నెల్లూరు

నానీల చరిత్రలో తిప్పావఝులకో పేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నానీల తీరం అనే సంపుటితో పెన్నాతీర వాసి తిప్పావఝుల సుబ్రహ్మణ్యం వెయ్యినానీల సంకల్పయాత్ర పూర్తయినట్టే. ఐదేళ్లుగా పట్టువదలని సాహితీ కర్షకుడు తిప్పావఝల. సామాజిక సరిగమలు, తిప్పావఝల నానీలు, నానీ పూలు, నానీలయాత్ర, నానీల తీరం వంటి సంపుటాలతో వెయ్యి నానీలు పూయించారు. నానీల సృష్టిలో అలుపెరుగని కవి సుబ్రహ్మణ్యంగారు. నానీల సృష్టి సామాన్యమైనా వెయ్యినానీల సృష్టి అసామాన్యమే. ఉద్యోగరీత్యా ఉపాధ్యాయుడుగా ఉద్యోగ విరమణ చేసినా రచనకు వయస్సు అడ్డంకి కాదని నిరూపిస్తూ ఆచార్య గోపిగారు అన్నట్టు రచయిత నాలుగేళ్లుగా నానీల్లో జీవించారు. పరిణితమైన ఆలోచనలకు, అనుభూతులకు అక్షరరూపం ఇచ్చారు.
ఆధునిక కవితా ప్రక్రియలో నానీలు వేగంగా దూసుకుపోయే కవితా ప్రవాహం. కవి తాను చెప్పదలచుకున్న భావాల్ని కేవలం కేవలం నాలుగు పాదాలే.. 24 అక్షరాలే అని వదిలేయకుండా చదివితే అందులో గూడార్థం ఇట్టే అర్ధమవుతుంది. ప్రాచీన ప్రౌఢ కావ్యాలు పట్టి పట్టి చదవాలి కాని తిప్పావఝుల నానీలు పట్టి పట్టి చదవక్కర్లేదు.
నదులు కన్న కలలు పొలాల్లో ఫలిస్తాయి... కవులు కంటున్న కలలు పాఠకుల్లో కన్పిస్తాయి అని సుబ్రహ్మణ్యంగారి నానీలు చదువుతుంటే అవగతమవుతుంది. రచయిత అనుభవాలు రంగరించి పొందికైన అక్షర మాలతో కుదిరిన నానీలు మళ్లీ మళ్లీ చదవాలనిపించేలా ఉన్నాయి.
*** ***
ఆనందంగా / పండుటాకు రాలింది / మరో మొక్కకు / ఎరువయ్యేటందుకు
యవ్వనం / ఊగిసలాడే లోలకం / కళ్లెం వేయడమొక్కటే / నివారణ మార్గం
అందం / తాత్కాలికం / చివరికి మిగిలేది / ముడుతల కాయం
రోజూ రోడ్లపై / అడుక్కుంటావేమిటి? / ఆఫీసుపెట్టడానికి / డబ్బుల్లేవుగా!
రాష్ట్రం / రెండు ముక్కలైనా / తీయని తెలుగే / వాటి రెంటికీ వెలుగు
నాన్న మందలించాడని / వేదనా? / నీ ఉజ్వల భవిష్యత్తే / అతని తపన
తూటాకన్నా ప్రమాదం / మాట / తూటా కాల్చేది అంగాన్ని / మాట కాల్చేది అంతరంగాన్ని
ప్రేమంటూ / నాచుట్టూ ప్రదక్షిణలెందుకు? / బాయ్‌ఫ్రెండ్‌గా ఉండు / నా రక్షణకు
రచయితకు నానీల దాహం ఇంకా తీరకూడదని కోరుకుంటూ అతని కలం నుంచి మరిన్ని విభిన్న కోణాల్లో మరిన్ని నానీలు లోకానికి అందాలని ఆశిస్తున్నాను.

- గౌతమి, 9347109377

ప్రతులకు :
తిప్పావఝుల సుబ్రహ్మణ్యం
ఇందుకూరుపేట,
నెల్లూరు జిల్లా.
చరవాణి : 9177823804

విభిన్నంగా సాగిన యుద్ధశాంతి
గత వారం మెరుపులో ప్రచురితమైన యుద్ధ శాంతి కథ చాలా భిన్నంగా సాగింది. రచయిత పిడుగు పాపిరెడ్డి గారి పెళ్లామంటే నువ్వేనే కథ తరువాత అంత బాగా నచ్చిన కథ యుద్ధశాంతి. కథలో భాస్కరరావు, సమీర పాత్రల సంభాషణలు, చిత్రీకరణ చాలా అద్భుతం అనకుండా ఉండలేమండి. నిత్యం చాలామంది ఇళ్లల్లో జరిగే సంఘటనలకు ఈ కథ అద్దం పట్టింది. గతలో కాస్త శృంగార పాళ్లు, కాస్త ఆవేదన, వాస్తవిక కోణం ఇలా అన్నింటిని వండి వార్చిన తీరు సూపర్. ఇద్దరు పిల్లలు అమెరికాలో స్థిరపడ్డాక ఇక వారు తల్లిదండ్రులను చూస్తారనుకోవడం కలే. జీవిత చరమాంకంలో ఆమెకు ఆయన, ఆయనకు ఆమె ఒక వృద్ధాశ్రమంలో అంతిమ శాంతి కోసం ఎదురుచూస్తున్నారు అంటూ కథను ముగించిన తీరు బహు ప్రశంసనీయం. ఈ కథకు ఎన్నో విశిష్టతలు వున్నాయి. అందులో ముఖ్యంగా కార్టూనిస్టును పొగడకుండా వుండలేము. అలా కుదిరింది అంతే. తల్లిదండ్రులకు కనువిప్పు, భార్యభర్తలకు కనువిప్పు, తల్లిదండ్రులను వదిలి ఎక్కడో వుంటున్న పిల్లలకు కనువిప్పు కలిగేలా ఓ కథ రాయడమంటే మామూలు విషయం కాదు. ఒక్క పాపిరెడ్డి గారికే సాధ్యం. ఎందుకంటే ఆయన పేరులోనే పిడుగు ఉంది.
- అచ్చం త్రిపుర, బనిగిసాహెబ్‌పేట, గూడూరు
- అనంతరాము, రైల్వేస్కూలు దగ్గర, బిట్రగుంట
- తిప్పావర్జుల శైలజ, తిరుపతి
- గుడి సత్యనారాయణ, నెల్లూరు బస్టాండ్ రోడ్డు, ఒంగోలు

---
ఎంత చెప్పినా తక్కువే!
మెరుపులో లక్కరాజు గారి కలం నుంచి వెల్లువలా జాలువారిన నీరాజనాలు కవిత గురించి ఎంత చెప్పిన తక్కువే. అందుకే ఏమి చెప్పట్లేదు. కవిత అంత బాగా నచ్చింది. వీర సైనికులకు జీవితాంతం సేవ చేసినా వాళ్ల రుణం తీర్చలేం. సైనికులకు పాదాభివందనాలు.
- హేమంత్ సాయి, నాయుడుపేట
- అల్లం శివకుమార్, వెంకటగిరి