నెల్లూరు

రా! కదలిరా! (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రా! కదలిరా!
నల్లమబ్బుల కురులు విదుల్చుకొని
కావ్యకన్యకలా
జలజల గలగల రాలుతూ
నింగిని విడిచి నేలపైకి దిగిరా!
మోడువారిన బ్రతుకులెన్నో
మొండి ధైర్యముతో నింగి వంక చూస్తూ
వేడి నిట్టూర్పుల వడగాల్పుల కోర్కెలతో
పాడి పంటలు కరువు కాగా
నీకై ఎందరెందరో ఎదురు చూచుచుండగా
కదలిరా! కలుసుకొనిరా!
చినుకువై కోర్కెల మిణుకువై
జగతి అంతయు దీనస్థితిలోనుండగ
అలసిసొలసిన మానసంబులకు
ఉక్కపోతలను తుక్కుతుక్కు చేయగ
జనచైతన్య స్ఫూర్తిదాయివై
రా! కదలిరా!
మేఘాలచాటున దోబూచులాడక
శిఖరాల మాటున దొంగాట లాడక
రాలిపోతున్న హరిత(్ధ)దనమునకు
కాలిపోతున్న ధరణి సెగల పొగలను
అంతమొందించుటకు కనికరించి
కదలిరా! కలహంసలా దిగిరా!
అనావృష్టి అవకతవకలను
ఎండమావుల మాయలాటలను
పారదోలుతూ వాగువంకలు,
కొండకోనలు, మూరువాడలు
తడుపుకొంటూ బీడుభూముల ఆర్తిదీరుస్తూ
కోడుపట్టిన అరకలా
జాలువారు రసగంగలా
జలజల గలగల రాలుతూ
రససిద్ధిలో మునులందరిని ముంచివేస్తూ
హర్షపులకితవై కదలిరా!
బిందు బిందువై తేలియ సింధువై
బిందులెత్తంగ చిన్మయానంద భరితవై
చెరువు దొరువు, కాల్వలు, నదులందు
అమృతధారలు కురియు ఆనందవృష్టిగ
కురిసి కురిసి పుడమి తల్లికి సేదతీర్చంగ
భూమి ఎల్లడల సస్యశ్యామలు కాగ
తల్లివై కల్పవల్లివై
అనురాగ చెల్లివై అనుబంధ మల్లివై
బుడిబుడి నడకల పాపడివై
జవసత్త్వములను జనులలోన నింపుటకై
భూతాపము తీర్చుటకై వేవేగముగ
రా! కదలిరా!
గడ్డి గాదమన్నదే లేక పసులు బక్కచిక్కగా
గుక్కెడు నీటికై మైళ్లమైళ్ల వెదుకులాడే
జనాల బాధను చూసి
ఊరు ఊరులు వలసపోతుంటే
పల్లెపల్లెలు భోరుమంటుండగ
కరుణతోడను కనికరించి కదలిరావే
వర్షరూపాన వరపున దిగిరావె..!
- లక్కరాజు శ్రీనివాసరావు
ఆర్టీసీ కాలనీ, అద్దంకి
చరవాణి : 98491 66951

***

జీవన రుతువు

అస్తవ్యస్త జీవితం
వాడిపోతున్న రుతురాగాలు
ఆత్మీయ కలబోతల ఆక్సిజన్‌ను
స్ప్రే చేసినట్లు
మళ్లీ చిగురించాలనే ఆకాంక్ష!
పెదాల అంచున నటనమాడే
పైపై పదాలను
దూదిపింజల్లా వూదేయాలి
సమాజానికి వెలుగునిచ్చే
కొవ్వొత్తిలా మిగిలిపోవాలి
మానవత్వం మృగ్యమైన గుండెల్లో
మమతల పరిమళాలు వెదజల్లాలి
రక్తం రంగు ఒకటే అయినప్పుడు
తరతమ బేధాల్లేని సమత మమత కొలనులో స్నానం చేయాలి
అహాన్ని ఆమడదూరం పారదోలి
శాంతి పావురాన్ని ఎగరేయాలి
అందరి కోసం అందరమని
నిస్వార్థపు పెన్నిధిలా నిలవాలి
ప్రతి గుండెలో పలకరింపుల
పరిమళాలు
ఆస్వాదించాలి
ఎన్నో ఎనె్నన్నో
పునరావృతవౌతున్నాయి
నేను మళ్లీ మొలకెళ్తాలి
కొంగ్రొత్తగా జీవన ప్రస్థానం సాగాలి
చిరునవ్వుల వెలుగునై
మరుమల్లెల పరిమళాన్నై
సమాజంలో వెల్లివిరియాలి
మళ్లీ చిగురించాలని..

- గుర్రాల రమణయ్య, నెల్లూరు,
చరవాణి : 9963921943

**

ఓటమి

ఓడిపోయామనే వేదనెందుకు?
ఓడింది ఎందులో!
ఆటలోనా? పాటలోనా!
బ్రతుకు బాటలోనా!
ఆటలో ఓడితే ఏమవుతుంది?
పాటలో ఓడితో ఏం పోతుంది?
బ్రతుకు పోరులో, చివరి ఆటలో
ఓటమి కలిగేది అందరికీ!
చావుపై గెలుపున్నది ఎవ్వరికి?
అసలు ఓటమి ముందుండగా
చిన్నచిన్న ఓటములకు చింత ఏల?
ఓడినవారి ముందు గెలుపంటూ వుంటుంది
గెలిచిన వారి ముందు ఇంకేముంటుంది
ఏనుగెక్కినా, ఎవరెస్టు ఎక్కినా
దిగి రావలసిందే ఎవ్వరయ్యినా! ఎప్పటికయ్యినా..!
చింతచెట్టు పెద్దది, చింతాకు చిన్నది
అరటిచెట్టు చిన్నది, అరటాకు పెద్దది
చిన్న, పెద్ద కాదురా కావలసింది
చిరుగాలికే అరిటాకు చిరిగిపోతుంది
పెనుగాలికైనా చింతాకు చెదరకుంటది
తరచి చూడగా..! సత్యమిదేగా..!
వేదాంతమింతకన్న వేరు కాదురా!

- బాలు, చరవాణి : 9866140700

**

ఆ కళ్లు నిండుగా నవ్వాలి

అదో చిన్న కంపార్ట్‌మెంట్
కులమతాల భేదాల్లేవు
తారతమ్యాలకు తావులేదు
ఎవడి గోల వాడిది
ప్రక్కవాడి ఆలోచన ఉండదు
ఈ ప్రయాణంలో గమ్యం చేరగలనా..
చివరి మజిలీ చేరినా
ఏ ఫలితాన్ని ఎదుర్కొనాలో..
అంతం కాని ఆలోచనా పరంపరలు
ఆ కళ్లు నిండుగా నవ్వాలి
ఆ కళ్లు వెనె్నల వర్షాన్ని కురవాలి
ఆ అధరాలు చిరునవ్వుల స్వాగత గీతమాలపించాలి
ఆ మనసు నిండుగా శ్వాసించాలి
అలా జరగాలనే ఆకాంక్ష
చివరి క్షణాల్లో
మూగవేదనా రోదనని వౌనంగా
కళ్లతో మాట్లాడాలనే ఆతని
కోరిక నెరవేరుతుందా?
ఆలోచనలకంతరాయం కలిగిస్తూ
ఓ చిన్న రగడ
అంతలోనే సర్దుబాటు
అతనికేమీ కాకూడదు
ఆ త్యాగశీలి మరలా కోలుకోవాలి
చిరునవ్వుల మల్లెలు విచ్చుకోవాలి
అతనికి నేనున్నాననే ఆశ చిగురింపజేయాలి
గమ్యం చేరువయ్యే కొలది
గుండెల్లో గుబులు
క్షణాలు దొర్లే కొలది ఉత్కంఠ..!

- గుర్రాల రమణయ్య, నెల్లూరు, చరవాణి : 9963921943