మంచి మాట

అనుకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో తల్లికి ప్రధమ స్థానాన్ని ఇచ్చి గౌరవించాలని వేదాలు హితవు పలికాయి. తల్లి తాను గర్భం ధరించినప్పటినుంచి పుట్టబోయే శిశువును అతి జాగ్రత్తగా చూసుకుంటుంది. జాగ్రర్తగా తనకుతాను ఆలోచించుకునేస్థాయ వచ్చేవరకు తల్లి పిల్లలకుఅండదండగా ఉంటుంది. ప్రహ్లాదుడు కడుపులో నుండే నారద మహర్షి ఉపదేశాన్ని విన్నాడు. పుట్టినప్పటినుంచి నారాయణ నామంలో తరించి పోయాడు. అనుకరణతో మొదలయ్యే మానవ జీవితానికి మంచి ఉదాహరణలు లభిస్తే మానవ జన్మకు సార్థక్యం కలుగుతుంది.
అనూరుడు సుమతి కొడుకు. సూర్యభగవానునికి రథసారథి. పుట్టీ పుట్టకముందే తల్లి అసూయాపొగల వల్ల అంగవికలుడుగా పుట్టాల్సి వచ్చింది. అట్లానే కౌరవ వంశమూ వందమందిగా విభజనకూ తల్లిలో ఉండే అసూయే కారణం అయ్యంది.
ధ్రువుని తల్లి కూడా తండ్రి చూపించే ప్రేమలో తక్కువ తనాన్ని భరించింది. అవమానాలు ఎదుర్కొంది. తన కొడుకు తండ్రి అంకంపై కూర్చోడానికి అర్హత లేదని బాధపడుతుంటే భగవంతుడు తప్ప అన్యులెంత మంది ఉన్నా ఒక్కటే. కనుక నీవు ఆ భగవంతుని చరణారవిందాలను స్మరించు నిన్ను కోరేవాళ్లు నిన్ను కావాలనుకొనేవారు కోకొల్లలుగా ఉంటారని తల్లి దారి చూపించింది. అలాంటి దారి చూపించిన తల్లి వల్లే నేడు ధ్రువుడునక్షత్రమండంలో గొప్పస్థానానికి వెళ్లి అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు.
ధ్రువుని తల్లిలాగా ప్రతి తల్లి కరుణ రసాన్ని సౌహార్థాన్ని సౌభాతృత్వాన్ని దయాగుణానికి వారసులు కావాలి కాని అసూయాద్వేషాలకు స్థానాన్నిచ్చి తర్వాతి తరాలకు కుక్కమూతి పిందెలను అందివ్వకూడదు. రామాయణంలోను తుచ్ఛమైన రాజ్యకాంక్షతో అటు భర్తకు ఇటు కొడుకుకూ దూరమైన కైక జీవితం తల్లులందరికీ ఓ హెచ్చరికవంటిదే. భరతుడు సొంతంగా ఆలోచించే నేర్పును సాధించుకున్న తర్వాత కైక మనోఇచ్ఛను బయటపెట్టింది. ఆ కోరికను కాదనే స్థాయలో భరతుడు ఉన్నందువల్ల రామాయణ కథ ఇలా సాగింది.
కాని నేడు తల్లుల్లో చాలామంది తమకు పూర్తిస్వ్చేచ్ఛాస్వాతంత్య్రాలు ఉన్నాయని కొందరు, కొందరు మేము ఆశించినంత స్వేచ్ఛను పొందలేక పోతున్నామను కొంటూ పిల్లల్లో తారతమ్యతలను, అవాంఛిత స్పర్థను కలుగచేసే పరిస్థితులను కల్పిస్తున్నారు. అటు చదువులోనూ మీకన్నా అధికులు ఎవరూ ఉండకూడదనే ఆలోచనను కలిగిస్తున్నారు. కొంతమంది ఆ స్థాయకి చేరుకున్నా వారిలో కావాల్సిన మనోధైర్యం ఉండడం లేదు. చాలామంది ఆశించిన స్థాయకి వెళ్లలేక చివరకు ఆత్మనూన్యతకు గురవుతున్నారు. దీనివల్ల బాల్లలో చురుకుదనం తగ్గింది. సొంతంగా ఆలోచించే నేర్పుకు గండిపడింది. ఇతరులతో స్నేహసౌశీల్యంతో మాట్లాడడం వారితో సంబంధ బాంధవ్యాలను కొనసాగించడంలో విఫలురుఅవుతున్నారు. దీనికంతా కారణం కేవలం తల్లి నేర్పించే బుద్ధులల్లో స్థాయభేదాలుండడమే. కనుక దీన్ని గుర్తించి తల్లులందరూ పిల్లలకు మంచిని మాత్రమే బోధించాలి.
దానివల్లనే పిల్లలు అసాధ్యమైనవి సుసాధ్యమయ్యేట్టు చేయగలుగుతారు. మార్కండేయుడు అల్పాయుష్కుడైనా తల్లి ఆశీర్వచనమూ ఆమె కోరిక వల్లనే పరమశివుని మెప్పించి చిరంజీవిగా మిగిలాడు. ఇదంతా తల్లి నేర్పించే పలువిషయాల వల్లనే జరుగుతుంది కనుక తల్లి ప్రత్యేకమైన శ్రద్ధతో భావి తరాలకు బంగరు భవిష్యతుకు పునాది వేయాలి.
అపుడు మాత్రమే ధర్మవర్తనులైన పాండవులలాగా, పరులకు ఉపకారం చేయడమే నా ధర్మం అనే రామునిలాగా దుష్టులను దునుమాడి ధర్మాన్ని పునః స్థాపితం చేసే కృష్ణుడిలాగా, శత్రువుల గుండెల్లో నిద్రపోయే ఛత్రపతి శివాజీలాగా , ఓ వివేకానందుడిలాగా ఢొక్కా సీతమ్మలాగా, మదర్ థెరిస్సా లాగా భవిష్యత్తరాల్లో మనుషులను చూడగలం. కనుక తల్లులందరూ కాస్త పూనిక పూని భవిష్యత్తును బంగారు మయం చేయండి.

- ప్రసన్న