నెల్లూరు

సైకత విలాపం ( మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందుకు నువ్వు ఒకేలా ఉండవు. నిన్ను చూస్తే ఎంత సంబరపడతానో తెలుసా
నువ్వు పరుగెత్తుకుంటూ నా దరికి వస్తున్నట్లే ఉంటుంది
పాలనురగలాంటి నీ నవ్వుతో ప్రేమగా
నన్నాలింగనం చేసుకున్నట్లే ఉంటుంది
ఆ కౌగిలిలో సేదతీరేంతలోనే క్షణాల్లో
జారిపోతావు
నేను నీ కోసం ఎదురుచూస్తుంటే నువ్వంబరాన్ని చూస్తుంటావు
ఎన్నో వందల ప్రాణికోటిని పోషించే నువ్వు నిన్ను పట్టించుకోని దానికోసం ఎదురుచూడడం నేను సహించలేను
నాతో ఆడినంతసేపు ఆడి మళ్లీ నింగికేసే చూస్తావు. నీకు న్యాయమేనా?
ఎప్పుడూ నీలోనే, నీతోనే, నీ అణువణువూ కలిసి ఉన్న నన్ను పట్టించుకోకపోవడం ధర్మంకాదు.
నిన్ను అది తన ఏడురంగులతో ఆకర్షించే
ఉండవచ్చు కానీ,
నీ కష్టసుఖాలను పంచుకునేది నేను.
నీ ఆటుపోట్లను భరించేది కూడా నేనే.
ఉప్పెనొచ్చినప్పుడు నా కరకట్టను కొసేస్తావు
నేను లేకుండా నువ్వు పరిపూర్ణం కాదు
నిన్ను చూసేందుకు వచ్చే జన సందోహం
నా పరిసరాలనూ, నన్ను ఎంతగా గాయపరుస్తారో,
కొన్ని జలచరాలు సైతమూ నాలోనే తన సంతతిని పెంచుకుంటాయి
చివరికి నా గుండెల్లో కూడా గునపాలు దించి సౌధాలు నిర్మిస్తున్నారు
ఇవన్నీ నాకు హృదయవేదనలే కదా
ఇలా నా దేహాన్ని ఎంత ఛిద్రం చేస్తున్నా పంటి బిగువున బాధను భరిస్తుంటే నీకు మాత్రం నేనంటే ఎప్పుడూ అలుసే.
నేను లేకపోతే అసలు నీకు ఉనికేది
చిన్నారుల గుజ్జనగూళ్లు ఆటలు,
యువత కేరింతలూ అన్నీ నాలోనే
నీ కోసం నేను ఇన్ని వెతలకోర్చుకుంటే
నీకేమో ఇంకా ఆకాశం మీదే చూపు
అయినా నా పిచ్చిగానీ, నన్నొదిలి నువ్వెక్కడికెళతావు
ఎగిరెగిరి అలసిపోయి మళ్లీ నాలోనే సేదదీరుతావు
ఒక్కక్షణం ఘీంకరిస్తావు, మరునిమిషం
గంభీరమవుతావు
నువ్వొకటి గమనించావా? దానికోసం నువ్వు ఎంత బలంగా ఎగురుతావో,
అంతే వేగంగా వచ్చి నన్ను హత్తుకుంటావు
ఇది నాకు తెలిసినా
ఇసుకను కదా ఎద తియ్యగా సలుపుతూనే ఉంటుంది
*
- సుమలత
9494799248
**

దేశాభివృద్ధికి నేను సైతం
*
విద్య నేర్పు ఉద్యానవనంలో
వనమాలినవ్వాలనుంది
మొగ్గమొగ్గకూ మకరందం నింపి
విచ్చుకున్నాక పంచమని చెప్పాలనుంది
పసికూనలున్న గూటిలో లాలించే జోలగా
పాఠాన్ని పాటగా పాడాలనుంది
లోకాన్ని చూచుటకు రెక్కల్లో
బలమైన విజ్ఞానపు ఈకలు నింపాలనుంది
లేగలున్న మందకి
గోపాలకుడనై కాయాలనుంది
కొయ్యకొయ్యకూ ఓ రూపానిచ్చి
ఉత్తమ పౌరులుగా పెంచాలనుంది.
మట్టిముద్దలాంటి పిల్లల్ని
ప్రమిదలుగా తీర్చి
చీకటి సామ్రాజ్యానికి చోటేలేని
కాంతుల భారతాన్ని నిర్మించాలనుంది
దేశం బృందావనం కావాలంటే
ప్రతి ఇల్లూ పూదోట కావాలి
ప్రతి మనిషిలో కార్యదీక్షుండాలి.
చెమట పూచిన పరిమళం గుభాళించినప్పుడు
శ్రమకు కాచిన ప్రతిఫలం గుర్తించబడుతుంది
రాష్ట్రాలు, భాషలు గట్లై విడదీసినా
వ్యవసాయ క్షేత్ర భారతం ఒక్కటేకదా!
భారతీయరాశి జనావళి ఒక్కటే కదా!
చినుకు చినుకు కలిసి సాగరమైనట్లు
చేయిచేయి కలిపి నడుంబిగిస్తే
స్వచ్ఛ్భారతై దేశం నిర్మలవౌతుంది
స్వార్థం పండే కలుపు పీకేస్తే
దేశం సస్యశ్యామలవౌతుంది
ప్రతి మనిషీ కార్యకర్తయితే
దేశం చైతన్య ప్రభంజనవౌతుంది
దేశాభివృద్ధికి
నేను సైతం బాధ్యుడౌతాను
దేశప్రగతికి
నేను సైతం పాటుపడతాను
పిల్లతెమ్మరై
జాతీయ జెండాను
రెపరెపలాడిస్తాను
జైహింద్
*
- ముసులూరు నారాయణ, రోసనూరు. చరవాణి : 9492934826