మంచి మాట

సనాతన ధర్మాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సృష్టి భగవంతుని ఆజ్ఞానుసారం ఓకారంనుండి మొదలైందని మహాత్ములు చెప్పిన మాట. మానవుడు ఎంత అభివృద్ధి సాధించినా భగవంతుని దయ లేనిదే ఏమి చేయలేడన్నది అక్షర సత్యం. ఆదిమానవుడైనా.. నేటి మానవుడైనా ఆ భగవంతుడు ఇచ్చిన వాటితోనే జీవించాలి. అందుకు భగవంతుడు మనకు సర్వం ఇచ్చాడు. మనం జీవించటానికి మన మహాత్ములు ఏనాడో ఎన్నో సనాతన ధర్మాలు మనకు అందించారు. జననం నుండి మరణం వరకు ఎపుడు ఎలా వుండాలో అన్నీ సవివరంగా చెప్పియున్నారు.
ఎవరు నమ్మినా.. నమ్మకపోయినా ఎన్నో శాస్త్రాలు మన మహాత్ములు మనకై వ్రాసి వుంచారు. పూర్వం వనరులు సరిగా లేకపోయినా.. కేవలం సకల శాస్త్రాలు తమ శక్తిమేరకు తమ మనోనేత్రం నందే వుంచుకొన్నారు. ఆ తర్వాత తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు. ఉదాహరణకు జ్యోతిషశ్శాస్త్రం.. మనం పుట్టిన వేళననుసరించి.. మన వ్యక్తిత్వం, నడవడి అంతా చెబుతారు.. భగవంతుడు రాసిన తలరాతను మార్చలేకపోయినా.. మనము నడిచే మంచిదారిని మాత్రం కచ్చితంగా సూచించగలరు.. అలాగే సంఖ్యాశాస్త్రం, వాస్తుశాస్త్రం కూడా మనిషిని శాసించగలవు. నాడు గృహ నిర్మాణాలు, ఆలయ నిర్మాణాలు పరిశీలిస్తే.. చాలావరకు ఎవరికీ అంతుచిక్కని అభేద్యమైన నిర్మాణ శైలిలో నిర్మించారంటే.. అందులో శాస్తప్రూరితమైన నమ్మకం వుందనడంలో అతిశయోక్తి ఏమీ లేదు.
ఇక జననం నుండి మొదలయ్యే బారసాల, నామకరణం లాంటి ఉత్సవాలు మనకు సర్వసాధారణమే అయినా.. అందులో ఏదో ఒక మంచి దాగే వుంటుంది అనేది మన నమ్మకం. పదిమందిని పిలిచి బ్రాహ్మణోత్తముల చేత వేద మంత్రాల నడుమ మనకు పేరు పెట్టడం ఒక శుభసూచకం.
ఆ తర్వాత అక్షరాభ్యాసం. పూర్వం రోజుల్లో రాజైనా, పేదైనా అడవుల్లో గురువుల దగ్గర సకల శాస్త్రాలు, విద్యలు నేర్పేవారు. ఈ రోజుల్లో ఎవరి శక్తి మేరకు వారు బ్రాహ్మణుల చేత అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. చదివిన వారంతా మేధావులు కానక్కరలేదు. ఎవరికి ఏమి ఇవ్వాలో అదే భగవంతుడు ఇస్తాడు. అంతేకాని అందరూ సకల విద్యా పారంగతులు కాలేరు. డబ్బున్నవాడికి చదువు వంటబట్టకపోవచ్చు. ఏమీ లేని నిరుపేద జ్ఞాన సంపన్నుడు కావచ్చు. మనుషులంతా ఒక్కటే అన్నది మన సనాతన ధర్మభావం. ఆ రోజుల్లోనే అన్నమయ్య, వేమన లాంటి మహానుభావులు మన గురించి ఎన్నో నీతులు మనకు వివరించారు.
ఎన్ని అడ్డంకులు వచ్చినా మన సనాతన ధర్మ సాంప్రదాయాలను వీడరాదు. ఈ విశాల జగతిలో మన హిందూ ధర్మ సంప్రదాయం ఎంతో ఉన్నతమైనది. నీటిమీద బుడగల్లాంటి పరదేశి సాంప్రదాయాలు ఎన్నటికీ నిలువవుగాక నిలువవు. యాగమైనా, యజ్ఞమైనా, యోగమైనా మనం చేయవల్సిందే. యాగంలోని పరమార్థం పరమాత్మునికి దగ్గర కావడమే. యజ్ఞంలోని పరమార్థం మన జీవన ఆయుష్షును పెంచుకోవడమే. యోగం సకల జనావళికి ఆచరణీయ ఆదర్శనీయం. ఇలాంటి ఎన్నో ఉత్కృష్టమైన ధర్మాలకు నిలయం భారతావని. ఈ పుణ్యభూమిలో జన్మించడమే మనం చేసుకొన్న అదృష్టం.
పిల్లలకు సనాతన ధర్మ విలువలు తెలియజేయాలి. క్షణికమైన సుఖాల కోసం పెడతోవ పడుతున్న యువతను సన్మార్గం వైపు నడిపించాలి. చెప్పుకోవడానికి.. వినడానికి చాదస్తం అన్పించినా.. అందులోని భావాలు ఎంతో.. అమూల్యమైనవి. మంచి చెడు నేర్పించే అద్భుత మార్గదర్శకాలు.. మనిషి మనిషిలా జీవించాలి. మహాత్ముడు కాలేకపోయినా మన మహాత్ములు చూపిన మంచి మార్గాన జీవించాలి.. నడవాలి.
మనిషి జీవితంలో కాలానికి ఎంతో ప్రాముఖ్యత వుంది. మనిషికి కాలం ఎంతో విలువైనది. గడిచిన కాలాన్ని ఎవరూ వెనక్కి తీసుకురాలేము. బాల్యమంతా ఆటపాటలతో సాగినా.. యవ్వనం చాలా ముఖ్యమైనది. విద్యాబుద్ధులు నేర్చి.. వివేకంతో మెలిగి యవ్వనంలో ఏదైనా సాధించాలి. లేదంటే మనిషిగా మనకేమీ మిగిలి వుండదు. ఈ జన్మనిచ్చిన భగవంతునియందు సదా కృతజ్ఞతాభావంతో జీవిస్తూ.. మనకు జన్మనిచ్చిన మాతాపితరులను ప్రేమతో ఆదరిస్తూ.. భార్యాబిడ్డలతో అనురాగంతో జీవిస్తూ.. మనిషిగా పదిమందితో మంచిని పంచుకొంటూ మనిషిగా జీవించాలి.

-కురువ శ్రీనివాసులు