విశాఖపట్నం

అల్లకల్లోల జీవులకు సాంత్వన... ‘శ్రీరామాయణము’ ( పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాప్తిస్థానం
వెల: ఇండియా-రూ. 279.00
విదేశాల్లో- పది (డాలర్లు)
పిఎల్ నారాయణరావు,
డో.నెం. 43-7-32/1,
గణేష్‌సాయి కార్తికేయ
అపార్టుమెంట్సు,
ప్లాట్ నెం. 101, ‘శ్రీరామ మారుతి’,
రైల్వే న్యూకాలనీ, విశాఖపట్నం-16,
ఫోన్-0891-2561603,
సెల్: 9550294395.
***
కలియుగం తోవ తప్పింది. ఈ దేశం, ఆ దేశం అని లేదు. జీవులు నివసించకలిగిన అన్నిచోట్లా ఉత్పాతం రగులుకుంది. ఇందులో జల ప్రాంతం.. అంటే, కుంటలు, వాగులు, చెరువులు, సరస్సులు, చివరకు మానవుడు భయపడే ఆ సముద్రాల్లో కూడా కల్లోలం రేగిపోయింది. భగవంతుడు మనిషి అనే జీవిని సృష్టించాడు. ఈ జీవి పది కాలాలపాటు బతకాలని భూమి, ఆ భూమిపై పచ్చిక బైళ్ళు, ఇతర మూగజీవాలనూ ఇచ్చాడు. బతకగా, బతకగా మానవుల్లో కొంతమంది రుషులుగా మారారు. తమ భక్తి, తపస్సు ఫలితంగా ఫలించిన దివ్యదృష్టితో సమస్తం దేవుని కృప అని కొన్ని వందల ఏళ్ళ తర్వాత అవగతం చేసుకున్నారు. ఇదే ఇలానే సుభిక్షంగా ఉండాలంటే, తాము పరిశోధనలు చేయాలని సంకల్పించారు. వివిధ రకాలైన పరిశోధనలు చేశారు. రహస్యం పట్టారు. అవే సంస్కృతీ సంప్రదాయాలు. కాలం ఇలా నడుస్తుండగా అభివృద్ధి చెందిన మానవజాతికి స్వార్థబుద్ధి పుట్టింది. వటవృక్షమైంది. వీర్రవీగాడు. ఇదంతా నాది. నా వల్లే గాలి వీస్తోందన్న అహంకారానికి ఎదిగిపోయాడు. భారత సంస్కృతీ లేదు.. సంప్రదాయమూ లేదనుకున్నాడు.
అంతే.. ఆ క్షణం నుంచే అధోగతి ఆరంభమైంది. అది ఇలా నేటి వరకూ వచ్చింది. దేవాలయాలు శిథిలాస్థకు చేరాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రి రాత్రికే ఉన్నపళంగా భూమిలో కలిసిపోయాయి. స్ర్తిజాతికి రక్షణ మృగ్యమైంది. చెట్లకు జీవించే కాలం తగ్గిపోయింది. సరస్సులు, సముద్రాలు కలుషితమయ్యాయి. సముద్రుడి ఆగ్రహం తీరానికి తాకింది. మానవుడు తోటి మానవుడినే చంపుకొనే స్థాయికి వెళ్ళిపోయాడు. అయితే, అక్కడక్కడా కొన్ని దీపాలు వెలుగుతున్నాయి. ఆ కాంతి కిరణాల్లో కొన్ని జీవులు క్షేమంగా జీవిస్తున్నాయి. ఆధ్యాత్మికత విస్తరించాలి. ఇది ఇంకా విశ్వవ్యాప్తంగా విరజిల్లాలి. అప్పుడే సకల సంపదలు కలిగి, భూమంతా కళకళలాడుతుందని భావించిన విశాఖపట్నంకు చెందిన ఆధ్యాతిక రచయిత పంతుల లక్ష్మీ నారాయణరావు తన రచనా వ్యాసంగంలో మరో గ్రంథమైన శ్రీరామాయణము (శ్రీ సీతారాముల దివ్యకథ) అనే గేయ కావ్యమును వెలువరించారు.
హనుమత్ప్రభ, శ్రీ ఆంజనేయుని అవతార విశేషాలు, శ్రీ షిరిడీసాయి అమృత వర్షిణి, శ్రీ షిరిడీసాయి కర్ణామృతము, శ్రీ సీతారామ గానసుధ, శ్రీ సుందరకాండము వంటి గ్రంథాలను రచించారు. రామాయణములో ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి, అవగతం చేసుకుని మనోహరంగా ఈ గ్రంథంలో పాఠకులకు విపులీకరించారు. ఈ గేయాల్లో పదమార్దవం, భావలాలిత్యం, విషయవైద్రుశ్యం సుస్పష్టం. ప్రతీ పాత్రలోని వ్యక్తిత్వం, అక్కడి సన్నివేశము చదువరులకు కళ్ళకు కట్టినట్టు అనిపిస్తుంది.
పుడమిని త్రవ్వి-పునాదులు వేసి/కడు నేరుపుతో- గోడలు బెట్టి/వెదురు బొంగు- కంబములు నమర్చి/జమ్మి కలప-వాసాల నమర్చి/ పచ్చి వెదురులు-నడుమును బెట్టి/ నారతాళ్ళతో-ముడులు బిగించి/బోదరెల్లును- ఇంపుగ గప్పి/ పర్ణశాల నిర్మించె లక్ష్మణుడు
ఇది అరణ్యకాండంలోనిది. అరణ్యవాస సమయంలో రాముని కోరికపై పంచవటిలో పర్ణశాల నిర్మిస్తాడు. ఆ సంగతిని తన రచనా నైపుణ్యంతో లక్ష్మీనారాయణ పై విధంగా పాఠకుల ముందుంచారు.
బంగారమునకు- ఆ సీసమునకు/రాజహంసకు- రాబందునకు/ మృగరాజునకు- మార్జాలమునకు/ ఎంత అంతరమొ-అంత యున్నది/ నా రామునకు- నీకును రావణ/ మహా భాగుడు- మహా తేజుడు/ అగు రాముని సతి- నన్ను కోరుకొని/ సర్వనాశనము-బొందకు నీవనె
వక్రబుద్ధితో మునివేషంలో వచ్చిన రావణాసురుడుతో సీత అతనికి-రామునకు గల అంతరం ఎంతటిదో పై గేయము తెలుపుతున్నది. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అక్షరజ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరూ చదువలసిన గేయ గ్రంథమిది. వ్యక్తి సంస్కారవంతంగా తయారయ్యేందుకు ఎంతో దోహదకారిగా ఉన్న ఆధ్యాత్మికతతో మానవుని మనుగడ ముడిపడి వుంది. కాదు అని వాదిస్తే.. అసలు మానవుడే ఉండడు!

- గున్న కృష్ణమూర్తి, 9493802010.