నెల్లూరు
దీపావళి (దీపావళి కవిత)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 30 October 2016
- మార్టూరి శ్రీరామ్‌ప్రసాద్ బుచ్చిరెడ్డిపాళెం చరవాణి : 94904 55599
నవ భారతాన్ని కలలుగనే
చిన్నారుల కళ్లల్లో
వెలుతురు నింపుదాం రండి..
పోయిన దీపావళికి అనుకున్నా
వారి గుండెళ్లో వెలుగు నింపాలని
జానెడు పొట్ట నింపుకోలేక
చీకటిలో మగ్గుతున్న జీవితాలకి
మతాబునై వెలుగునవ్వాలని కోరుకున్నా
శ్రమజీవుల నుదుట లక్ష్మీరాత లేదేమిటాని
లక్ష్మీబాంబు పేల్చి
మరీ సమాధానం కోసం ఎదురుచూసా..
నరకాసురుడుని వధించి
లోకానికి వెలుగునిచ్చిన అమ్మ స్ఫూర్తిగా
ఆకలితో రోగాలతో నిత్యం
యుద్ధం చేస్తున్న అనాథలకి
మిగిలిన అన్నాన్నైనా పంచి
కాస్త ఊరటిద్దాం అనుకున్నా
కానీ.. కాలేదు
అమ్మా..!
ఈ దీపావళికైనా
అనాథల జీవితాల్లో పొయ్యి వెలిగించమ్మా
అభాగ్యుల కళ్లలో దీపం పెట్టమ్మా
నిత్యం దీపావళి జరుపుకోమని
ఆశీర్వదించు.. తల్లీ.