ఉత్తర తెలంగాణ

బౌద్ధాన్ని కళ్లకు కట్టే ‘మంచి ప్రశ్న... మంచి జవాబు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వంలో ప్రధాన పాత్ర పోషించేది శైలి. రచనా సంవిధానాన్ని బట్టి ఆ కవి ప్రతిభను ఊహించవచ్చు. రచయిత తన శైలికి ఎలాంటి ప్రాధాన్యమిస్తాడో తన రచనలో దిశా నిర్దేశం చేసిన నల్లి ధర్మారావు తన దృక్పథాన్ని ‘మంచి ప్రశ్న... మంచి జవాబు’ అనే అనువాద రచన ద్వారా తెలియజేశారు. ధర్మారావు అనువాదకుడు, కవి, రచయిత, విశే్లషకుడు. రచన చిన్నదైనా ఉన్నంతలో సిద్ధార్థుడు బుద్ధుడిగా మారే వరకు పొందిన క్రమ పరిణామ వికాసాన్ని చర్చించారు. జీసస్ నుండి బుద్ధుని వరకు తెలిపారు. సంక్షిప్తంగా గౌతమ బుద్ధుడిగా ఎలా మారాడో తెలియజేశారు. బౌద్ధ్భిక్షువుగా మారిన ‘శ్రావస్తి ధమ్మిక’ రచించిన ‘గుడ్ క్వశ్చన్... గుడ్ ఆన్సర్’ అనే పుస్తకాన్ని బండారు ఉత్తమ బుద్ధిస్టు సొసైటీ, ఇంగ్లండ్‌లో ప్రచురణ జరిగి సంచలనం సృష్టించింది. దీనిని 12 భాషల్లో అనువాదాలు చేశారు. ఒక బౌద్ధ ప్రార్థనా మందిరం (స్థలం)లో ఉచితంగా పంపిణీ చేయగా దాన్ని తెలుగులో అనువాదం చేయాలనే ఉద్దేశ్యంతో బౌద్ధ మతాన్ని గౌరవించే రచయితగా నల్లి ధర్మారావు ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. విదేశాలకు చెందిన క్రైస్తవమతం, కమ్యూనిజాలను కూడా బౌద్ధం ప్రభావితం చేయడం విశేషమని రచయిత నల్లి ధర్మారావు అంటారు. ఈ రచన శంకరంబాడి సుందరాచారి రచించిన ‘బుద్ధగీతి’ అనే ఖండకావ్యాన్ని గుర్తుకు తెస్తుంది. ఈ గ్రంథంలో నల్లి ధర్మారావు బౌద్ధం ఎలా విస్తరించింది అనే విషయాన్ని కాకుండా అత్యున్నత తత్వశాస్త్రంగా తెలిపారు. ఆయన బోధనలు ఎన్నో లక్షల మంది జీవితాల్లో పరివర్తన తెచ్చి మార్చగలిగిందని తెలిపారు. మతపరమైన అసహనం, గర్వం, స్వార్ధం అనే అంశాలపై కచ్చితంగా అధ్యయనం చేయాలని, బౌద్ధంలోని నాలుగు ప్రధాన సూత్రాలు, నాలుగు సత్యాల ద్వారా కచ్చితమైన శాస్ర్తియ విధానాన్ని రచయిత నల్లి ధర్మారావు తెలిపారు. ఈ గ్రంథంలో వర్ణనలు, సన్నివేశాలు సందర్భోచితంగా కనిపిస్తాయి. సిద్ధార్థుడి తపస్సు వర్ణన, అతని బోధనలు, నుడికారాలు, భావుకత, సరళశైలి అలంకారాలు ఈ చిన్న కావ్యాన్ని అద్భుత గ్రంథంగా మలిచాయి. ఈ కావ్యం తేటగీతి పద్యాలతో రూపుదిద్దుకుని బుద్ధుడి జననం నుండి జ్ఞానోదయం వరకు ఉన్న అన్ని అంశాలతో అలరిస్తుంది. అలాగే ఏ తరహాలో బుద్ధుని ఆరాధనం చేయాలో, ఎక్కడెక్కడ బౌద్ధమతస్తులు ఎక్కువగా ఉన్నారో ఈ గ్రంథంలో మనకు తెలుస్తుంది. అలాగే ప్రతి మనిషిలో తలెత్తే అనేక ప్రశ్నలకు సమాధానంగా కూడా ఈ పుస్తకం మనకు కనిపిస్తుంది. పునర్జన్మలో లక్ష్యాలను కూడా సాధించవచ్చునని అభివర్ణించడం జరిగింది. బుద్ధుడి బోధనల్లో ఇదొక అద్భుతమైనదని తెలిపారు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిగా భావించిన గాంధీ మహాత్ముడికీ బుద్ధుడే ఆదర్శప్రాయుడయ్యాడు. గౌతమబుద్ధుడు ప్రజలకు హితబోధ చేస్తూ ప్రేమతత్వాన్ని విశ్వవ్యాప్తం చేయాలని తెలుపుతూ అసింహ పరమధర్మమని చాటి చెప్పాడు. ప్రజలు మంత్రముగ్ధులై అతన్ని అనుసరించారు. సరళమైన భాషలో, ఆకట్టుకునే శైలిలో ఈ గ్రంథాన్ని రచయిత రాశారు.

- శృంగారం ప్రసాద్, సెల్ : 9985828323.