మంచి మాట

నీతి నిజాయితీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి మనుగడ సవ్యంగా సాగాలంటే నీతి నిజాయితీ తప్పకుండా పాటించాలి. లేదంటే మనిషి అధోగతి పాలవుతాడు. ముందుగా మనకు ఈ జన్మనిచ్చిన భగవంతునికి సదా ఋణపడి వుండాలి. మనవంతు బాధ్యతగా ఆ దేవున్ని స్మరణం, కీర్తనం, భజన రూపంలో ప్రతిక్షణం ఆరాధించాలి. అపుడే ఈ జన్మకు ఓ అర్థం పరమార్థం. ఆ తర్వాత మనకు జన్మనిచ్చిన మాతాపితరులయందు.. వారికి జన్మనిచ్చిన వారి మాతా పితరులయందు సేవాభావంతో చూస్తూ వుండాలి. తర్వాత మనకు విద్య నేర్పే గురువులయందు కృతజ్ఞతాభావం కలిగి వుండి.. వీలైతే తనదైన సేవలో జీవితాన్ని తరింపజేసుకోవాలి.
మనిషి ఎంత ఎత్తు ఎదిగినా వినయం, విధేయత, నీతి, నిజాయితీని వీడరాదు. రాజైనా, పేదైనా నీతికి తలవంచవలసిందే. ఎందరో తాము నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. కేవలం సత్యవాక్య పరిపాలన కోసం హరిశ్చంద్రుడు రాజ్యాన్ని, భార్యాపిల్లలను సైతం త్యజించాడు. చివరకు తను నమ్మిన సత్యం గెలిచి ఈ జగాన సత్యహరిశ్చంద్రుడిగా నిలిచిపోయాడు. దాన గుణంలో మేటి కర్ణుడు తన కవచ కుండలాలను ఇంద్రుడికి ఉదారంగా ఇచ్చేశాడు. తన తల్లి కుంతికిచ్చిన మాటకై ధర్మరాజు భీముడు నకుల సహదేవులను సంహరించనని వాగ్దానం చేశాడు. తను చేసేది అధర్మం అని తెలిసినా దుర్యోధనుడి స్నేహం కోసం పాండవులతో యుద్ధం చేసి చివరకు అమరుడయ్యాడు. అలాగే శిబి చక్రవర్తి పావురాన్ని కాపాడుటకై తన రక్తమాంసాలను ఇచ్చి తన దాన గుణాన్ని చాటాడు. బలిచక్రవర్తి భగవంతుడికిచ్చిన మాటకై తన ప్రాణాలను అర్పించి అమరుడయ్యాడు.
అలాంటి మహాత్ములు పుట్టిన ఈ కర్మభూమిలో అలాంటివారు నేడు కనుచూపు మేర కన్పించడం లేదన్నది అక్షరసత్యం. పది రూపాయల కోసం ప్రాణాలు తీయడానికి వెనుకాడని మనుషులు చాలామందే వున్నారు. మన దేశంలో జరుగుతున్న దారుణాలు మారణాలకంతే లేదు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదట. అందరూ అదే చేస్తున్నారు. మనం చేస్తే తప్పు ఏంటని మనం తప్పు చేస్తే భగవంతుని దృష్టిలో పాపులుగా మిగుల్తాము. ఈ భూమిపై మనుషులుగా మనగలుగుతున్నామంటే అంతా ఆ భగవంతుని కృపయే. మనకు కావాల్సిన సకల సౌకర్యాలు ఆ భగవంతుడు ఇచ్చాడు. అతని చల్లని దయ లేకుంటే లేదు మనకు జీవన గమనం. ఒక్క క్షణం మనం పీల్చేగాలి ఆగితే ఏమవుతాము. అంతా నిర్జీవం. ఆ కన్పించని దివ్య రూపమే భగవంతుడు.
ఈ జగాన మనల్ని సదా రక్షించడానికి ఎన్నోచోట్ల మనకై ఆలయాల్లో కొలువై వున్నాడు కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిగా, శ్రీశైలం మల్లికార్జునుడిగా, యాదగిరి లక్ష్మీనరసింహుడిగా, సింహాద్రి అప్పన్నగా.. అనంత పద్మనాభుడిగా... మన పాలిట కొంగు బంగారమై సదా మనల్ని కాస్తూనే వుంటాడు. పిలిచే పిలుపు ఏదైనా పిలిచిన వెంటనే తరలివచ్చి కన్నబిడ్డల్లా మనల్ని సదా కాపాడుతాడు. భగవంతుడు మన కంటికి కన్పించడు.. తన రూపాన అమ్మగా, నాన్నగా, అన్నగా, అక్కగా, చెల్లెగా, తమ్ముడిగా వివిధ రూపాల్లో మన కళ్ళముందే తిరుగుతూ మనల్ని కాపాడుతుంటాడు. అదే ఆ దేవలీలా రహస్యం.
సకల శాస్త్రాలకు, వేదాలకు పుట్టిల్లు మన భారతదేశం. సాంకేతికంగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో మన మహాత్ములు ఎన్నో మహాగ్రంథాలను మనకందించారు. ఖగోళ శాస్త్రం వరాహమిహిరుడు, వైద్యశాస్త్రం చరకుడు లాంటివారు మహోన్నతమైన విషయాలను ఆనాడే మనకు తెలియజేశారు. అందరికీ ఆదర్శనీమైన యోగ గురించి పతంజలి పూర్వమే సంపూర్ణంగా వ్రాశారు. నేడు యావత్ ప్రపంచం యోగను పాటించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతున్నారు. జాతకం, వాస్తు, సంఖ్యాశాస్త్రం లాంటి గ్రంథాలు ఆనాడే సంపూర్ణంగా రచించారు మహాత్ములు.మనిషిగా నీతి, నిజాయితీ, నియమం, నిబద్ధలతో జీవిస్తే.. మన జన్మ ధన్యమవుతుంది. అదే మనం భగవంతునికిచ్చే నిజమైన నివాళి. మనిషిగా జీవించాలి. మానవత్వంతో సదా పరిమళించాలి.

- కురువ శ్రీనివాసులు