రాజమండ్రి

అక్కడికి వెళ్లగానే.... (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదరం తువాలుతో
అక్షరం ముఖం తుడుచుకొన్నట్లుంటుంది
మాటలు కంటే చూపులే
చేతులు కంటే మనసులే
ముందుగా హత్తుకుంటాయి

పుస్తకాల రెక్కల చప్పుడుకు
మెదడు చిగురాకులా కదిలిందీ అక్కడే
పత్రాల ఎదల్లో మాటువేసిన హరిత వర్ణం
ప్రపంచమంత విస్తరిస్తోన్న దృశ్యం
చూసిందీ అక్కడే

పుస్తకాన్ని మస్తకాన్ని సమానంగా ప్రేమించేచోట
కనురెప్పల చూరుమీంచి జారే కన్నీటికి
కవిత్వమంత ఆనకట్ట నిర్మించుకుందీ
అచ్చోటనే..

ఇంటి దూలానికి వేలాడదీసిన
ఓజోను లాంతురులా
పుత్తడి ఊహలకి పురుడు పోసే మంత్రసానిలా
ముఖచిత్రమే కాదు మనోపత్రం కూడా...
పుస్తక మస్తకం తెరవగానే
వందలకొద్దీ అనుభవాల్ని వెంట తెచ్చుకొన్నట్టు
వేల వేల విజ్ఞాన గుళికల్ని మింగినట్లు
ఏ పుటలో ఎనె్నన్ని పచ్చని జ్ఞాపకాలుండేవో...

పిప్పర్మెంట్ ఇచ్చి
పిల్లగాని సముదాయించినట్లు
అక్కడ మళ్లీ కొత్త పుస్తకాల
మెతుకుల వాసన కురిసేదెపుడో....
కళ్లవెంట అక్షరాలూ
అక్షరాల వెంట కళ్లూ, కృతులు కృతులుగా
ప్రేమిస్తూ, ప్రేరేపిస్తూ, వేధిస్తూ, ఓదారుస్తూ
జ్ఞాపకాల తుంపర్లని తుడుచుకుంటూ
తప్పించుకు తిరుగుతున్న ముద్దాయిగానే.....
(పాత పుస్తకాల గది చాన్నాళ్లకి
తెరచినప్పుడు....)

- ఎస్‌ఆర్ భల్లం, తాడేపల్లిగూడెం, సెల్: 9885442642
**

గాయాలకి మందుగా..

అమ్మతనమెపుడు కమ్మనై
అణువులందు పులకింత అవుతుంది
బిడ్డ భవితే ఆమెకి శ్వాశ
శరీరానికి గాయమైనా
మనసు వేదనా భరితమైనా
మనిషి కళ్లు చెమ్మగిల్లుతవి
అపుడు, భార్య కూడా
అమ్మలా మారిపోతుంది
చంటి బిడ్డను చేసి
సకల ఉపచారాలలో
నిండా మునిగిపోతుంది
ప్రతి పనిలోను భాగస్వామ్యం
ఆమెకి తృప్తినిస్తుంది
ఆమె ఓదార్పులో
గాయమైన మనసు
ఊపిరి పీల్చుకుని
సేద తీరుతుంది
పిల్లలు ఎదిగి, పెద్దయినాక
నాన్న జ్ఞాపకాలను
కళ్ల ముందర పరుస్తారు
కొందరు.., అనుబంధాల్ని
జీవనాడికి చుట్టుకుని
కొండంత ధైర్యాన్ని
ఊపిరిగా నిలుపుతారు
ప్రేమని హృదయమంతా పూసుకుని
నిరంతర సేవల్లో
శ్రమని అరగదీస్తారు
చూపుని నాన్న చుట్టూ
పహారాగా నిలుపుతారు
బాధ్యతని వర్తమానం చేసి
నాన్న కోలుకోవటం చూసి
తృప్తి మొక్కై విహరిస్తారు

- ఎస్‌ఆర్ పృధ్వి, రాజమహేంద్రవరం
**

నరకొద్దు

చెట్లను ఎపుడూ నరకొద్దు
నరికి చేటును చేయొద్దు
చెట్లను పెంచుట వదలొద్దు
పువ్వును ఇచ్చి కాయను ఇచ్చి
పండును ఇచ్చే చెట్టు
నరకుట మనకు తగునా?
తల్లి లాంటి చెట్టును
తెగ నరకుట న్యాయమా?

మొక్కను పెంచితే
క్రమంగా ఎదిగి
మనకు ఆనందం ఇస్తుంది
చెట్టయ్యాక అది
నీడను ఇస్తుంది
పక్షులకు గూడవుతుంది
ఎన్నో జీవులకు ఆశ్రయమవుతుంది
ఇట్లాంటి త్యాగ జీవిని
నరకటం మనకు తగునా
తెగనరుకుట మంచియగునా
వాడినా ఎండినా తాను
కట్టిగా కలపగా ఉపకరిస్తుంది
ఎన్నో వస్తువులుగ మారుతుంది
కుర్చీ, బెంచీ, మంచం అన్నీ తానై
చివరకు మనతో మాడి మసైపోతుంది
కడదాక మనతో ఉండే చెట్టును
నరకటం మనకు న్యాయమా
తెగనరకటం పుడమికి మంచియగునా?

- దర్భా వెంకటేశ్వరశర్మ,
పెద్దాపురం, 9396224463
**

ప్రతి పువ్వులో నీ నవ్వు

ప్రతి పువ్వులో నీ నవ్వులె కిలకిలలతో విరబూచెను
ప్రతి నవ్వులో నీ కన్నులె వెనె్నలై విరబూచెను
ఆకాశం ఏరుకుంది నీ నవ్వుల తారావళి
ఎడబాటుతో ప్రేమావళి ఇరుల విరుల విరబూచెను
స్వర్గానే్న దించావు నీ ప్రేమలో ముంచావిట
స్వప్నానే్న చేశావుగా ముళ్లపొదలు విరబూచెను
నీవిచ్చిన హృదయమ్మిక నలిగి నలిగి పోయెనుగా
నీ వెచ్చని కౌగలి ఇక శోకంతో విరబూచెను
ఎంత దూరమైనావిట ఎన్ని బాసలిచట జరిగె
చెంత నీవు లేక నాకు దుఃఖభ్రాంతి విరబూచెను
నీ ‘రమ’కిక శాంతి లేదు క్రాంతి లేదు ప్రియసఖుడా!
కమ్మని రుచియైన ప్రేమ కన్నీరై విరబూచెను

- బిహెచ్‌వి రమాదేవి, రాజమండ్రి, సెల్: 9441599321