మంచి మాట

ప్రత్యేకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకే వయసు పిల్లలు ఒకే విధంగా ఆలోచించరు. ఏ ఇరువురి ఆలోచనలు సైతం ఒకేలా వుండవు. వారి వారి అభిరుచులు, ఆలోచనలు, అలవాట్లు, నలుగురిలో మసలుకునే తీరు వేరుగా వుంటుంది. చేసే పనిలో ఒకరు అంకితభావానికి మారుపేరులా కన్పిస్తే, ఇంకొకరు నిర్లక్ష్యానికి మరొక పేరులా కనిపిస్తారు. ఒకరు భక్తికి పర్యాయపదమన్నట్లు కన్పిస్తే, ఇంకొకరు భక్తిదేనికని ప్రశ్నిస్తున్నట్లు కన్పిస్తుంటారు. మొక్కై వంగనిది మానై వంగడం అంత తేలికైన విషయం కాదు. పిల్లలు బాల్యంలో అలవరచుకున్న దృక్పథానికి అనుగుణంగానే వారి భవిత వుంటుందనేది నిర్వివాదాంశం.
ఒక్క భగవంతుడు తప్ప సువిశాల విశ్వంలో ఏదీ శాశ్వతం కాదు. తరాలు మారినా ఎప్పటికీ మార్పెరుగని శాశ్వత సత్యం మూన్నాళ్ల ముచ్చటలా ముగిసిపోయేదని ఎవరెన్ని సావధానంగా విన్నా అశాశ్వతమనే ఆలోచన అంత తేలిగ్గా అర్థమవదు. పిల్లలపట్ల పెద్దలెన్ని ఆశలు పెంచుకున్నా అందుకు అనుగుణంగా ఆలోచించి ఆ వైపు అడుగులు వేస్తే తప్ప కొందరి కలలైనా నిజం కావు.
చూసేదంతా శాశ్వతమని, చేసేదంతా శాశ్వతమని తెలిసీ తెలియని వయసులో పిల్లలనుకోవడం, తమకెదురు లేదని భ్రమించడం సహజం. అనుకోని ఎదురుదెబ్బలు తగిలినపుడు నీరసించడమే గాక నిరాశపడిపోవడం సహజం! ఇదే ధోరణి పెద్దల్లో ముఖ్యంగా ఆలోచనా పరుల్లో వుండకూడదు. పనిని బట్టి ఫలితముంటుందని, పనిలేక పని రాక పనిపట్ల ఆసక్తి చూపక ఎటువంటి ఫలితాలు పొందలేమని గుర్తించాలి. శ్రమకు తగిన విధంగా వరుస విజయాలు వరించినా సంపద పెరిగినా ఏదీ శాశ్వతం కాదన్న స్పృహను అలవరచుకోవాలి.
ఆటపాటల్లో ఎలా వున్నప్పటికి దైవలీలలేమిటో అర్థం చేసుకునే వయసు పిల్లలది కాదు. సాటివారిని ప్రేమించడాన్ని, వారికి చేతనైన సాయమందించే తీరు దైవ కృపకు పాత్రమవుతుందని పిల్లలకు తెలియదు. దైవం ఎవరికేది ఏ విధంగా ప్రసాదిస్తాడని గాని ఏ మనిషి మరో మనిషితో ఏ విధంగా ప్రవర్తించేది కాని అర్థం చేసుకోగలిగే వయసు పిల్లల్లో ఉండదు. పనితనం ప్రసాదించే సత్ఫలితాలు గాని, ప్రయత్నంలో అనుకున్నది సుసాధ్యమని అర్థం చేసుకునే వయసువారికి ఉండదు.
కనుక పిల్లలను తీర్చి దిద్దే పెద్దలే వయస్సు తగ్గట్టుగా వారిని ఆలోచించడానికి అవకాశాలు కలిగించాలి. అంతేకాక వారిలో దైవం పట్ల భక్తి దేశం పట్ల ప్రేమ నేర్పించాలి. ఎందరో గొప్పవారి జీవిత చరిత్రలను వారికి తెలిసేలా చేయాలి. ఆ గొప్పవారు చేసిన గొప్పపనులు తెలుసుకొనే క్రమంలో పిల్లల్లో తెలియకుండానే ధర్మం పట్ల అనురక్తి నీతి పట్ల ఇష్టత కలుగుతుంది. వారు పెద్దవారైనప్పుడు నీతినియమాలను ధర్మాధర్మాలను గ్రహించి ధర్మాచరణలో ముందుకు వెళ్తారు. ఇవన్నీ బోధించకుండా పిల్లలు మహోన్నతులుకావాలంటే మర్రి విత్తనం నాటి మామిడి పండ్లు కావాలని కోరుకున్నట్లే అవుతుంది.
విత్తనమొకటైతే మొక్క మరోకటవదు. మల్లెతీగ గులాబీలు పూయదు. గులాబి మొక్క మల్లెలనందించదు. దేని అందం దానిదే! దేని ప్రత్యేకత దానిదే. అలాగని ప్రత్యేకమైన ప్రయత్నాలతో సృష్టికి విరుద్ధంగా ఏదీ సాధ్యపడదు. ఎవరైనా సాధ్యపడినట్లు విర్రవీగినా, ఎదుటివారిని నమ్మించే ప్రయత్నం చేసినా అది వంచనే అవుతుంది. తనకెన్నో ఇస్తున్న ప్రపంచాన్ని వంచించడమే అవుతుంది.
పిండిలేని రొట్టెను ఆశించలేనట్లే ప్రయత్నానికి తగిన పట్టుదల సంబంధిత విషయంలో నైపుణ్యం లేనిదే పెద్దలైనా, పిల్లలైనా ఎటువంటి ప్రత్యేకలు సాధించలేరు. కారణాలేవైనా పెద్దలు తమలో లేని ప్రత్యేకతల్ని తమ పిల్లల్లో ఆశించడం ఎంత మాత్రం తప్పుకాదు. ఆ దిశలో ఆలోచించడం, అందుకు అనుగుణంగా నడుచుకోవడం అవసరమైన చోట దిద్దుబాటు చర్యలు చేపట్టడమైనా, అనుభవజ్ఞులైనవారి సలహాలు స్వీకరించగలిగే సహృయయైనా ప్రత్యేకంగా చెప్పదగిన విషయమనడంలో ఎవరికే అభ్యంతరాలు వుండవలసిన అవసరం లేదు.

- కొల్లు రంగారావు