విశాఖపట్నం

ఏం చేయాలి? (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందకాలు పూడ్చేయాలంటే
కండను కదిలించాలి
గుండెలో భయం ముల్లై గుచ్చితే
కొండను ధ్యానించాలి!
చెలియ కోపమును చల్లార్చాలని
తలచేటి గాలిబా!
చెలిమి కోసమై రాయబారి
పూదండను పంపించాలి!
పూజలందుకొను వారసత్వాన్ని
సులభంగా పొందలేవులే
శిల్పం కోసం కాలం చెరుపని
బండను శోధించాలి!
చీకటి తెరలను చీల్చేయాలని
కలలు కంటున్న ఓ దానా
సౌరఘటాలను శిరసుకెత్తుకొని
ఎండను సేవించాలి
పుట్టిన వాడు గిట్టక మానడు
లోకంలో ఇది సత్యంలే
దేహమెట్టిదో తెలిపేటందుకు
మట్టికుండను చూపించాలి!
- కిలపర్తి దాలినాయుడు
సాలూరు
సెల్: 9491763261.

నీవు నేను

గగనానివి నీవైతే కరిమబ్బును నేను
తొలకరి జల్లు నీవైతే పుడమితల్లిని నేను
అనురాగపు అంబుధి నీవైతే
ఎగసి పడే తరంగాన్ని నేను
మెల్లగ వీచే పిల్ల తెమ్మెర నీవైతే
గిలిగింతలు పెట్టే కవ్వింతను నేను
నిండు జాబిలి నీవైతే పండు వెనె్నల నేను
గండు కోకిల నీవైతే
గాంధర్వ గానం నేను
విరితావువు నీవైతే
సిరిమల్లెను నేను
నా ఆశవు నీవైతే నీ శ్వాసను నేను
- శివానీ, శృంగవరపుకోట.
ఫోన్ : 08966266384.

తల్లిపాలు

పాలిచ్చి పెంచవే బంగరుతల్లి
మురిపాలిచ్చి సాకవే అనురాగవల్లి
అమ్మంటే సృష్టిలో తీయనైనది
అమ్మపాలు అమృతాన్ని మరిపిస్తాయి
అపురూపమైనది అమ్మ ఒక్కటే
అమ్మంటే అంతులేని సంపద కదరా
అమ్మ ఇలలో దైవం
అమ్మ జగతికి మూలం
అమ్మ నిత్యం సత్యం
అమ్మ మమతల నిలయం
అమ్మ పాలు వరంలే చిన్నారులకు
అమ్మపాలు అమృతాన్ని చవిచూపునురా
అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే
సాటి రారు వేరెవ్వరూ అమ్మ ప్రేమకు!

- రాయవరపు సరస్వతి. చోడవరం పోస్టు.
సెల్ : 9885656356.

ఏ దేవుడు క్షమిస్తాడు!

నాకు తల్లి ఒక కన్ను
తండ్రి మరో కన్ను
తల్లి జన్మనిస్తే
తండ్రి నడక నేర్పాడు
తల్లి నా మనోనేత్రం
తండ్రి నా జ్ఞాననేత్రం
కన్నతల్లి రుణం, కాపాడే తండ్రి రుణం
ఎన్ని జన్మలెత్తినా తీరనిది తీర్చలేనిది
కాలం మారింది మారింది అంటుంటే
ఫకాలున నవ్వాలనిపిస్తుంది
మనుషులు మారి కాలాన్ని నిందిస్తే ఎలా?
నాటి పుత్రులు కన్నవారి కోసం పాటు పడితే
నేటి పుత్రికలు తమ భర్తలకై శ్రమిస్తూ
క్షణం ఓ కరెన్సీగా మారుస్తుంటే
కన్నవారిని విడచి ఎక్కడికో మరెక్కడికో
స్వసుఖానికై డాలర్ల వేటకై వెళ్లి
అలక్ష్యం చేస్తుంటే వీరిని
ఏ దేవుడు క్షమిస్తాడు!

- జి. ఎస్. కె. సాయిబాబా, అనకాపల్లి.
సెల్ : 9248173116.

అతను - సెల్‌ఫోను!

అతను సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ
ఆట్లాడుతూ ఎవరితోనో పోట్లాడుతూ
మతిపరుపనే మాయలో చిక్కుకున్నాడు..!
క్లియరెన్స్ సేల్‌లో
అతనొక వస్తువయ్యాక
బిగ్‌బజార్‌లో బిల్‌గా నలిగిపోయాడు!
కంచుగంటలా....మార్మోగుతున్న... మాట
కట్‌షార్ట్ కూర్పుల శబ్దపధి అయింది!
వద్దనుకున్నా వినపడే దోమరాజయింది!
చివరకు మాటలోని మనిషి బంధం
తెగిన గాలిపటమయింది
ఇపుడు-
సెల్‌ఫోన్‌తో అతను లేడు!
సెల్‌ఫోనే... అతనితో వుంది!!
వుంటూ... ఆడిస్తోంది... ఆట్లాడుకుంటోంది!
బి.గోవర్థనరావు,
సెల్: 9441968930