నెల్లూరు

విభిన్నంగా సాగిన యుద్ధశాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత వారం మెరుపులో ప్రచురితమైన యుద్ధ శాంతి కథ చాలా భిన్నంగా సాగింది. రచయిత పిడుగు పాపిరెడ్డి గారి పెళ్లామంటే నువ్వేనే కథ తరువాత అంత బాగా నచ్చిన కథ యుద్ధశాంతి. కథలో భాస్కరరావు, సమీర పాత్రల సంభాషణలు, చిత్రీకరణ చాలా అద్భుతం అనకుండా ఉండలేమండి. నిత్యం చాలామంది ఇళ్లల్లో జరిగే సంఘటనలకు ఈ కథ అద్దం పట్టింది. గతలో కాస్త శృంగార పాళ్లు, కాస్త ఆవేదన, వాస్తవిక కోణం ఇలా అన్నింటిని వండి వార్చిన తీరు సూపర్. ఇద్దరు పిల్లలు అమెరికాలో స్థిరపడ్డాక ఇక వారు తల్లిదండ్రులను చూస్తారనుకోవడం కలే. జీవిత చరమాంకంలో ఆమెకు ఆయన, ఆయనకు ఆమె ఒక వృద్ధాశ్రమంలో అంతిమ శాంతి కోసం ఎదురుచూస్తున్నారు అంటూ కథను ముగించిన తీరు బహు ప్రశంసనీయం. ఈ కథకు ఎన్నో విశిష్టతలు వున్నాయి. అందులో ముఖ్యంగా కార్టూనిస్టును పొగడకుండా వుండలేము. అలా కుదిరింది అంతే. తల్లిదండ్రులకు కనువిప్పు, భార్యభర్తలకు కనువిప్పు, తల్లిదండ్రులను వదిలి ఎక్కడో వుంటున్న పిల్లలకు కనువిప్పు కలిగేలా ఓ కథ రాయడమంటే మామూలు విషయం కాదు. ఒక్క పాపిరెడ్డి గారికే సాధ్యం. ఎందుకంటే ఆయన పేరులోనే పిడుగు ఉంది.
- అచ్చం త్రిపుర, బనిగిసాహెబ్‌పేట, గూడూరు
- అనంతరాము, రైల్వేస్కూలు దగ్గర, బిట్రగుంట
- తిప్పావర్జుల శైలజ, తిరుపతి
- గుడి సత్యనారాయణ, నెల్లూరు బస్టాండ్ రోడ్డు, ఒంగోలు

నీరాజనాలు కవిత గురించి ఎంత చెప్పినా తక్కువే!
మెరుపులో లక్కరాజు గారి కలం నుంచి వెల్లువలా జాలువారిన నీరాజనాలు కవిత గురించి ఎంత చెప్పిన తక్కువే. అందుకే ఏమి చెప్పట్లేదు. కవిత అంత బాగా నచ్చింది. వీర సైనికులకు జీవితాంతం సేవ చేసినా వాళ్ల రుణం తీర్చలేం. సైనికులకు పాదాభివందనాలు.
- హేమంత్ సాయి, నాయుడుపేట
- అల్లం శివకుమార్, వెంకటగిరి

పునరుత్పత్తిలో భావం బాగుంది
శ్రీకంటి గారు రాసిన పునరుత్పత్తి కవితలో భావం చాలా గొప్పగా ఉంది. రంగ రంగుల పూలకు తమ రంగేమిటో తెలుసా అంటూ సాగిన కథ గొప్ప అర్థాన్ని మనముందు వుంచింది. కవిత ఆద్యంత్యం భావోక్తంగా సాగింది.
- తపాల సాయి సందీప్, గాంధీనగర్, గూడూరు

కవితలన్నీ బాగున్నాయ
గతవారం మెరుపులో ప్రచురించిన పునరుత్పత్తి, భూతల స్వర్గం నిర్మిద్దాం కవితలు మానవునికి కనువిప్పు కలిగేలా సాగాయ. రచయతలకు ధన్యవాదములు.
- పాశం అమూల్యదేవి, కందుకూరు
- పచ్చిపాలు సుబ్రహ్మణ్యం, కోవూరు