుడు చేతనాచేత స్వరూపమైన విశ్వమునందు మంచి చెడులను సృష్టించెను. హంస పాలను గ్రహించి నీటిని వదలినట్లే సాధువులు గుణములను గ్రహించి దోషములను దూరముగా పరిత్యజించెదరు. భగవదనుగ్రహమున విచక్షణాశక్తిని కలిగియున్నవారు చెడును విసర్జించి మంచిని మాత్రమే గ్రహింతురు.
విశ్వమునందలి చేతనా చేతన పదార్థములన్నియును శ్రీరామమయములు. కావున నేను వాటి చరణ కమలములకు చేతులు జోడించి మొక్కెదను. దేవతలు, దైత్యులు మానవులు, నాగులు, పక్షులు పితరులు గంధర్వ కినె్నర రాక్షసులు మున్నగు సమస్త ప్రాణకోటికిని ప్రణమిల్లుదును. తదనుగ్రహము నాకు లభించుగాక అని తులసీదాసు శ్రీరామచరితము రచించేముందు అతడు ఈ విధంగా నివేదించుకొని ప్రార్థించి మొదలుపెట్టాడు.

-జమలాపురం ప్రసాదరావు