నెల్లూరు

సందేశాత్మకంగా సాగిన నవ్యచైతన్యం (స్పందన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధ్యతరగతి కుటుంబాల ఆలోచన విధానాలే కథాంశంగా తీసుకుని రచయిత రాయప్రోలు లక్ష్మీ రామకృష్ణ గారు రాసిన నవ్యచైతన్యం కథ బాగుంది. కథలోని పాత్రలు సులోచనమ్మ, నాగమ్మ, చంద్రం, గంగయ్య పాత్రలను ఎంతవరకు వాడుకోవాలో అంత పరిధి మేరకు వాడుకోవడం, రచయిత చెప్పదలచుకున్న విషయాన్ని చక్కగా చెప్పిన విధానం బాగుంది. నిజంగా ఈ స్థలాల గోల, ఇళ్లు కూల్చివేయడాలన్నీ మధ్యతరగతి ప్రజలు నిత్యం ఎక్కడో ఓ చోటు అనుభవిస్తున్న నిత్యకృత్యాలు. నిజంగా మధ్యతరగతి ప్రజల్లో చైతన్యం వస్తే అది నవ్యచైతన్యం కథగా మారుతుందని రచయిత వివరించారు. మంచి సందేశాత్మక కథను మెరుపు పాఠకులకు అందించిన రాయప్రోలు లక్ష్మీ రామకృష్ణ గారికి అభినందనలు.
- పువ్వాడ వెంకట సుబ్బారావు, ఆత్మకూరు
- నరిసి లక్ష్మీప్రియ, అద్దంకి
- మైత్రివనం వెంకటేశ్వర్లు, పలమనేరు
**
మనిషి ఎలా ఉండాలో తెలిపిన అఖండ మానవఘోష

గత వారం మెరుపులో రచయిత ఖాదర్ షరీఫ్ గారు గొప్పగా రాసిన కవిత అఖండ మానవఘోష. నిజంగా కవితను అర్ధం చేసుకోవడానికి కొంత సాహిత్యంపై పట్టు వుండాలి. ఎందుకంటే కవిత అంత లోతుగా వుంది. అసలు మనిషి ఎలా వుండాలి. ముందుగా ఎదురుపడితే చూసీచూడనట్టు పక్కకు తప్పుకుని ఈ రోజుల్లో అలాకాదు మనిషి ఎదురుపడితే ముందుగా మనమే పలకరించాలి.. అదే గొప్ప సంస్కృతి అనే భావనను కవితలో చొప్పించడంలో రచయిత ఆవేదనను అర్ధం చేసుకోవచ్చు. నిజంగా మనకు తెలిసిన వ్యక్తి ఎక్కడో ఓ చోట మనకు తారసపడితే అతన్ని పలకరించి ఆప్యాయంగా మాట్లాడగల్గినప్పుడే మానవ జన్మకు సార్థకత. ఆ ఆత్మీయ ప్రేమ ప్రతి ఒక్కరిలో రావాలి. అప్పుడే బంధాలు బలపడతాయి. గొప్ప కవితను అద్భుతంగా అందించిన ఖాదర్ షరీఫ్ గారికి ధన్యవాదములు.
- నాగేశ్వరరావు, బివి నగర్, నెల్లూరు
- సజ్జా పుష్పవతి, ఆర్‌సిరోడ్డు, తిరుపతి
- మనె్నం ఆదిరెడ్డి, లింగసముద్రం
**

రచనలకు
ఆహ్వానం
నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net