విశాఖపట్నం

ఎన్నో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమి తల్లి కట్టుకున్నది
ఆకుపచ్చని చీరులు ఎన్నో
చీర మధ్యలో ఉన్నవి
రంగుల పువ్వులు ఎన్నో
పువ్వుల మధ్యలో ఉన్నవి
మకరంద గ్రంథులు ఎన్నో
గ్రంథుల మద్యన ఉన్నది
ఎంతో మధురమైన తేనె
ఆ నేనెను స్వీకరించడానికి
వస్తున్నవి తుమ్మెదలు ఎన్నో
చుట్టూ ఉన్న రంగు రంగుల
పూలతోటలు ఎన్నో
పూలతోటలో ఉన్నవి
రంగురంగుల సీతాకోకచిలుకలు ఎన్నో
ఎంత అందంగా ఉందీ ప్రకృతి
చూస్తుంటేనే మనసు పరవశిస్తోంది!

- నీలాతి గణేష్,
బాడంగి,
సెల్ : 7036328641.
**

ప్రాణదాత

ప్రకృతి ప్రసాదించిన వరం
సమస్త ప్రాణికోటికి జీవనాధారం నీరు!
భూగర్భ జలాన్ని మోటార్లు పెట్టి పీల్చేసి
నీటిబొట్టే కదా అని నిర్లక్ష్యం చేసి
వర్షపు నీటి భద్రతను విస్మరించి
అవసరాన్నిమించి ఉపయోగించు
ఓ మనిషీ
డబ్బు పొదుపు
నీ రేపటి జీవితానికి ఆధారమైతే
నీటి పొదుపు
నీ భావితరానికి ప్రాణదాత!

- సాలూరి సంతోషి,
విజయనగరం. ఫోన్: 801978342.
**

గర్భశోకం!

గర్భశోకం మాతృశోకం
పోయిన బంగారుబిడ్డలు
వత్తురా తిరిగొత్తురా?
ఉద్యమాల ఉగ్రరూపాలు
విద్యార్థుల ఆవేదనలు
నాయకుల కన్నీటి బాసలు
మేధావుల పల్కు తేనెలు
ముందుచూపు కొంచముంటే
ఇట్టి ఘోరాలు జరుగవేమో
ఆశల బంగారు వృక్షాలు
నేలకూలటం బాధాకరం!
యువ కిశోరాల ఆత్మహత్యలు
ఆవేశాల తీవ్రచర్యలు
జాతికి గొడ్డలిపెట్టులై
కన్నతల్లుల కడుపు కోతలే
జాతికివి తలవంపులైనా
తిరిగి ఎన్నడూ జరగకుండా
చూచుకొనుట ఎంతో మేలు
జాతికిది గుణపాఠమే!

- విద్వాన్ ఆండ్రకవిమూర్తి,
సెల్ : 9246666585.
**
నాటి తీపి బాల్యం!

ఎంత అందమైనది ఆ బాల్యం?
లేలేత చిగురులా, వికసిస్తున్న మొగ్గలా
నిదురలో ఉదయించిన కమ్మని కలలా
పండు వెనె్నలలోని పారిజాత పరిమళంలా!
బుడిబుడి నడకలతో చిట్టి పొట్టి ఊసులతో
చిలిపి చేష్టలతో, ఆప్యాయతా అనురాగాల మధ్య
వెనె్నల మబ్బుకు కట్టిన ఊయల ఊహల్లో
ఊగుతూ ఊగుతూ పెరిగిన బాల్యం
బడిగంట మ్రోగకముందే బారులు తీరి పరుగెట్టి
బలపాల నాగళ్లతో ధరణి పలకను దున్నుతూ
అక్షరాల విత్తులు నాటడం నేర్చుకున్న నాణ్యమైన బాల్యం
అక్క అన్నయ్యల చేతుల్లో ముద్దుగా పెరిగి
గిల్లికజ్జాలతో, కోతి కొమ్మచ్చి ఆటలతో
బొంగరాల ఆటల మధ్య సుడులు తిరుగుతూ
తీర్చిదిద్దబడిన తీపి బాల్యం!
వేసవి సెలవుల్లో కొండల్లో కోనల్లో
బాలభానుడితో పాటు పరుగులు తీస్తూ
సాయం సంధ్యకి సొమ్మసిల్లిన సిరి బాల్యం
పిచ్చుక కాలికి, తూనీగ తోకకు దారాలు కట్టి
గాలపటం ఎగరేసి కేరింతలు కొట్టిన కొంటెబాల్యం
అమ్మ చేతి అప్పచ్చుల కన్న,
గోడ దూకి దొంగలాడిన
జామకాయల కసురు రుచులకై
తహతహలాడి తన్నులు తిన్న తీపి బాల్యం
భోగి మంటల భోగుల కోసం
రాత్రంతా రోడ్ల వెంట తిరిగి దొంగలాడి
వెలిగించిన భోగి మంటల్లో చలికాగుతూ
చిందులు వేస్తూ పైకెగసిన గడుసు బాల్యం,
అణువణువు పులకరిస్తుంది ఎందుకు
బంగారు బాల్యం తీపి గుర్తులకు
ఏది నా చిన్నారులకు ఆ మధురానుభూతి?
నేడు ఎక్కడా కానరాదేమి
ఆ బాల్యం సందడి నేటి బాలల కళ్లల్లో?

- శ్రీమతి సిహెచ్.వి. లక్ష్మి
సెల్ నెం : 9493435649.