విశాఖపట్నం

స్వచ్ఛ్ పరిసర్ (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీపురుపట్టుకుంటే ఊడిచినట్టుకాదు
ఫోటోకు ఫోజిస్తే శుభ్రం చేసినట్టు కాదు
ఒళ్ళువంచితే పని అవుతుంది
అసలు పనిచేస్తేనే సార్థకం అవుతుంది

ఫోటోకల్చర్ మానేద్దాం
చేసేదేదో చిత్తశుద్ధితో చేద్దాం
మొక్కుబడి తంతుమనకొద్దు
ప్రచార ఆర్భాటాలు అసలే వద్దు

నాయకులు వెళ్ళిపోగానే
వెంటనే జనం వెళ్ళిపోతారు
తంతు పూర్తి అవగానే
ఎక్కడని అక్కడ వదిలేస్తారు

కేవలం వార్తలకీ, ఫోటోలకీ
పరిమితమయ్యే పని మనకొద్దు
పూర్తి అంకిత భావంతో
చేసే పని అవ్వాలి మనకి ముద్దు

ఎ.టి.ఎం.వద్ద డస్ట్‌బిన్‌లోనే స్లిప్పులు పడేద్దాం
రోడ్డుమీద చెత్తకుండీలోనే చెత్తవేద్దాం
చెత్తవేసి, తర్వాత చెత్త ఎత్తడం మానేద్దాం
అసలు ఎక్కడా చెత్త వేయకుండా చేద్దాం

ఈ స్ఫూర్తి ప్రతివారిలో కలగాలి
ఈ మార్పు ప్రతి చోటా రావాలి
ఎపుడో ఒకప్పడు మార్పు అనివార్యం కావాలి
ఆ మంచి మార్పుతోనే సమాజ ప్రగతి కలగాలి

ఇది మనది -అన్న భావన ముఖ్యం
ఆ సద్భావనతో కలగాలి చైతన్యం
ఆ చైతన్యంతోనే వస్తుంది సమాజ వికాసం
సమాజ వికాసమే ప్రగతికి చిహ్నం

ఇది కేవలం ఒక నినాదం కాదు
వ్యర్థ ప్రయత్నంగా మిగిలిపోరాదు
చేసి-చూపి పట్టుదలతో సాధించాలి
స్వచ్ఛ సమాజం సుసాధ్యం చేయాలి

ప్రతి వ్యక్తి ధ్యేయం కావాలి స్వచ్ఛ్ పరిసరం
ఆ నాదం వ్యాపించాలి ప్రతీ పల్లె-పట్టణం
ఆకోవలో నడిస్తే అవుతుంది స్వచ్ఛ రాష్ట్రం
ఆ దిశలోనే సాధించాలి స్వచ్ఛ భారతం

సహి
(తురగా వేంకట నాగేశ్వరరావు),
విశాఖపట్నం.
సెల్ : 9703033953.
**

సందేశం

ఉత్తమ లక్షణాలతో గౌరవింపబడేవాడు
సభ్యత అనే గొప్ప పదాన్ని తెలుసుకోగలడు
సఖ్యత పాటించని వ్యక్తి స్నేహాన్ని, సహాయాన్ని పొందలేడు
అహంభావం నీలో పోవాలంటే సభ్యత అలవరచుకో!
సభ్యత విలువల వలువలు ఒలిచేవాడు
శత్రుత్వాన్ని కొనితెచ్చుకుంటాడు
మహనీయుల వద్ద తక్కువ వాడినని మీ పాదరేణువునని చెప్పుకో
నమస్కారం అనేది సభ్యతకు దర్పణం
దానిని భావితరాలకు అందించు!
- ఈవేమన, సెల్ : 7893451307.
**

గిల్లికజ్జా

అలుకమానవే అన్నులమిన్నా...
నినుచూసి నెలవంక సిగ్గిడి
మరుగాయె కరిమబ్బువెనుక
కలతల్ని తీర్చేటి వెంకన్న అండదండ
నీకుండదిగులెందు కోపసిడిమొలక
నేడేమి నినువీడె పసిడివనె్నల చిలక
పరిహాస మాడేన పరుషంగ పలికేన
అలకతీరిన చిలుక
పలుకరింపుతొనేడు
నవ్విన ఆ చిలుక చూడ చక్కని మొలక
నా చిలుక కంటతడి
కాదెన్నడు శుభం నాకు
ఆదరించి అలరించు
ప్రేమలతో ఎపుడూ
వెలిగించు నీయింట
వేయిదీపాలు
కురిపించు నీ మదిలో కోటివెనె్నలలు
ఓ చిలుక ఏమరకు ఈ గోరింకనెపుడూ
గోరింక మదిగూటి దీపమ్మువోలె
కొలువుండు నీవెపుడు
నిండు పున్నమివోలె

- మండా శ్రీ్ధర్, శ్రీకాకుళం
సెల్ : 9493309030