బిజినెస్

మారుతి మరింత ప్రియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనవరి నుంచి రూ. 20 వేల వరకు
పెరగనున్న కార్ల ధరలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 10: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి.. కార్ల ధరలను పెంచుతోంది. వచ్చే నెల జనవరి నుంచి అన్ని మోడళ్ల ధరలు గరిష్ఠంగా 20,000 రూపాయల వరకు పెరగనున్నాయి. డాలర్‌తో పోల్చితో నానాటికీ క్షీణిస్తున్న రూపాయి విలువ, పెరిగిన ఇతర ఖర్చులు, పరిపాలనా వ్యయం మధ్య కార్ల ధరలను పెంచక తప్పట్లేదని మారుతి సుజుకి ఇండియా (ఎమ్‌ఎస్‌ఐ) అధికార ప్రతినిధి తెలిపారు. బుధవారం హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి నుంచి గరిష్ఠంగా 30,000 రూపాయల వరకు పెంపు ఉంటుందని పేర్కొంది.

హోండా సిటి, మొబిలియో కార్ల రీకాల్
న్యూఢిల్లీ, డిసెంబర్ 10: జపాన్‌కు చెందిన ఆటోమొబైల్స్ దిగ్గజం హోండా.. భారతీయ మార్కెట్‌లో 90,210 యూనిట్ల వాహనాలను రీకాల్ చేయనుంది. 2013 డిసెంబర్ నుంచి 2015 జూలై మధ్య తయారైన సెడాన్ సిటి, బహుళ ప్రయోజన మొబిలియో డీజిల్ వేరియంట్ కార్లలో ఇంధన లీకేజీ సమస్యను గుర్తించగా, దీనికి సంబంధించిన పైప్‌ను సరిచేయడానికే తాజా రీకాల్‌కు హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సిఐఎల్) పిలుపునిస్తోంది. ఈ నెల 19 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న హోండా కార్స్ డీలర్‌షిప్‌ల వద్ద వాహన యజమానులు ఉచితంగానే లోపాన్ని సరిదిద్దుకోవచ్చని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

హెచ్‌పిసిఎల్ సిఎండి నిషి వాసుదేవకు
సిఇఒ ఆఫ్ ది ఇయర్ అవార్డు
న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) నిషి వాసుదేవ 17వ వార్షిక ప్లాట్స్ గ్లోబల్ ఎనర్జీ అవార్డుల్లో సిఇఒ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. మరోవైపు సిఎస్‌ఆర్ అవార్డును రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కించుకుంది. కాగా, ప్లాట్స్ గ్లోబల్ ఎనర్జీ అవార్డులను ఆస్కార్స్ ఆఫ్ ఎనర్జీ అవార్డులుగానూ పిలుస్తారు. హెచ్‌పిసిఎల్‌కు తొలి మహిళా అధిపతి అయిన నిషి వాసుదేవ.. గ్లోబల్ ఫార్చూన్ 500 సంస్థల్లో చోటు దక్కించుకున్న 14 మంది మహిళల్లో ఒకరు.

సిల్వేనియాలో 80 శాతం వాటాను
విక్రయిస్తున్న హావెల్స్
న్యూఢిల్లీ, డిసెంబర్ 10: కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ సంస్థ హావెల్స్ తమ యూరోపియన్ లైటింగ్ బిజినెస్ సిల్వేనియాలో 80 శాతం వాటాను విక్రయిస్తోంది. షాంగైకి చెందిన ఫీలో అకౌస్టిక్స్‌కు 1,070 కోట్ల రూపాయలకు ఈ వాటాను అమ్మేస్తోంది. హావెల్స్ హోల్డింగ్ లిమిటెడ్ ఈ లావాదేవీలన పర్యవేక్షిస్తోంది.