రాజమండ్రి

జానపద విజ్ఞాన సర్వస్వం.. ఆర్వీఎస్ సుందరం (కవి పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగువాళ్లకి ఓ ప్రత్యేక రాష్ట్రం కావాలని అశువులు బాసిన పొట్టి శ్రీరాములు పుట్టిన గడ్డపై పుట్టిన మరో తెలుగు సాహితీ దిగ్గజం ఆర్వీఎస్ సుందరం. తెలుగు నుడికారం మీద ప్రేమే కాదు ఆయనకు మమకారం కూడా. 1948 ఏప్రిల్‌లో నెల్లూరులో జన్మించిన ఆయన ఉన్నత పాఠశాల విద్య అక్కడే జరిగింది. ఆ తరువాత మద్రాసు విశ్వవిద్యాలయంలోను సాగింది. 69లో అధ్యాపక వృత్తిలో చేరి 73లో మైసూరు విశ్వవిద్యాలయంలో తెలుగు, కన్నడ జానపద గేయాల మీద పరిశోధన చేసి పిహెచ్‌డి సంపాదించారు. 1973 నుంచి అదే విశ్వవిద్యాలయంలోని కువెంపు కన్నడ అధ్యయన సంస్థలో అధ్యాపకులుగా పనిచేస్తూ ఆ అధ్యయన సంస్థకే నిర్దేశకులుగా నియమించబడ్డారు. తెలుగు కన్నడ భాషా బాంధవ్యానికి అపూర్వమైన సేవలందించిన ఆయన రెండు భాషల వారధిగా తెలుగు కన్నడిగులకు సుపరిచితులు. ఆయన తెలుగు ఎం.ఎ చదువుతున్నప్పుడే ‘ఆధునిక వేమన శతకం’ రాసారు. ఈ పుస్తకాన్ని చదివి పరిశోధక పరమేశ్వర నిడదవోలు వెంకటరావుగారు ‘రాళ్లపల్లి సుందరము రచనను చూచి/ నీకు బోలెనతడు లోకమందు/ ఘనత చెందుననుచు ననుకొన జెల్లును/ విశ్వదాభిరామ వినురవేమ’ అంటూ కొనియాడారు. వెంకటరావుగారు మన ఆరుద్రకు గురువు.
ఈయన గొప్ప పరిశోధకుడు. వ్యవహారిక భాషలో మొదటిసారిగా డాక్టరేట్ సంపాదించిన ఘనత సుందరానికే దక్కుతుంది. ఆ తరువాతే 74లో వెల్చేరు నారాయణరావు, కొనకలూరి ఇనాక్, కేతు విశ్వనాథరెడ్డిలు డాక్టరేటులు తీసుకున్నారు. ఆ తరువాత అందరూ వ్యవహారికంలోనే రాయడం మొదలుపెట్టారు. ఒకరకంగా ఆర్వీఎస్ మార్గదర్శకుడని చెప్పాలి. అలాగే జానపద విజ్ఞానంలో డి.లిట్ పొందిన అరుదైన వ్యక్తి కూడా ఈయనే. ఈ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వాళ్లు ప్రచురించారు. ఆ తరువాత తెలుగు విశ్వవిద్యాలయం వాళ్లు రెండుసార్లు ప్రచురించడం జరిగింది. జానపద విజ్ఞానాన్ని శాస్ర్తియ పద్ధతుల్లో పరిచయం చేస్తూ తెలుగు జానపద విజ్ఞానానికి అన్వయింపు చేస్తూ రాసిన అనుపమ గ్రంథం ఇది. 1990-93 కాలంలో రాజమండ్రి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద, గిరిజన విజ్ఞాన శాఖకు మొట్టమొదటి ఆచార్యులుగా, డీన్‌గా తనవంతు సేవను అందించారు. తెలుగు కన్నడ జానపద అధ్యయన క్షేత్రంలో విస్తృత అధ్యయనం చేసిన ఆయనకు ఇంగ్లీషు, సంస్కృతం, హిందీ, తమిళ భాషల్లో కూడా ప్రావీణ్యం ఉంది. అమెరికాలోని విస్కాన్ సిన్ విశ్వవిద్యాలయంలో 82లో జరిగిన జానపద విజ్ఞాన సదస్సుకు హాజరై తెలుగు కన్నడలలో ‘ఎల్లమ్మకథ’ పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. తెలుగు భాష ప్రాచీనత గురించి అనేక సదస్సుల్లో పాల్గొనడమేకాక పరిశోధనా వ్యాసాలు సమర్పించారు, ప్రచురించారు. డాక్టర్ సుందరం మార్గదర్శకత్వంలో 21 పిహెచ్‌డిలు, ఆరు ఎం.్ఫల్ డిగ్రీలు లభించాయి. ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి మాతృభాష కాని వారు రచించే పుస్తకాలకు ఇచ్చే అవార్డును మూడు సార్లు అందుకున్నారు. ఆయన ద్రావిడ విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక మండలి సభ్యులుగా, తెలుగు విశ్వవిద్యాలయం అకడమిక్ సెనెట్ మెంబర్‌గా, రాజమండ్రి నన్నయ ప్రాంగణం సాహిత్యపీఠ డీన్‌గా, మైసూరు విశ్వవిద్యాలయం అకడమిక్ కౌన్సిల్ మెంబరుగా, తెలుగు బోర్డ్ ఆఫ్ స్టడీస్ అధ్యక్షులుగా విద్యాత్మక సేవలందించారు. ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల్లో పలు విశ్వవిద్యాలయాల్లో బోర్డు ఆఫ్ సర్వీస్ మెంబరుగా సేవలందించారు. దేశీ ట్రస్టు (మైసూరు), ఫోక్ కల్చర్ ట్రస్ట్ (బెంగుళూరు)లకు అధ్యక్షులుగా కన్నడ, తెలుగు దేశి మరియు జానపద విజ్ఞానాల పట్ల ఆసక్తి వహిస్తూ అనేక సదస్సులు నిర్వహించారు. డబ్భైకి పైగా గ్రంథాలను తెలుగు, కన్నడ, ఇంగ్లీషు భాషలలో ప్రచురించారు. అధ్యయన, అనువాద, బోధన, పరిశోధనా క్షేత్రంలో పేరుగాంచి, విశిష్ట సేవల్ని అందించిన ఆయన ఏప్రిల్ 21న పదవీ విరమణ చేశారు. ఆయన సాహితీ సేవకు కృతజ్ఞతగా ఆయన మిత్రులు, సన్నిహితులు, సాహితీకారులు, సాహిత్య అభిమానులు అరవై వసంతాల పండగను రాజమహేంద్రవరంలో జరుపుకోవడం ఒక రకంగా గోదావరి వాసులకు ఆనందమయం అనే చెప్పాలి. ప్రస్తుతం తన విశ్రాంతి జీవితాన్ని మైసూరులో ప్రశాంత వాతావరణంలో సాహితీలతల మధ్య సేద తీరుతున్నారు.

- రవికాంత్, సెల్: 9642489244
**

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net