మంచి మాట

మహనీయుడు మారుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయణానికి నాయకుడు శ్రీరామచంద్రుడైతే సుందరకాండకు నాయకుడు ఆంజనేయస్వామి. రాములవారిని వర్ణించే శ్లోకాలలో కూడ మారుతికి ప్రాధాన్యం ఉన్నది. ‘రామం భజే శ్యామలం’ అనే శ్లోకంలో ‘వామే............. హనుమాన్’ అని చెప్పడంతో సీతామాత తర్వాత రాములవారికి విశేష ప్రీతిపాత్రుడు. అంజనీసుతుడే అని వేరే చెప్పనవసరం లేదు. సుందరకాండ పూర్తిగా, కాకపోతే సప్తసర్గ అయినా పారాయణం చేస్తే కార్యసిద్ధి అవుతున్నదంటే అదంతా వాయునందనుని దివ్యప్రభావమే.
చోదకులు చరించే ఆకాశమార్గంలో సీతను వెళ్లినట్లు గ్రహించిన హనుమ తాను కూడా ఆ మార్గంలోనే వెళ్లదలిచాడు. సముద్రలంఘనానికి సమకట్టిన స్వామిని చూచి దేవతలు విజయానికి తోడ్పడే నాలుగు లక్షణాలు జ్ఞాపకశక్తి మేధసు, పట్టుదల,నేర్పు నీకు ఉన్నాయి అని కీర్తించారు.
స్వామి లంకలో ప్రవేశించి అమ్మ ఉన్న ప్రదేశాన్ని కనుగొనలేక కొంత అధైర్యపడినా వెంటనే ఆత్మవిశ్వాసంతో అనిర్వేదం అంటే ఉత్సాహం. పరమ సుఖ సాధనకు అనిర్వేదం అంటే ఉత్సాహమే ప్రథమ సోపానం అని అనుకున్నారు. ఇట్లా స్వామివారే మనకు సందేశం ఇస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో ఎంతసేపు తిరిగినా, ఎంత గాలించినా అమ్మ జాడ తెలియకపోవడంతో ఇష్టదేవతా ప్రార్థన చెయ్యకుండా ఈ ప్రయత్నం చేశానని గ్రహించి ‘‘నమోస్తు రామాయ సలక్ష్మణాయ
............మారుర్గణేబ్యో’’ అంటూ ఇష్టదేవతా సర్వదేవతాస్తుతి గావించాడు.
ఈ స్తోత్రంలో కూడా మొదట ప్రాధాన్యత తన స్వామికి, అమ్మకు ఇచ్చారు. అంతటితో ఆగకుండా ఇంద్రుడు, యముడు, రుద్రుడు, చంద్రుడు, సూర్యుడు మొదలైన మరుద్గణాన్ని కూడా స్తుతించాడు. ఏ పుట్టలో ఏ పామున్నదో అని పెద్దవాళ్లు అన్నట్లు ఎవరిని స్తుతించక పోతే ఎవరు ఆటకాలు కల్పిస్తారేమోనని స్వామివారి సంశయం బహుశకావచ్చు! రాముని దూతగా తనను చెప్పినపుడు సీతామాత మొదట విశ్వసించలేదు. అప్పుడు ‘‘రామఃకమలపత్రాక్ష సర్వసత్వమనోహరః ...............’’
అంటూ స్వామివారి గుణగణాలనేగాక ఆయన సౌందర్య శరీర లక్షణాలను ఏకరువు పెట్టాడు. రావణునివద్ద తాను ఎవరో చెప్పడానికి ‘‘అహం కౌసలేంద్రస్య దాసః’’ అని పరిచయం చేసుకొని తన స్వామి భక్తిని చాటుకొన్నాడు.
అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఆంజనేయస్వామి రామాయణంలోనే గాక మహాభారతంలోనూ దర్శనమిస్తారు. ఆయన ఏడుగురు చిరంజీవులలో ఒకరు కదా! ద్రౌపది సౌగంధిక పుష్పం తెమ్మని కోరినపుడు భీముడు అందులకై బయలుదేరతాడు. అలా వెళుతున్నప్పుడు ఆయనకు దారిలో ఒక చిన్న కోతి కనిపించింది. నిద్ర మత్తులో పడుకొన్నట్లు ఉన్నది ఆ వానరం. భీముడుఆ కోతిని విసుక్కుంటుంటే ఈ ముసలి ప్రాణిని బాధపెట్టక నా తోక పక్కకునెట్టి వెళ్లు నాయనా’ అన్నది ఆ వానరం.
నేను ఆంజనేయుడిలాగా నీ మీద నుండి లంఘించి వెళ్లగలను. కాని నేను ఆ ఆంజనేయస్వామికి నేను తమ్ముణ్ణి.నీవు ఆ జాతికే చెందినందున నీపైనుండి దుమికి వెళ్లడానికి ఇష్టపడను’ అన్నారు భీముడు ఆ తోకను కదిలించే విశ్వప్రయత్నం చేసినా అది అంగుళమాత్రం కూడ కదలడం లేదు. భీముడికి విషయం అర్థమైంది. ‘నీవెవరు స్వామీ’ అని నమ్రతగా అడగ్గా ‘సోదరా నేను నీవు చెబుతున్న ఆంజనేయుడను’ ఈ మాట వినగానే భీముడు స్వామికి సాష్టాంగ నమస్కారం చేశారు. మాకు యుద్ధంలో సాయం చేయాలని కోరాడు. నేను యుద్ధంలో అర్జునుని రథ కేతనంగావుండి మీకు సహాయపడతానని చెప్పాడు. ఈ విధంగా ఆంజనేయస్వామి రెండు యుగాలలో అతిశక్తివంతుడైన మహానీయుడుగా, కలియుగంలో సకల జనుల ఆరాధ్యదైవమై పూజలందుకొంటున్నాడు.

..............................................................
మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

- కాకుటూరి సుబ్రహ్మణ్యం