బిజినెస్

‘అంతర్జాతీయ’ ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

45 పాయింట్లు పెరిగిన సెన్‌సెక్స్
ముంబయి, డిసెంబర్ 29: అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలను అందుకోగలిగాయి. బ్యాంకింగ్, ఆటో రంగాల షేర్ల కొనుగోళ్లకు మదుపరులు ఆసక్తి కనబరిచారు. దీంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెన్‌సెక్స్ 45.35 పాయింట్లు పెరిగి 26,079.48 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ స్వల్పంగా 3.80 పాయింట్లు లాభపడి 7,928.95 వద్ద నిలిచింది. ఆటో, చమురు, గ్యాస్, బ్యాంకింగ్, హెల్త్‌కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్ల విలువ 0.56 శాతం నుంచి 0.01 శాతం పెరిగింది. కాగా, బిఎస్‌ఇ మిడ్-క్యాప్ 0.42 శాతం పెరిగితే, స్మాల్-క్యాప్ 0.13 శాతం తగ్గింది. ఆసియా మర్కెట్లలో జపాన్, హాంకాంగ్, సింగపూర్, షాంగై సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు కూడా లాభాల్లోనే నడిచాయి.
మళ్లీ రూ. 100 లక్షల కోట్లకు బిఎస్‌ఇ సంస్థల మార్కెట్ విలువ
బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ) సంస్థల మార్కెట్ విలువ మళ్లీ 100 లక్షల కోట్ల రూపాయల మార్కును తాకింది. స్టాక్ మార్కెట్లు ఇటీవల వరుస లాభాలను అందుకుంటున్న నేపథ్యంలో మంగళవారం బిఎస్‌ఇ సంస్థల మార్కెట్ విలువ 1,00,01,254 కోట్ల రూపాయలకు చేరింది. గత రెండు రోజుల్లో బిఎస్‌ఇ సూచీ సెన్‌సెక్స్ 241 పాయింట్లు పుంజుకున్నది తెలిసిందే. కాగా, బిఎస్‌ఇ సంస్థల మార్కెట్ విలువ తొలిసారిగా 2014 నవంబర్ 28న 100 లక్షల కోట్ల రూపాయలను తాకింది.