మంచి మాట

మన బ్రహ్మాండము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజ్ఞానం వృద్ధి చెందిన తర్వాత స్ఫుటనిక్ (కృత్రిమ ఉపగ్రహం) మొ.గు ఉపగ్రహముల ద్వారాను అవి ప్రసారంచేసే తీవ్ర విద్యుత్ రశ్మముల ద్వారాను మనకు అడ్డముగా క్రిందుగా కనపడే ఉత్తరధ్రువం, ధ్రువ నక్షత్రము ఇవి పై భాగమనియు దక్షిణధ్రువం మన భౌగోళమునకు క్రింది భాగమనియు తెలియుచున్నది. ఉత్తర ధ్రువము మన తలవంటిది కనుక మనము పుట్టినప్పుడు కూడ మన మధ్య తలపై గుంట ఉండును. అట్లే ఉత్తర ధ్రువ సమీపములో చాల భాగము ఐదు, ఆరు మైళ్ళ లోతు సముద్రపు గుంట ఉన్నది. మధ్యలో మైళ్ళ లోతు వరకు వ్యాపించిన విశాలమైన మంచు ఖండము ఉన్నది. ధరిత్రి మూర్తి శివుడనంగ అన్నట్లుగా మన దక్షిణ దేశములో చాల శివలింగాలకు మధ్య తలపై అట్లే ఒక చిన్న గుంట ఉండటము అక్కడ ఎక్కడి నుండియో నీరు ఊరుచుండటయో మనము చూచు చున్నాము. అన్నిటికంటె పై భాగమున ఉత్తరధ్రువ నక్షత్రమున్నదని పురాణములు పేర్కొనుచున్నవి. ఆ ఉత్తర ధ్రువములోని మంచు ఖండము మంచుదైనను జీపులు పోవచ్చును. విడిపోదు. గట్టిగా ఉండును. ఆ ఉత్తర ధ్రువ కేంద్రమున మనము నిలబడినచో ధ్రువ నక్షత్రము మన నడితలపై కనపడును. సూర్యుడు కొన్ని నెలల వరకు క్షితిజము వెంట బారెడు ఎత్తున మన చుట్టు 24 గం.లకు ఒక పర్యాయము ప్రదక్షిణముగా తిరుగుచున్నట్లు కనపడును. లక్ష్మిదేవికి పరమశివునికి ఈ ఉత్తర దిక్కు ముఖ్యమట. దేవతలందరికి ఉత్తరమే ముఖ్యము. దేవలోకములును ఉత్తర ధ్రువము నుండి పై భాగమున ఉండునట. అందువలన దేవతలకు ప్రదక్షిణ ముఖ్యమని శాస్తమ్రులు చెప్పుచున్నవి. ఆశ్చర్యకరముగా ఉత్తర ధ్రువములో మనము ఉన్నప్పుడు సూర్యుడుమన చుట్టు ప్రదక్షిణముగా తిరుగుచున్నట్లు ఇప్పటికిని గమనింపవచ్చును.
దక్షిణ ధ్రువము దగ్గరనుండి ఇంకా క్రిందుగా (అనగా పైగా) పితృలోకములు ఉన్నవట. ఆ దక్షిణ ధ్రువ కేంద్రములో మనము నిలబడినచో సూర్యుడు మనచుట్టు అప్రదక్షిణముగా తిరుగుచున్నట్లు కనపడును. అందువలన పితృదేవతారాధనలన్నియు అప్రదక్షిణముగా చేయవలెనట. అందువలన భూమి మన క్రింద ఉన్నట్లు మనము భూమిపై స్తంభములవలె నిటారుగా ఉన్నట్లు కనపడుట శంకర భగవత్పాదులవారు చెప్పినట్లు మనకు ఏది ఎట్లు కనపడినను అది మిథ్యయే. కాని ఉత్తర ధ్రువము పైకి దక్షిణ ధ్రువము క్రిందికి స్తంభము వలె భూమి ఉండగా మధ్యలో ఉండు మనము గోడకు మేకులవలె అడ్డముగా ఉన్నాము అన్నమాట. కాని మనము నిటారుగా ఉండునట్లు కనపడుట మిథ్యయే కదా. మన తలపై పైభాగమున ఉర్ధ్వభాగము కాదు. ఊర్ధ్వభాగము మన భూగోళమునకు ఉత్తరము. దక్షిణ ధ్రువము క్రింది భాగము. అనుటకై వేదములో దక్షిణమునకు అవాచీ అని పేరు. సంస్కృతములో అవా అనగా క్రింద భాగము అని అర్థము. ఇక్కడ నుండి మానవులెవ్వరును ఎన్ని తరములు గడిచినను చేరుకోలేనంత కాంతి సంవత్సరముల దూరములలో భూలోకపు ఉత్తర ధ్రువము నుండి పై భాగము వైపు 1. భువర్లోకం (్భలోకం యొక్క ఆకర్షణ ఉన్నంతమేర) 2. సువర్లోకం ( ఏ గోళము యొక్క ఆకర్షణయు లేని ప్రాంతము) 3. మహర్లోకం (సువర్లోకం తర్వాత కొన్ని కాంతి సంవత్సరములు తర్వాత ఉండునట) 4. జనోలోకం (ఆ మహర్లోకం పైన కొన్ని కాంతి సంవత్సరముల దూరములో ఈ లోకముండును.) 5. తపోలోకం (ఇది కూడా జనోలోకం పైన ఉండును) 6. సత్యలోకం (ఇది బ్రహ్మాండపు పై అంచు వద్ద ఉండునట. ఇది సృష్టికర్తయైన చతుర్ముఖ బ్రహ్మ యొక్క లోకమది.
ఇవ్వన్నియు వేరువేరు లోకములు కనుక భూలోకములోనే ఉన్నవేమో అనుకొనుట భ్రమ. ఒకదానికొకటి అనేక కాంతి సంవత్సరముల దూరములలో 1. అతల (సర్‌ఫేస్ లేనిది) 2. వితల (విభ్నన్న సర్‌ఫేస్‌లు కలది) 3. సుతల (మంచి సర్‌ఫేస్ కలది) 4. తలాతల (కొంత సర్‌ఫేస్ కొంత సరఫేస్ లేకుండా ఉండును) 5. రసాతల (ద్రవ పదార్థము సర్ఫేస్‌గాఉండును) 6. మహాతల (గొప్ప సర్ఫేస్ కలిగి యుండును) 7. పాతాల (బ్రహ్మాండము యొక్క అడుగున ఉండు పెద్ద లోకము అందులో పాతము అనగా దానివైపు లాగుట ఎక్కువగా ఉండును. దానిని దాని పై లోకములకు ఏ జీవియు రాలేదు. ప్రస్తుతం బలిచక్రవర్తి అక్కడ ఉన్నాడట.

- బ్రహ్మశ్రీ తెలకపల్లె విశ్వనాథశర్మ