విశాఖపట్నం

శాస్ర్తియ దృక్పథాన్ని తెలిపే ‘తాపీ ధర్మారావు జీవితం - రచనలు’ (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరతరాల నుండి సంప్రదాయం పేరుతో మనల్ని పీల్చి పిప్పి చేస్తున్న విభిన్న రంగాలలోని వ్ఢ్యౌన్ని, మూర్ఖత్వాన్ని ఎదిరించడానికి నడుం బిగించుకున్న వ్యక్తిగా ‘తాపీ ధర్మారావు జీవితం - రచనలు’ అను పుస్తకం ద్వారా తెలుస్తుంది. దీనిని విశాలాంధ్ర వారు ప్రచురించారు. సాహిత్య, సాంస్కృతిక విలువలు సమూలంగా మార్చాలన్న ఆలోచనతో దేవాలయాల మీద శిల్పాలను, ఇనుప కచ్చడాలను, పెళ్లి తంతును శాస్ర్తియ దృక్పథంలో పరిశీలించారు. ధర్మారావు కవిగా, పండితునిగా మనకు తెలుసు కానీ నిజానికి అతను అసలు సిసలు గణిత విద్యార్థి. మలబద్ధకం ఉన్న ఆయనకు చుట్ట కాలిస్తే పోతుందని మిత్రుని సలహాపై మొదలుపెట్టగా అది జీవితాంతం ఉండిపోయిందని ఏటుకూరి వారు వివరించారు. ఒకసారి పరీక్ష రాయడానికి వెళుతున్నప్పుడు నూనె కావిడి ఎదురయింది. అందరూ ఆయనను వెనుకకు వెళ్లమన్నారు. వారిని లెక్క చేయక వెళ్లి పరీక్ష రాయగా అందరి కంటే ఆయనకే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఆ సంఘటన తరువాత జీవితంలో ప్రతి అంశాన్ని శాస్ర్తియ, హేతువాద దృష్టితో చూడడం మొదలుపెట్టారని ఏటుకూరి వారి రచన ద్వారా తెలుస్తుంది. నిజానికి సంప్రదాయాలపై నమ్మకం ఉన్న ఆయన ప్రతి దానిని శాస్ర్తియ దృష్టితో చూడాలంటారు.
ధర్మారావు రాసిన ‘పెళ్లి - దాని పుట్టుపూర్వోత్తరాలు’ అన్న రచనలో ప్రాచీన కాలంలో మానవుడు ఆహార సంపాదన కోసం, మార్పిడి కోసం వేర్వేరు తండాలతో ఏర్పడిన పరిచయం క్రమేపీ పెళ్లిగా మారిందని చెబుతారు. ఇలా చేయడాన్ని పొలినేషియన్ భాషలో ‘పునాలువన్’ అంటారని, దీని అర్థం ‘వావి’గా వర్ణిస్తారు. ఇప్పటికిది ‘వాయ’గా మారి ‘ఏం వాయి అవుతుంది’ అని మన వాళ్లు అడిగేలా రూపాంతరం చెందింది.
‘ఇనుపకచ్చడాలు’ అన్న రచనలో ‘కచ్చడం’ అనే దానికి అర్థాన్ని చెబుతూ వెనుకకు దోపుకునే ధోవతి అని చెబుతారు. ఈ కచ్చడాల ప్రశస్థిని ‘మనుచరిత్ర’లో పెద్దన ‘ఇనుప కచ్చడాల్గట్టుకుని మచ్చువెల్ల’ అని చెప్పారు. వేమన ‘కచ్చ మీద నాస కనకంబుపై నాస లేనివాడు పుడమి లేనివాడు’ అన్న పద్యంలో కచ్చడాల ప్రస్తావన చేశారు. 13వ శతాబ్దంలో మత ప్రచారం కోసం యుద్ధాలకు వెళుతూ స్ర్తిలకు ఈ కచ్చడా వేసేవారని తెలుస్తుంది.
మరొక రచన ‘దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు?’ అనే దానిలో గుళ్లలో ఉపయోగించే గంటలు స్ర్తి, పురుష జననాంగ సంయోగమని, అవి కొట్టడం అంటే జనన కార్యం ఆగలేదనే భావం ఉండేదని అంటారు. ఈ గ్రంథంలో ధర్మారావు నాగరికతను అధ్యయనం చేస్తూ ఏ మెట్టులో ఎలా వర్తించిందీ తెలియజేయాలనుకున్నారు. మొత్తం మీద పాఠకుల్లో హేతువాద దృష్టిని పెంపొందించి మన ఆచారాలను గుడ్డిగా నమ్మకుండా అసలైన అర్థాలను తెలుసుకోవడమన్న భావాన్ని రచనల్లో అడుగడుగునా పొదిగారు.

- కుబిరెడ్డి చెల్లారావు, చోడవరం, విశాఖ జిల్లా. సెల్ : 9885090752.