నెల్లూరు

తెలుగులో కొత్త ప్రయోగం.. జీవరహస్య లిపి (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు : పెరుగు రామకృష్ణ,
డో.నెం.25-1-949, 5వ వీధి, నేతాజినగర్, నెల్లూరు-4 చరవాణి : 9849230443
**
నెల్లూరు జిల్లాలో కవితావేశం కలిగి కవితాలు రాసేవారెందరో ఉన్నారు. అయితే అందులో కొన్ని కవితలైనా పాఠకులకు చేరువచేయగలిగినవారు కొందరే. ఆరేడు కవితలు పత్రికల్లో కన్పించగానే సంతోషించి ఆగిపోయేవారు ఎక్కువ. దురదృష్టమో అవగాహన లేకనో ఎంతోమంది తమ రచనలు అముద్రితంగానే ఉంచేసుకుంటున్నారు. అటువంటి వారిని ప్రోత్సహించి వారి వెన్నుతట్టి వారి రచనలు పుస్తక రూపంలో అందించడానికి ప్రముఖ కవి పెరుగు రామకృష్ణ యజ్ఞంలా కృషి చేస్తున్నారు. ఇందుకు సన్నిధి పబ్లికేషన్స్ సహకారంతో కూడా తోడవుతోంది. ఈక్రమంలో వెలువడిన మొదటి పుస్తకం జీవరహస్య లిపి. ఈ పుస్తకంలో నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంతమైన సోమశిల ప్రాంతంలో ప్రభుత్వ నీటిపారుదల శాఖలో చిరుద్యోగి ఖాదర్ షరీఫ్ బాల్యంనుంచే కవిత్వం పట్ల మక్కువ ఆ దిశగా కృషి చేసి మంచి రచయిత అనిపించుకున్నాడు. పెరుగు రామకృష్ణ నేతృత్వంలో 1998లో శే్వతసంతకాలు పుస్తకంలో తొలి రచనతో రచయితగా వెలుగులోకి వచ్చాడు. అప్పటినుంచి విశేష కృషితో తెలుగు, ఉర్దూ, హిందీ కవితల్ని అధ్యయనం చేస్తూ కొన్ని కథలు కూడా రాసి తనకంటూ ఒక ఒరవడి సృష్టించుకున్నారు. ఖాదర్ షరీఫ్ రాసిన కవితల్లో శ్రేష్టమైన వాటిని కొన్ని ఎంచి కవి పెరుగు రామకృష్ణ తన సంపాదకత్వంలో పుస్తకరూపంలో అందించారు. సాధారణంగా కవితా సంకలనాలు వారి పేరుతో అచ్చవుతుంటాయి. ఆంగ్లభాషలో ఈ విధానం ఆచరణలో ఉన్నా తెలుగులో ఇప్పటివరకు ఒకరి సంపాదకత్వంలో వెలువడిన తొలి పుస్తకం ఇదే అని చెప్పవచ్చు. కవిత్వం అంటే నాలుగు పదాలు ఒకదానిపక్కన పేర్చి ఇదే కవిత్వం అనేవారు సమాజంలో చాలామంది ఉన్నారు. కాని ప్రతీ పదానికి లోతైన అర్థంతో భావస్ఫోరకంగా గంభీరంగా కవిత్వం రచించేవారు కొంతమందే ఉంటారు. అటువంటి వారిలో షేక్‌ఖాదర్ ఒకరు.
నీ గుమ్మానికి నీ స్పర్శని వేలాడగట్టి
కాగితం అంచున
కన్నీటిలో ముంచిన బొటన వేలితో
సాక్ష్యం గుర్తుని అద్దగల నీవు
చేతుల్లోనే పగిలిపోయిన బ్రతుకు బుడగని
పునర్నిర్మించగలవేమో.. కానీ
నదులు సముద్రంలో కలిసే చోటుకి వచ్చి
ప్రమాణం చెయ్యమంటే ఎలా
నీకూ నాకూ పొత్తు కుదరనప్పుడు
ఖడ్గచాలనమే... దమ్ముంటే...రా
గెలుపు నీ నిజానిదో నాదో తేల్చుకుందాం.
***
ప్రేమలేఖ రాసి ఆ అమ్మాయికి ఇచ్చినప్పుడు
చెంప చెళ్లుమనిపించాడు
అదే ప్రేమలేఖ పత్రికలో వచ్చినప్పుడు
కరచాలనం చేశాడు...మానాన్న
***
ఇటువంటి భావుకతతో నిండి ఉండే కవితలెన్నో ఈ పుస్తకంలో పాఠకుడిని కట్టి పడేస్తాయనడంలో అతిశయోక్తి లేదు.

- గౌతమి, చరవాణి 9347109377