మంచి మాట

గమ్యము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గమ్యమనగా పొందదగినది అనే అర్థాన్ని చెప్పుకోవచ్చు లేక తను చేరుకోగోరు స్థానం (స్థితి) అని కూడా చెప్పవచ్చు. మానవ జీవన విధానంలో తాను ఒక గురి మనసులో ఏర్పరచుకొని దాన్ని సాధించడం కోసం వ్యయ, ప్రయాసలకు ఓర్చుకొని తన జీవితాన్ని కొనసాగించడం జరుగుతుంది.
అది ఆర్థికపరమైనదా? విజ్ఞానపరమైనదా? పరిశోధనా పరమైనదా? సేవా పరమైనదా, మతపరమైనదా, కులపరమైనదా, కుటుంబ పరమైనదా- ఇలాంటివెన్నో కలవు. ఏది ఏమైనప్పటికి సామాజికపరంగా ఇతరులకు మేలు చేకూర్చే విధానాన్ని ఎన్నుకోవడం మంచిది, మానవ లక్షణం కూడాను. మనం ప్రతి మనిషిని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏదో ఒక లక్ష్యం కలిగిన లక్షణం మనకు పసిగట్టవచ్చు. దాన్ని పూరించుకొనుటకు పడు తంటాలనేకం. తానీ సాధనలో ఇతర సమాజాన్ని ఏమీ పట్టించుకొనడు.
మనిషి కాలాన్నంతా వెచ్చించి ఆరాటపడినను సమయ, సందర్భాలను బట్టి తనకు లభ్యం కావచ్చు, కాకపోవచ్చు. జీవన పోరాటంలో నిర్వీర్యమైన వాడు విధి రాతగా సమర్థించుకొని అసంతృప్తి జీవితాన్ని గడుపుచున్నాడు. సంపన్నుడు కూడా అన్నీ సమకూర్చుకొని చివరకు తోటి వారందరూ తనను గుర్తించకపోయినపుడు, తనను నిర్లక్ష్యపరిచినపుడు తన సాధనలోని అంశాలను గుర్తుచేసుకొంటూ అసహనానికి గురై ఆవేదన చెందుతుండడం మనం గమనిస్తూ వుండడం సర్వసామాన్యం.
మనిషి గమ్యాన్ని ఎన్నుకోవడంలో తప్పులేదు. గమ్యం లేని మనిషి జీవితం వ్యర్థం. కాని ఎంచుకునే విధానం ఇతరులకు నష్టాన్ని, దుఃఖాన్ని చేకూర్చేదిగా వుండగూడదు. ఒకవేళలా తలపెట్టినా తను చేసిన దానికంటే ఎన్నోరెట్లు ఎక్కువ ఆవేదనను అనుభవించడం తథ్యం. మనకున్న పరిస్థితుల్లో మనకు చేతనైన రీతిలో ఇతరుల జీవితాల్లో వెలుగు నింపగలిగితే అది ఎంతో సంతోషాన్ని ఆరోగ్యాన్ని ఆయువును శక్తిని చేకూర్చుతుందో చూడగలం.
ఈ దృశ్యమాన ప్రపంచం అశాశ్వతం. ఎప్పుడూ మార్పు చెందుతూ వుండేదే. ఈ ప్రపంచంలో ఎన్ని పొందినా శాశ్వతానందాన్ని ఇవ్వలేకపోతున్నవి. కాబట్టి ఇంకొంత లోతుగా ఆలోచించాలి. నేనేమిటి? నాకీ సంబంధ బాంధవ్యాలేంటి? నా కర్తవ్యమేంటి? ఇత్యాదివన్నీ విచారిస్తూపోతే నేనేమిటో నాకు తెలిస్తే తప్ప సంశయ రహిత ఆనందాన్ని అందుకోలేనని బోధపడుతుంది. అందుకొరకే విలువైన సమయాన్ని, ఇంత మంచి మానవ జన్మను వృధా చేయక సకల ప్రాణుల యెడ ప్రేమ పూర్వక భావాన్ని కలిగి మహానుభావుల సాంగత్యాన్ని చూరగొని, వారి నాశ్రయించి అగమ్యగోచరమైన మనస్సుకు గమ్యాన్ని సూచించవలసిందిగా విన్నవించుకోవాలి తప్ప వేరే మార్గం లేదు. సృష్టి పరిణామక్రమంలో ఎంతటివారైనా కాలగర్భంలో లయం చెందాల్సిందే. ఇది అందరి ప్రత్యక్ష సాక్ష్యమే. అయినా మనిషి ఎందుకు విచారించుట లేదు. మనిషి మనస్సుకు జాగ్రత్త, మరుపను రెండు ప్రధాన లక్షణాలు. అందుకే మనిషి మరుపనే లక్షణంతోనే జీవిస్తున్నాడు. మనస్సు చింతలకు పుట్టిల్లు. ఒకటి తీరంగానే దాని స్థానంలో మరొకటి వచ్చి చేరుతుంది. తీరుదెప్పుడో అర్థంగాక మనిషి తికమకపడి ఆలోచనా రహితుడై దానికి రజోగుణము తోడై అక్రమార్జనకు పూనుకొని అంధకార బంధురమైన జీవితాన్ని గడిపి అధోగతి పాలవుతున్నాడు. కావున సత్సాంగత్యంవల్ల మనసును కుదుటపరచాలి. మనస్సు సున్నితమైనది, ఆనందమయమైనది. మరియు చిత్ర విచిత్రములైన లక్షణములు గల్గినది. దాన్ని జ్ఞానేంద్రియ బుద్ధితో, మహానుభావుల సుభాషితాలను గమనిస్తూ దిశా నిర్దేశం చేస్తూపోతే అంతకన్నా మిక్కిలేముంది.

=====================

మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి. మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.