విజయవాడ

పాపం.. ఆ పిల్లకేం తెలుసు (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపం ఆ ఆడపిల్లకేం తెలుసు
బడికెళ్లి నాలుగక్షరాలు నేర్చుకోవాలనుకుంది
ఇంట్లో ఖాళీ కంచాన్ని చూసి
మధ్యాహ్న భోజనంతో
కడుపు నిండుతుందని ఆశపడింది
చింపిరి జుట్టు చినిగిన గౌనులో నుంచి
స్కూల్ డ్రస్ చూసుకుని మురిసిపోయింది
అక్షరాల నుంచి ఒక్కో మెట్టూ పైకెక్కి
చదువే ధ్యేయంగా శక్తి సాధనతో
ఆకాశం అంచుల దాకా ఎగరాలని
జీవితాన్ని సవాల్‌గా తీసుకుని
సమాజ సమూహంలో విహంగమై ఎగరాలని
ఆ పిల్ల మనసులో ఎనె్నన్ని కలలు, ఎన్ని ఆశలు!
అమ్మానాన్నలు పడే కష్టాన్ని చూడలేక
ఆడపిల్లగా ఆదుకోవాలని
చదువుతల్లిగా పుస్తకాలలో కుస్తీపడుతూ
పాఠశాలే దేవాలయమనుకుంది
గురువే దైవంగా భావించింది
విజ్ఞాన బోధతో అంధకారాన్ని తొలగించి
జ్ఞాన వెలుగులు నింపే గురువు
పాపం ఆ పిల్లకేం తెలుసు
తన పాలిట కామంధుడై ఒళ్లంతా నిమిరి
తిమ్మిరి తగ్గించుకునే తుమ్మెదని
పాపం ఆ పిల్లకేం తెలుసు?
పిలిచినపుడల్లా వస్తుంటే
మంచి మార్కులేస్తానంటూ
బుగ్గల్ని ముద్దాడి ఒడిలో కూర్చోపెట్టుకుని
అంగాంగాలను తడుముతూ
ఎదపై మొగ్గల్ని తడిమి తృప్తిపడే
కామ వికారపు చేష్టలని
అభం శుభం తెలియని ఆ పిల్లకేం తెలుసు
పూవు వికసించకుండానే బలవంతంగా
రేకలు విప్పి మధువును గ్రోలే కామాంధుడు
వయసు రాకుండానే పైట వేయకుండానే
బాల్యాన్ని భారంగా మోస్తూ
సిగ్గు, అవమానం భరించలేక
పరువు కోసం గదిగోడల మధ్య కుమిలిపోతూ
తల్లి కాబోతున్న ఆ పిల్లకేం తెలుసు
గురువే తన పాలిట మృత్యువౌతాడని
పవిత్ర వృత్తిలో గురువు ముసుగు ధరించిన
మేధావులు ఉన్నంతకాలం
పాఠశాలల్లో చిన్నారుల్నే టార్గెట్ చేసుకొని
పవిత్ర దేవాలయాల్ని అపవిత్రం చేసే
గురువు.. ఓ గొంగళి పురుగు!!

- తాటికోల పద్మావతి,
గుంటూరు.
చరవాణి : 9441753376
**

పాతాళ ప్రశ్న?

ఎప్పుడు ఎలా ఉంటానో తెలియదిప్పుడు
కొంచెం నూకలు కావాలంటే పరిమితి పత్రం
కూసిన్ని రూకలు అవసరమైతే అరువు పత్రం
ప్రయాణాల్లో నిర్వాహకునికి ధృవీకరణ పత్రం
ఎక్కడ అవసరమైతే అక్కడ దర్శనమిస్తున్నా!
చరవాణి సంప్రదింపుల్లో సమాచార పత్రం
బ్యాంకు లావాదేవిల్లో ఆర్థిక వ్యయ పత్రం
రక్షక భటులకు వాహన చోదకుడి పత్రం
ఆసుపత్రి వర్గాలకు ఆరోగ్య బీమా పత్రం
ఎవరైనా తారసపడితే సందర్శన పత్రం
ఎలా కావాలంటే అలా కనబడుతున్నా!
ఎలా చూడాలనుకుంటే అలా ఉంటున్నా!
ఆదాయ శాఖ శాశ్వత ఖాతా సంఖ్యలో
విధి నిర్వహణ ఉద్యోగ ఉపాధి పత్రంలో
ఇక్కడ బతకడానికి పత్రమే కావాలట
ఇవేమీ లేకుంటే కనీసం ఆధార్ పత్రం
లేదంటే ఏ ఆధారం లేనివాడి నవుతానట!
ప్రతిసారి నాకు నేను కొత్తగా కనిపిస్తున్నా
ఒకసారి సన్నగా.. మరోసారి భారీగా
ఇంకోసారి పొట్టిగా.. తదుపరి పొడుగ్గా
చింపిరిగా.. చిన్మయంగా.. చిరాకుగా
నా చిత్రాలు ననే్న వెక్కిరిస్తున్నట్లుగా
నన్ను నేనే అసలు గుర్తుపట్టలేనంతగా..
ఎదురుగా నేనున్నా ఎవరూ గుర్తించటంలా!
నన్ను పత్రంలోనే చూస్తానంటోంది లోకం
అందుకే పత్రాల్లో ఉంటున్నా!!
ఇప్పుడు పొరపాటున ఎవరైనా నన్ను గుర్తిస్తే
పలకరించండి పొడిగానో.. పూర్తిగానో
నేను నేనుగా లేనిప్పుడు.. పత్రాల్లోకెక్కా
అక్కడే ప్రశ్నకు గుర్తింపుగా ఉంటున్నా!

- ఆచార్య మక్కెన శ్రీను,
విజయవాడ.
చరవాణి : 9885219712
**

మానవత్వం కావాలి

అడగందే అమ్మైనా పెట్టదు
అడగండి కోరండి
మొక్కండి పూలతో పూజించండి
రక్తతర్పణ చేయొద్దు రాక్షసత్వం చూపొద్దు!
గ్రామాధికారులు అధర్మాలు
అన్యాయాలు చేయొచ్చేమోకాని
గ్రామదేవత మూగజీవుల
ప్రాణాలు బలికోరుతుందా?
మందుతాగి చిందేయమంటుందా
మూగజీవులను బలిచేసి
ఊరబంతి పెట్టమంటుందా?
మనుషుల ఆరోగ్యం హరించమంటుందా?
వెర్రిమొర్రి కోరికలతో
దేవతలకు అపవిత్రత ఆపాదించవద్దు
దైవాన్ని పూజించు మానవత్వాన్ని పెంచు
రాక్షసత్వాన్ని తుంచు కామక్రోధాల్ని జయించు
కన్నతల్లి లోకమాత
రాక్షసికాదు రక్తతర్పణ కోరదు
సవ్యంగా పూజిస్తే ఆ చల్లని తల్లి కరుణిస్తుంది
సకల కోరికలూ తీరుస్తుంది
మనుషులు మారాలి విలువలు కాపాడాలి
ఓరిమి పరవాలి కరుణకురియాలి
లోకకల్యాణం జరగాలి

- వంగర యతీంద్రబాబు,
ఐలవరం, 7893353816
***

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net