మంచి మాట

అద్భుతశక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుడి జ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాలు కాక మరొక అద్భుతమైన శక్తి మనసు. ఇది నిక్షిప్తంగా ఉంటూ మనిషి చేత ఎన్నో విచిత్రాలు, విన్యాసాలు చేయిస్తూ ఉంటుంది. అసలు మనిషి జీవితానే్న నియంత్రిస్తున్న ఒక అద్భుత శక్తి మనసు. మనిషి జీవన పథం ఈ మనసు నిర్దేశించినట్లు, నిర్ణయించినట్లు సాగాల్సిందే తప్ప అన్యధా సాగలేదు. దీని ప్రభావానికి కట్టుబడి మనిషి తన జీవిత పథాన్ని ఎలా కావలిస్తే అలా మలచుకోగలుగుతాడు. ఈ మనసు ప్రేరణవలన మానవుడు ఒక గొప్ప తపస్వి కాగలడు. మహాజ్ఞాని కాగలడు. ప్రపంచ ప్రఖ్యాత శాస్తజ్ఞ్రుడు కావచ్చును, పరమ సాత్వికుడు కావచ్చును, మహావీరుడు కావచ్చును, రక్తపిపాస కలిగి, రాక్షస ప్రవృత్తితో దానవుడు కావచ్చును.
ఈ మనఃప్రకోపి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు అనుకుందాము. అపుడు నిరంతరం భగవధ్యానమువలన ఎప్పటికప్పుడు ఈ మనసుని మనము ప్రక్షాళన చేసుకొని పవిత్రమైన సంకల్పంతో, సద్బుద్ధితో లోక కళ్యాణము, సర్వమానవ శ్రేయస్సు దిశగా ప్రయత్నిస్తే మనసు మీద మనకు ఒక నియంత్రణ రావచ్చును. దీనికి అప్రమేయ దీక్ష అవసరం అవుతుంది. మనిషి సర్వేంద్రియాలను నియంత్రించే ఈ మనసు శైశవంలోనూ తన ప్రభావాన్ని చూపదు. అలాగే జీవిత చరమాంకంలో కూడా అంత విశేషంగా స్పందించదు. ఈ రెండు దశలలో మనిషి హృదయం భవ బంధాలకు అతీతంగా ఉంటుంది. అపుడే పుట్టిన శివువుకి అంతరాలతో పనిలేదు. అదొక నిష్కల్మష, నిస్వార్థ స్థితి. సర్వవ్యాపి భగవంతుడు ఆ శిశు హృదయంలో వుంటాడు. ఇంకే ఇతర శక్తులకు అక్కడ తావు లేదు. ఇకపోతే సుదీర్ఘ జీవన యానంలో అలసి సొలసి, జవసత్వాలు ఉడిగి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు సహకరించక, మృత్యు దేవత ఒడిలోకి ఎంత వేగంగా చేరుకుందామా అని ఎదురుచూస్తున్న సమయంలో, బహుశా మనసు తన ప్రభావాన్నిక్కడ చూపలేదు. మానవ జీవితంలో మనసు తన ప్రభావాన్ని చూపేది మిగిలిన దశలలోనే అనగా బాల్య, కౌమార, యవ్వన మరియు నడివయసులోనే.
యక్షప్రశ్నలలో యక్షుడు ‘గాలికంటే వేగంగా ప్రయాణించేది’ ఏదని అడిగితే ‘మనసు’ అని ధర్మరాజు బదులివ్వడం అందరికీ తెలిసిన విషయమే. ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగితే, దాన్లోంచి శిలాద్రవమే వస్తుంది. సాగర గర్భంలో ఒక్క బడబాగ్నే ఉంటుంది. నల్లని మేఘాలలోంచి జలధారే కురుస్తుంది. సూర్యుడు లోకానికి తన తాపానే్న ఇస్తాడు. అలాగే చంద్రుడినించి వెనె్నల మాత్రమే ప్రసరిస్తుంది. కాని ఒక్క మనసులోంచి మాత్రం కొన్ని వేల భిన్న భిన్న భావాలూ, ఆలోచనలూ నిరంతరం పుడుతూనే వుంటాయి. అరిషడ్వర్గాలు దీన్లోంచే ఉద్భవిస్తాయి. దయ, కరుణ, ప్రేమ, త్యాగం, నిస్వార్థం, క్షమాగుణం, దానగుణం, దురాశ, దుర్బుద్ధి, అజ్ఞానము ఇలా ఎనె్నన్నో సత్వ, రజో మరియు తమో గుణాలకు ఆవిర్భావ స్థానం కూడా ఈ మనసే...
మనసులేని మనుగడ లేదు. మనసే మనకు సతతము దశా దిశా నిర్దేశించేది. మనము నిదుర లేచినది మొదలు రాత్రి పడుకునేవరకు మన కార్యకలాపాలకు సాకారం కల్పిచేది మనసు. మనసు ప్రమేయం లేకుండా మనం కార్యాలను చేయలేము. అతి దుర్లభమైన మానవ జన్మ మనకు సంప్రాప్తించినందుకు భగవంతునికి మనం సర్వదా కృతజ్ఞులమై ఉండాలి. ఈ జన్మ ద్వారా ఉత్తమ గతులు ప్రాప్తించాలంటే మనసుమీద మనకు నియంత్రణ అవసరం. మనసు ఆదేశించిన ప్రతి కార్యాన్ని, ప్రతి భావాన్ని ఆచరణలో పెట్టే బదులు మనం ఒక విశే్లషణ పూర్వకంగా ఆలోచించాలి. ఇది చాలా కష్టతరమైనప్పటికి, సాధన ద్వారా ఇది సాధించించవచ్చు.
శ్రీకృష్ణ్భగవానుడు అర్జునుడికి గీతలోఇలా చెప్పాడు-ఎవడు ఇంద్రియములన్ని మనసుచే నియమించి వానిచే కర్మయోగమును సంగములేనివాడై ఆచరించునో, అతడుత్తముడు. కనుక కృష్ణుడుచెప్పిన ఉత్తముల్లో మనమూచేరుదాం.

-నేరళ్ల వెంకటరావు