నెల్లూరు

పచ్చని చెట్లు మోడయిపోయెను..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జత లేదు..
మతి లేదు
గతి లేదు
క్రుంగెను హృదయం
చెదిరెను మనసు
రాలెను ఆశ
బాంధవ్యం కనుమరుగై
సంఘజీవనం వగరై
చాంచల్యం మెరుగయ్యెను
సంతాన స్పర్శకై చెయి చాపెను
ఒంటరియై వెక్కి వెక్కి ఏడ్చెను
ఆశ్రమాల దారి పట్టెను
కరుణ లేని బిడ్డలు
కఠినమైన మనసులు
కాటికెళ్లు కాయములు
మేను ఆవిరైనా
ఆత్మలో అవే అవే తలపులు
కన్ననాటి, పెంచిన నాటి జ్ఞాపకాలు
ముదుసలా! అబ్బా..చాదస్తం
నానా చాకిరీ..మీకో నమస్కారం
అంటున్న చెట్టుకు కాసిన
కాయల్లారా!
కన్న ఋణం తీరిపోయిందా?
పేగుబంధం మాసిపోయిందా?
అనాథలు కాదు
అభాగ్యులు కాదు..
అయినా
చీకట్లు ముసురుకొనెను..
పచ్చని చెట్లు మోడయిపోయెను..!

- యర్రాబత్తిన మునీంద్ర,
నాయుడుపేట,
చరవాణి : 8331844527
***

స్పందన

సగటు ఉద్యోగి బాధను తెలిపిన
రిటైర్మెంట్
గత వారం మెరుపులో ప్రచురితమైన రిటైర్మెంట్ కథ చాలా బాగుంది. నిడివి తక్కువైనా కథలో చెప్పదలచుకున్న విషయాన్ని విపులంగా వివరించిన విధానం బాగుంది. సాధారణంగా గవర్నమెంటు కార్యాలయాల్లో పనిచేస్తున్నంత సేపు అక్కడి సిబ్బంది జీవన విధానం ఒక ఎత్తయితే, వారు రిటైర్మెంట్ అయిన తరువాత వారి పరిస్థితి మొత్తం మారిపోతుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందేందుకు వారి కార్యాలయాల చుట్టూ తిరగడంతో పుణ్యకాలం గడిచిపోతుంది. కథలో సగటు ఉద్యోగి బాధను వర్ణించిన విధానం ఆకట్టుకుంది. అయితే ఇక్కడ కథలో చివరికి ఉద్యోగి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందకుండానే చనిపోవడం కొసమెరుపు. మంచి కథను అందించిన రచయిత్రి గౌతమి గారికి ధన్యవాదములు.
- అల్లిబిల్లి రంగనాయకమ్మ, కందుకూరు
- హేమంత శరత్‌బాబు, తిరుపతి
- రావి అనంత పద్మావతి, మార్కాపురం

ఉదయరాగాలు బాగున్నాయి
గత వారం మెరుపులో రవీంద్రబాబు గారి కలం నుంచి జాలువారిన ఉదయరాగాలు అద్భుతంగా ఉదయించాయి. ప్రతి లైన్ నిత్యనూతనంగానే ఉదయించి పాఠకులను పరవశింపజేసింది.
- జానకిరామ్, సైదాపురం
- కావ్యప్రసాద్, సౌత్‌మోపూరు

ప్రకృతికి కవితలతో అభిషేకం
మెరుపులో వృక్షోరక్షతిరక్షితః శీర్షిక కింద ప్రచురించిన కవితలు ప్రకృతి కాంతకు కవితలతో అభిషేకం జరిగినట్లు అనిపించింది. పచ్చని చెట్లను కాపాడుకుంటునే భవిష్యత్ తరాలు హాయిగా వుంటాయి. ప్రకృతికాంతకు జేజేలు అంటూ కాళిదాసు విజయచందర్ గారి కవిత, అఖండ జీవరాశికి వెలుగురేఖలు మన వృక్షాలు అంటూ లక్కపల్లి శ్రీనివాసరావు గారు గొప్పగా వర్ణించిన కవిత రెండూ బాగున్నాయి.
- ఐనవోలు రఘురామాచారి, పుంగనూరు
- అంజలిదేవి ఘట్టం, వింజమూరు
- సూరిబాబు, గిద్దలూరు

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net