విశాఖపట్నం

కొంచెం టచ్‌లో ఉంటే... (మినీకథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘్భద్రుడూ ఇది విన్నావటోయ్’’ హడావుడిగా లోపలికి వచ్చి అడుగుతున్న సత్యాన్ని చూసి ‘‘అబ్బే నువ్వు చెప్పందే ఏం వింటా’’ అంటూ ఎదురుప్రశ్న వేశాడు భద్రం.
‘‘అవున్నిజమే కదా! నే చెప్పందే నీకసలేం తెలవదు. సంగతేంటంటే ఈరోజు నాగన్న జన్మదినం. నువ్వు కాస్త శుభాక్షాంక్షలు చెప్పావనుకో. ఒకరికొకరు ఎంతో ఆనందిస్తారు’’ అన్నాడు సత్యం.
‘‘సరే గానీ సత్యం, నీ శుభాక్షాంక్షలతో ఇద్దరికి ఆనందమేమిటి?’’ ఆశ్చర్య వ్యక్తం చేశాడు భద్రం.
ఈ సంభాషణ జరగడానికి కొన్ని రోజుల ముందు భద్రం కుమార్తె ఊర్లో మంచి పేరున్న నాగన్న గారబ్బాయికి నచ్చడం, వాళ్లు వీళ్లు మాట్లాడుకోవడం వరకు జరిగింది. అయితే నిశ్చితార్ధం చేసుకోవడానికి కొంత వ్యవధి ఉందని పూర్తి వ్యవహారాలు మాట్లాడుకోలేదు.
‘‘అపుడే మరిచిపోతే ఎలా భద్రుడూ! కీలెరిగి వాత పెట్టడం తెలిసిందేగా. వాళ్లూ మనం కావలసిన వాళ్లం. కాబోయే వియ్యంకులు మీరిద్దరూ. వీళ్లతో మనమెంత టచ్‌లో ఉంటే అంత మంచిది. నువ్వు అభినందనలూ, కానుకలు అందించినంత మాత్రాన మనకి పోయిందేమీ లేదు. ఏతావాతా మీ సంస్కారానికి మురిసి కట్నకానుకల్లో రాయితీ లభించనూవచ్చు’’ అంటున్న సత్యం కేసి అరచేయి చూపిస్తూ ‘‘నువ్వు చెప్పడం అయిపోయిందా! ఇంకా ఏమన్నా ఉందా’’ అంటూ ప్రశ్నించాడు భద్రం.
సత్యం నోట మాట రాక మిన్నకుండిపోయాడు.
‘‘అందుకే నిన్నక్కడితో ఆగమన్నది. హడావుడి వద్దన్నది. ఈ రోజు ఈ చిన్న విషయానికి ఆర్భాటం చేస్తే రేపు ప్రతి చిన్న విషయానికి మనమెంతో చేయాల్సి వస్తుంది. అనుకున్న దాని కన్నా తడిసి మోపెడవుతుంది. ఇక ఆ టచ్ అన్న మాట ఎంత అంత ఇచ్ పెరుగుతుంది. తగినంతలో ఉంటేనే ఉభయులకూ శ్రేయస్కరం ఏమంటావు?’’ అన్నట్టు చూసేసరికి ‘‘ప్చ్ దానిదేముంది ఎపుడూ భవదాసుడికి తొందరపాటే’’ అనుకుంటూ సత్యం తను వచ్చిన పనైందనుకుంటూ అక్కడి నుండి మాయమయ్యాడు.

- డాక్టర్ యిమ్మిడిశెట్టి చక్రపాణి, నెహ్రూచౌక్, అనకాపల్లి-531001. సెల్ : 9849331554.